అడుగులు
ఎక్కడి నుంచో లీలగా ఏదో శబ్దం
నవ్వులా? ఏడుపులా ?
అస్పుస్టంగా ఏదో దృశ్యం
ఆలింగనాలా? తోపులాటలా?
నాలుగడుగులు వేసా
నలుగురు కూర్చొని నవ్వుకుంటున్నారు
ఆనందమేసింది….
ఇంకా ఏదో వినిపిస్తోంది
మరో పదడుగులు వేసా
పాతిక మంది తన్నుకుంటున్నారు
అరుపులు కేకలు….
ఇంకా ఏదో హృదయ విదారకమైన శబ్దం
మరో పాతికడుగులు వేసా
వందలమంది యుద్ధాలు చేస్తున్నారు
ఫిరంగు మోతలలో చావు కేకలు కలిసిపోయాయి
నా కర్ణభేరి చిరిగిపోయింది….
ఇంకా కళ్ళకు అస్పుస్టంగా ఏదో దృశ్యం
మరో యాబై అడుగులు వేసా
వేల మంది లబోదిబోమని ఏడుస్తున్నారు
నా గొంతు పిక్కటిల్లేలా అరిచి చెప్పా
వాళ్ళ ఏడుపులలో నా అరుపులు మరుగున పడిపోయాయి
నా స్వరపేటిక తెగిపోయింది ….
ఈసారి కళ్ళకు స్పష్టంగా అదే దృశ్యం
నాలుగడుగులు వేసి దగ్గరకు వెళ్ళా
నలుగురు నవ్వుకుంటున్న చోటికే చేరా
కళ్ళతో సైగలు చేసి చెప్పాలని చూసా
నన్నో పిచ్చిదానిలా చూసారానలుగురు…….
అస్పుస్టంగా ఏదో దృశ్యం (Aspashtam gaa is the correct usage,To what I believe)
Good indeed but you should have changed the sequence.I had to understand that The life start with happiness and gradually to sorrow then to deep sorrow. Of course not a mistake in your writing but I admit as a mischief in my understanding. Of course Stood the individual feeling of mine no a remark on your writings.
Hari Krishna garu: I am pasting a comment made by Narra Venu gopla garu inFB for this post. Thats the meaning I had in my mind.
Narra Venu Gopal: naluguru,patika,vandalamandi, velumandi………..Rajakiya nayakulu,Scam veerulu,Corporate company owners aa navvukuney naluguru . Unnata vargalu varu paiki vellalani kottu kuntunnaru.Madyataragati vallu samasyalato Yuddalu cheystunnaru.Pedavallu valla sasyalu teeraka labo dibo mantunnaru…… Malli veelanta aa naluguru chuttu tiugutuney undali