గెలుపో? ఓటమో?
ఎదలో ప్రశ్నల మీటలు,
మధిలో సమాధానాల వెతుకులాటలు,
ఎద, మధి సంవిధాన సమరంలో,
గెలుపోటముల వ్యత్యాసం అతి స్వల్పం.
ఆలోచనల సాయంతో,
ఆశయాల మెట్లు ,
ఒక్కొక్కటి ఎక్కుతూ,
తెలుసో తెలియకో,
ఏ పాకుడు పట్టిన చోటో అడుగేసి,
జర్రున జారి మళ్లీ చేరాను,
మొదలు పెట్టిన చోటుకే ఎన్నోసార్లు.
ఎగబాకే స్వభావం చావలేదు,
దిగజారేతత్వం చోటివ్వలేదు.
ఈ జారుడు బల్లల ఆటలో,
అలిసిన చేతికి,
ఊతకర్ర సాయంగా వచ్చి చేరింది,
మనక బారిన కళ్ళకు,
చెత్వారం చూపునిచ్చింది,
నోట్లభారం లేని జేబు వెనుకనున్న,
గుండెలోని మనసు,
తేలికగా హాయిగా ఎగిరిపోయింది,
గెలుపో ఓటమో…లోకానికి వదిలేస్తూ….
ప్రవీణ గారు, మీ కవిత చాలా చాలా బాగుంది.
super. but gelupotami chudaka Nijaaithee chusthe saraunemo…