సమాజం


సమాజం
  
సమాజమంటోంది,
నేనో సాగర ప్రవాహమని,
నేనన్నాను,
నువ్వో దాహం తీర్చని ఉప్పటి ద్రవమని,
నాకనిపించింది,
ఓ పదునైన పాళీ తయారు చేసుకుని,
సముద్రాన్ని కలంలో సిరాగా నింపి,
కసితీరా రాసెయ్యాలని….
సమాజం నోటితో నవ్వి,
నొసటితో వెక్కిరించింది.
“ఏంటని?” అడిగా,
“ఏం రాస్తావేంటి?”, వ్యంగ్యం వుట్టిపడింది,
“నీ గురించే రాస్తా…నీలోని మనుషుల గురించే రాస్తా”, 
పాళీ పదును పెడుతూ చెప్పా,
“మనుషులు నాలోని లవణాలు కాదా?”, హృద్యంగా నిలదీసింది,
హు…లవణ స్పటికలకు దాహమా?
ఏ దప్పిక గురించి రాయను?
పదును తేలిన పాళీ గుచ్చుకుంది,
చూపుడువేలు స్రవిస్తోంది,
చట్రంలో చితికిపోయిన ఎందరో బతుకుల సాక్షిగా,
తెల్లకాగితం రంగు మారింది….
 
This entry was posted in కవితలు, ప్రజాస్వామ్యం. Bookmark the permalink.

1 Response to సమాజం

  1. Hari Krishna Sistla. says:

    Saagara pravaaham is not the term used,To the best of mine.”Saagara jalaanni kalam lo nimpi”,might have suited well in rhythm.(Jalamu-Kalamu).stood the suggestions of mine.

    HAPPY RAKHI TO YOU AND THE FAMILY OF YOURS -Thy Ever.-HK Sistla.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s