ఆ మాత్రం ఆస్వాదించలేమా జీవితాన్ని?
గోరువెచ్చటి ఓ సూర్యకిరణం వెండి మబ్బులను చీల్చుకుని నేలను తాకింది శుభోదయమంటూ,
సుదూరం నుంచి లీలగా వినిపిస్తుంది ఏదో పక్షి పలకరింపు “బాగున్నావా?”, అంటూ ఆప్యాయంగా,
బాల్కనీలో పెట్టిన కుంపటిలోని గులాబి మొక్క మొగ్గేసింది ఆశకు చిగురులు తొడుగుతూ,
ఇంట్లో అందం కోసం అమర్చిన ఎక్వేరియంలోని చేపలు గిరగిరా తిరుగుతున్నాయి హుషారుగా,
గోడకు వేలాడదీసిన బాపు బొమ్మ, ఎదురుగా ఉన్నAbsurd painting వైపు తదేకంగా చూస్తుంది అర్థం చేసుకుందామని,
వంటిట్లో విన్యాసాలు చేస్తున్న ఆ శ్రీమతికి ఇవన్నీ పట్టించుకునే తీరికే లేదు,
హాల్లో న్యూస్ పేపర్ నమిలి మిగేస్తున్న ఆ శ్రీవారికి చుట్టూ చూడటానికి అంతకంటే తీరిక లేదు,
నున్నటి తారురోడ్డుపై కారులు రయ్యిన దుసుకుపోతున్నాయి, యంత్రాలు ఇంధనాలు కదూ మరి……
రోజుల తరబడి రొటీన్ ఇంతేనా??
ఆమాత్రం ఆస్వాదించలేమా రోజు రోజునీ?!!!!
ఓ పావుగంట ముందే నిద్ర లెగిసి,
వేడి వేడి కాఫీ కప్పుతో బాల్కనీ తలుపు తెరిచి,
సూర్యోదయానికి స్వాగతం పలుకుతూ,
కుంపటిలో నీళ్ళు పోసి, గులాబీని స్పర్శించి,
చేపలకు మేత వేసి,
పలకరించలేమా రోజుని?!
ఓ క్షణం బాపుబోమ్మతో “ఏమి అర్థం చేసుకున్నవోయ్?”, అని కళ్ళెగరేసి,
మరో క్షణం అర్థం కానట్టున్న ఆ painting వైపు నిశితంగా చూస్తే,
అర్థం కాదూ ఆరోజెంత అందంగా ఉండబోతుందో?
ఎంత సమయం కావాలేంటి,
ఈ చిన్ని చిన్ని ఆనందాలు ఆస్వాదించటానికి?
busy busy అనేటంత సమయం చాలదూ?
ఆ మాత్రం ఆస్వాదించలేమా జీవితాన్ని?
ప్రవీణ గారూ !
సత్యం చెప్పారు. జీవితాన్ని ఆస్వాదించడమనేది మన మనసుల్లోనే వుంది. దొరికిన కాస్త సమయాన్ని హాయిగా అస్వాదించడం చేతకాని వాళ్ళు మాత్రమే నేను చాలా బిజీ అని చెప్పుకుంటూ తమని తాము మోసం చేసుకుంటారు.అబినందనలు.
నిజమెసుమా అని అనాలనిపిస్తుంది కాని మళ్ళి మామూలె…..
Good Idea to call.
In my childhood we had to read the books with Normal BP readings as 140/80.The books now a days quote the one as 120/80.My self,of course was aiming towards the changing habits.నున్నటి తారురోడ్డుపై కారులు రయ్యిన దుసుకుపోతున్నాయి, యంత్రాలు ఇంధనాలు కదూ మరి…No necessity of Physical effort only Mental effort is required to drag our lives,now a days.
kastamemo net undaga.
ప్రవీణ గారూ కవిత బావుంది. ఇదే ఇతివృ౦తో కొన్ని నెలల క్రితం ఓ కథా ప్రయత్నం చేశాను. మీకు ఓపికుంటే చదవండి.
Nijame.. raavalandi maarpu Aalochanalone