దేవుడు
దేవుడు ఒక నమ్మకం
మన చేతిలో లేనిదేదో
మరేదో తెలియని శక్తి
తన చేతుల్లోకి తీసుకుని
సరైన దారిలో నడిపిస్తుందన్న
ఒక విశ్వాసం…
దేవుడు ఒక ఆశ
అంతా మంచే జరుగుతుంది
ఆపైవాడే చూసుకుంటాడు
ఆ తెలియనివాడే ఆదుకుంటాడన్న
ఒక మానసిక ఆసరా…..
మతం
దేవుడు కేంద్రంగా
మనుష్యుల చుట్టూ అల్లిన
కట్టుబాట్ల కంచె…
taitil chudagane chadavalanipinchindi…pratiokkari bhavamu ade ayina meelaga express cheyyagaligedi endaru??
lakshmi raghava garu: ఇవన్నీ మనమందరమూ అనుకునేవే. ధన్యవాదాలు