జీవితం
కాలం,
సముద్రపుటొడ్డున ఇసుక రేణువులతో,
గూడు కట్టి దారి చేసినా,
పిడికిలిలో బిగించి విసిరేసినా,
అలలలో కలిసిపోఏవే,
జ్ఞాపకాలను మాత్రమే మిగులుస్తూ……..
జ్ఞాపకాలు,
కరిగిపోని పులకరింతలు కొన్ని,
కరుడుగట్టిన కన్నీటి గాధలు మరికొన్ని,
కొన్ని మరికొన్ని అన్నీ,
అనుభవాల శఖలాలే…….
అనుభవాలు,
పాఠాల సూక్తులలో,
గునపాఠాల పోటులు,
జీవన మార్గపు ఎత్తుపల్లాల,
అధిరోహణ అవరోహణ,
ఆశాప్రయాశల ప్రయాణపు మజిలీలు…..
ప్రయాణం,
దిక్సూచి సాయంతో,
తెరచాప తోడుతో,
గమ్యపు నిరంతరాన్వేషణ…..
గమ్యం,
కాలం ప్రయాణంలో మిగిలిన అనుభవాల జ్ఞాపకాలు….జీవితం
కాలం ప్రయాణంలో మిగిలిన అనుభవాల జ్ఞాపకాలు….జీవితం……!! ఈ వాక్యం బాగుంది
Good one.I am left with No Comments.
Hari Krishna garu:: finally….Iam so glad, nxt post lo malli elagu vuntayi suggestions.. 🙂
nice
కాలం ప్రయాణంలో మిగిలిన అనుభవాల జ్ఞాపకాలు….జీవితం
chaalaa chaalaa baagundi..
good cala bagaundi
జీవితం
అడగకుండా పోంది
చెప్పకుండా పోగొట్టుకునే
పుట్టుక చావుల మధ్యన
తెలియక గడిపిన కాలం
కాలం
తయారుచేసుకున్న అవసరాలకి
తీర్చుకోవాల్సిన తాపాలకీ నడుమ
గత్యంతరంలేక ఏర్పరుచుకున్న
గతి – అంతరాల నిరీక్షణ..
నిరీక్షణ…
ఉద్వేగావేశాల మధ్యన
నిచ్చేష్ట నిట్టూర్పుల మధ్యన
సాగలేని ఆగలేని
స్తబ్దమైన ఆలోచన…
ఆలోచన…
అడగకుండానే అల్లేసుకుని
చెప్పెకుండానే చేరిపోయి
తెలియకుండా పెదాలపై తెచ్చే
చిరు నవ్వుల చిగురాశ !…
ఆశ…
అనాది-అనంతాల నడుమ
అనుకూలమైన గాలి తెమ్మెరకోసం
నడి సంద్రంలో విప్పి పెట్టుకున్న
తెరచాపకున్న తెగువ….
తెగువ ….
నిజానిజాలని భయాభయాలని
జయాజయాలని సుఖాసుఖాలని
లెక్క జేయక పక్కకు జరగక
ముందుకు దూకే మనోస్వతంత్రం…
సత్య…
very nice