ఎవరిని తప్పుపడదాం?


ఎవరిని తప్పుపడదాం?

ఆ తండ్రి,
నెలరోజులుగా ఆస్పత్రి మంచంపై,
చావుబతుకుల మధ్య ఊగిసలాడుతున్నారు,
కూతుళ్ళు , కొడుకులు,
దేశ విదేశాల నుంచి,
ఆఘమేఘాలపై వచ్చి వాలారు.
కన్నీరు ఒలికింది,
కాలం కరిగింది,
తిరుగు ప్రయాణం టిక్కెట్టు,
రెపరెపలాడింది,
ఇంకా ఆయుష్షు తీరని,
తండ్రి ప్రాణంలా,
ఉద్యోగ ధర్మం ఊగిసలాడింది,
తల్లి కళ్ళలోని,
ఆశా నిరాశల నడుమ నిస్సహాయంగా.
మనసు చంపుకుని,
ఎక్కడి నుంచో తెలివిని,
అద్దెకు తెచ్చుకుని,
మరెక్కడి నుంచో,
రెండు బలీయమైన చేతులు,
పురామాయించుకుని,
బలవంతంగా నేట్టివేయబడ్డారు,
వంతులవారీ రాకపోకల,
ప్రణాళికలు సిద్ధం చేసుకుని,
ఎవరిని తప్పుపడదాం?????
భగవంతుడినా? బతుకు సమరాన్నా?????

This entry was posted in కవితలు, కష్టం. Bookmark the permalink.

10 Responses to ఎవరిని తప్పుపడదాం?

  1. seva says:

    పిల్లలను కష్టపడి పెంచి..పెద్దోల్లను చేసి …చదివించి.. పెళ్లిల్లుచేసి.. ఒక దారి చూపించడమే.. మన భాద్యత..
    పిల్లలపై ఆశలు పెంచుకొనే రోజులు పోయాయి.
    పాశ్చాత్య ప్రభావం మనపై పడింది. రేపటి శత్రువులు ఎవరో కాదు కన్న బిడ్డలే..
    మాతృదేవోభవ , పితృదేవోభవ.. లాంటివి.. సూక్తులుగానే మిగిలి పోయాయి.

  2. Anonymous says:

    ప్రపంచీకరణ …సరళీకరణ ..ప్రైవేటీకరణ భూతాలు మనవ మనుగడను ఎంతగా ప్రభావితం చేస్తున్నాయో మీ.. కవితను చదివితే తెలుస్తుంది. సంపాదన యావలో పడి కొట్టుకుపోతున్న సగటు మనిషి ప్రవర్తనను కళ్ళకు కట్టినట్లుగా వర్ణించారు. చాలా బాగుంది. కీప్ ఇట్ అప్ ………….

  3. Hari Krishna Sistla. says:

    Excellent indeed.
    ఆ మాత్రం ఆస్వాదించలేమా జీవితాన్ని? and this writing of yours almost resembled same opinion,If am not mistaken.

  4. Anonymous says:

    కడుపు నిండని వాడి బ్రతుకు సమరమే ఐతే నిందకే ఆస్కారం లేదు. కదలిలేని ఆ తండ్రి కూడ లోలేనే మరింత ఆశిస్తాడు తన శక్తిని కూడ తన బిడ్డే పొంది మరింతగా నిలబడగలగాలని. అదే కడుపు నిండిన వాడిది ఐతే అది సమరం కాదు (సరిపడ డబ్బు సంపాదించాక కూడ) . మీరు వ్రాసిన సమరం కడుపు నిండని వారిదె ఐతే నిందకు తావు లేదు. అదే కడుపు నిండి మరిన్ని కోట్లు ప్లాట్లు కోనాలనుకునే వారి సమరం ఐతే నిందిన్చవలసింది ఆ బిడ్డలనే కాని భగవంతుడిని కాదు, బ్రతుకు సమరంని అంతకన్నా కాదు . ఓ చిన్న మాట, తండ్రి రెక్కలు రాని తన బిడ్డలు తనముందే పెరగాలని ఆశించి కష్టపడతాడు, చేదోడు వాదోడుగ వుండి అన్ని బుద్ధులు నేర్పిస్తాడు అంతేకాని ఓ ఐదు నక్షత్రాల హోటల్ లో వుంచి తన బిడ్డలకి అన్ని అమర్చానని అనుకోడు, భాద్యత ఎవరి మీద వదలడు. అలానే బిడ్డలు కూడ తల్లిదండ్రుల అవసాన దశలో వారికి కూడ అలాంటి ప్రేమనే పంచాలి.

    మాతృ దేవోభవ పితృ దేవోభవ అనేది మనం నేర్చుకున్న సామెత కాకూడదు అది ఆచరణ లో చూపించి ఆ సామెత విలువ మరింత పెంచాలి.

  5. naveenachari says:

    పంటలు పండక బతుకుతెరువు కోసం, పిల్లలకు నాలుగు మెతుకులు పెట్త్డానికి పొట్టచేతపట్టుకొని లేబర్ పనులకు పోతే అది ఒక రకం.
    ఇక్కడ ఏసీ రూముల్లో ఉండి చేసే ఉద్యోగం నచ్చక.. ఇంకా ఇంకా సంపాదించాలని ఇక్కడొస్తున్న లక్షలు సరిపోక ఇంకా అత్యాశ తో పోతే అది మరో రకం.
    రెండూ ఒకటి కాదు.
    కేస్ ను బట్టి కామెంట్..

  6. phani says:

    మంచి కవిత, అంశం ఎదైనా దానికి రెండు పార్స్వాలు వాటిని సమర్ధించె వాదాలు మామూలే, ఏ వొక్క వాదనని సమర్ధించ లేనప్పుడు ఆ దుగ్ధని వ్యక్తపరిచె ఒక సాహితీ ప్రక్రియే కవిత, అలాకాకుండ మనం ఒక ముక్తాయింపుకొచ్చినప్పుడు దన్ని ప్రతిపాదిస్తు ఒక కధనొ/నవలనొ రాస్తం (so opinions from all sides itself saying u had succeeded in it) కాని ఒక్క మాట ఈ కవితలొ అవసరంలేని దగ్గర విరామ చిహ్నాలు వున్నయి వతిని పరిష్కరిస్తే కవిత శక్తి పెరుగుతుంది…. Bravo..

    • Phani garu: Thanks for ur comment. “విరామ చిహ్నాలు వున్నయి వతిని పరిష్కరిస్”….I didn’t get you andi, if u don’t mind, would you please explain me this.
      To be honest I am not a writer…తోచిందల్లా రాసేస్తూ వుంటాను. సో నాకీ పదాలు అర్థం కాలేదు..

      • phani says:

        spelling mistake actually it is అవసరంలేని దగ్గర విరామ చిహ్నాలు వున్నాయి వాటిని పరిష్కరిస్తె కవిత శక్తి పెరుగుతుంది (its better to remove unnecessary comas(,) to improve readability). Sorry for the inconvenience caused

  7. phani says:

    there is also a reply on ur topic పతిదేవులకు పత్నీదేవత రాసిన ఉత్తరం: ( భార్యలకు మాత్రమే. భర్తలకు నిషేధం.) go through it

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s