కన్నీరు
కనురెప్పల మాటున దాగని కన్నీరు,
పరదా చాటు దాటితే,
పరువు తక్కువంట??!!
ఆనకట్ట కన్నీరు,
ఎదలో ఎగిసిపడే అగ్గిశిఖలపై,
చిలకరిస్తే చల్లారేనా ?
కట్ట తెగిన కన్నీరు,
చెంపలపై జారి,
గుండెలో ఇంకిపోతే,
మనసు భారం తగ్గేనా?
ఘనీభవించిన కన్నీరు,
నలుసై గుచ్చేది,
కనులలోనా కలతలలోనా?
మరుగుతున్న కన్నీటి సెగలో,
కాలిపోతున్నది నువ్వా? నీ పరువా?
ఎద పరిధిలో నిక్షిప్తమైపోతున్న,
నీ కన్నీటి సంపదకు వారసులు,
నువ్వా? నీ పరువా?
Good Literature.
గుండె లోనె ఇంకిపోతె (instead of ఇంకిపొతే )
మనసు భారం తగ్గెనా (Instead of తగ్గేనా )
Though the one is good,But if you have used this words the one might have set still perfectly.
good!!!!praveenaa!!! nice one……“Tears are words the heart can’t express”