ఆ రాత్రికి మర్నాడు


ఆ రాత్రికి మర్నాడు

ఆరాత్రి,
నల్లటి మేఘం మనసంతా కమ్ముకుంది,
హృదయానికి చిల్లులు పడినట్టు,
బోరున కళ్ళు వర్షిస్తూనే ఉన్నాయి,
ఆశలు కొట్టుకుపోయాయి,
ఆలోచనలు విరిగిపడ్డాయి,
ప్రళయం ముంచెత్తిన భావన ……
ఆ మర్నాడు,
గోరు వెచ్చటి సూరీడి కిరణాలు మనసుని తాకాయి,
హృదయం నిర్మలంగా ఉంది ఆకాశంలా,
కడిగిన ముత్యంలా మెరిసిపోతోంది లోకమంతా,
చిగురాకు కొనన నిటి బిందువులా మెరుస్తోంది ఆశ,
సప్తవర్ణాల ఇంద్రధనస్సును ఎక్కుపెట్టాయి ఆలోచనలు,
ఆ రాత్రికి మర్నాడు,
ప్రళయం కాదు ఆరంభం…

This entry was posted in కవితలు, కష్టం. Bookmark the permalink.

5 Responses to ఆ రాత్రికి మర్నాడు

 1. చాలా చక్కగా వ్రాసారు ప్రవీణ గారు…మరి ఆ రాత్రి అలజడి కి కారణమేంటో చెప్పనే లేదు….

 2. Anonymous says:

  nacchindhandi.. chala baaga raasaru..

 3. Hari Krishna Sistla. says:

  Good sensible feeling indeed.
  ఆ రాత్రికి మర్నాడు,
  ప్రళయం కాదు ఆరంభం…
  Though the one is good,Try with these landing -aa raatriki marunaadu ;nenu maru bhoomilo lenu
  -Maro yuddhhaaniki sannaddhamaina sainikudilaa unnaaanu
  or
  – maro marubhoomi modatilo unnaanu. (Lengthens the writing but stay sensible to best what I felt)

 4. David says:

  మీ కవిత, బోమ్మ రెండు చాలా చాలా బాగున్నాయి.. ప్రవీణ గారు

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s