ఆమె


ఆమె

వ్యక్తిత్వం నిలువెల్లా అలకరించుకుని,
తనకేం కావాలో,
దానికేం చెయ్యాలో,
స్పష్టమైన ఆలోచనలతో,
ప్రస్పుటమైన అభిప్రాయాలతో,
ఆత్మగౌరవం పరిధిలో,
నిర్మించుకున్న సామ్రాజ్యపు,
సింహాసనం అధిరోహించేది ఆమె మాత్రమే.

ఆమె రాజ్యంలో ఆమె అధికారాన్ని,
అంగీకరించలేని అతిధిలు ప్రసాదించిన,
పొగరు గర్వమనే బిరిదులు స్వీకరించి,
అలా వచ్చిన వారిని ఇలా సాగనంపింది ఆమె.

ఆమె సింహాసనంలో ఆమె స్థానాన్ని,
తిరస్కరించిన వీరులు,
“ఆడదేనా?!” అంటూ,
అసహ్యాన్ని ప్రకటిస్తూ,
ఆశ్చర్యాన్ని దాచేస్తూ,
తమని చూసి తాము పడే సిగ్గును,
పరుల కంటపడకుండా,
పలాయనం చిత్తగిస్తున్న వారిని చూసి జాలిగా నవ్వింది ఆమె.

ఆమెలో ఆమెను,
గౌరవించి, అర్థం చేసుకుని, ప్రోత్సహించిన వారిని,
అందలం ఎక్కించి, ఆత్మీయతను పంచి,
తనలోని భాగానికి భాగస్వామిని చేసింది ఆమె.

ఎవరు వచ్చి ఏది వదిలి వెళ్ళినా,
స్రవిస్తున్న రక్తాన్ని తుడిచేసుకుంటూ,
గెలుపోటములు లెక్కచెయ్యకుండా,
యుద్ధం చేస్తూనే ఉంది సమాజంతో,
తన సామ్రాజ్యాన్ని రక్షించుకోవటం కోసం.

ఆమె కొలువు, రాజ్యం సువిశాలం,
చేతులు రెండూ చాపి స్వాగతిస్తూనే ఉంటుంది,
అతిధులను, వీరులను స్తిరనివాసం కోసం,
ఎంతైనా ఆడది కదా……..

ఇంతకీ ఎవరామె?!
అర్థం చేసుకునే మనసుండి,
గౌరవించగలిగే సంస్కారముండి,
అంగీకరించగలిగే ధైర్యం ఉన్ననాడు,
చుట్టుపక్కల చూస్తే కనిపించరూ ఎందరో ఆమెలు??
“నాకైతే కనిపించలేదు”, అంటూ కళ్ళు మూసుకోకండోయ్….

This entry was posted in కవితలు, నా ఆలోచనలు, మహిళ. Bookmark the permalink.

12 Responses to ఆమె

  1. tolakari says:

    ఆమె…అద్భుతం.

  2. G says:

    “అసహ్యం” అనే మాట పంటి క్రింద రాయిలా అనిపించింది ఎందుకో. అదే అర్థం వచ్చేలా వేరే మాట కవిత ఫ్లోలో కలిసేలా ఏముందబ్బా? ప్రయత్నించండి

    అద్భుతమైన కవిత మొత్తానికీ చాలా రోజుల తరువాత

  3. Hari Krishna Sistla. says:

    Good indeed,రేపటి నా సామ్రాజ్యం అన్న పదం ఒకటి ఉంటే – కారణం ఆమే కదా. (If there persists a term ‘Tomorrow’s my kingdom,She stood the reason – I did mean expansion of generation)

  4. satya says:

    ప్రవీణ గారు ……..

    ఆమె ప్రత్యేకమైంది కాదు….
    ప్రత్యేకంగా చూడాలనే భావనే తప్పు…
    ప్రత్యేకం పేరుతో ఆమెని వేరుచేయడమే తప్పు….
    ఆమె అందరాని కొమ్మ కాదు …
    అమె అపరంజి బొమ్మ కాదు…
    అధికారం, గౌరవం, మనసు, అందరితో పాటే వస్తాయి
    అందరితో పాటే కలిసి పంచుకుంటుంది…. ఇచ్చిపుచ్చు కుంటుంది..
    ఇక్కడ ’ఎవ్వరికీ’ అధికారం, గౌరవం, అర్థం చేసుకునే మనసు, అడిగి తీసుకునే అవసరం లేదు…
    అలాగని ఇస్తే, కాదనేదీ లేదు…
    ఇవి అమెకి అందజేసే క్రమంలో అడ్డు పడే వారు అసలు లెక్కలోకే రారు…
    అమె మహారాణీ కాదు …
    ఆమె నౌక్‍రాణీ కాదు…
    ఆమెకి అసలు పరిదులే లేవు…
    ఆమె ప్రత్యేకమై లేదు…
    ఆమె ప్రతిఒక్కరిలో ఏకమై వుంది….
    అమె, ఆమే!… ఆమె ఆమెనే!

  5. satya says:

    ప్రవీణ గారు

    ఆమె ప్రత్యేకమైంది కాదు….
    ప్రత్యేకంగా చూడాలనే భావనే తప్పు…
    ప్రత్యేకం పేరుతో ఆమెని వేరుచేయడమే తప్పు….
    ఆమె అందరాని కొమ్మ కాదు …
    అమె అపరంజి బొమ్మ కాదు…
    అధికారం, గౌరవం, మనసు, అందరితో పాటే వస్తాయి
    అందరితో పాటే కలిసి పంచుకుంటుంది…. ఇచ్చిపుచ్చు కుంటుంది..
    ఇక్కడ ’ఎవ్వరికీ’ అధికారం, గౌరవం, అర్థం చేసుకునే మనసు, అడిగి తీసుకునే అవసరం లేదు…
    అలాగని ఇస్తే, కాదనేదీ లేదు…
    ఇవి అమెకి అందజేసే క్రమంలో అడ్డు పడే వారు అసలు లెక్కలోకే రారు…
    అమె మహారాణీ కాదు …
    ఆమె నౌక్‍రాణీ కాదు…
    ఆమెకి అసలు పరిదులే లేవు…
    ఆమె ప్రత్యేకమై లేదు…
    ఆమె ప్రతిఒక్కరిలో ఏకమై వుంది….
    అమె, ఆమే!… ఆమె ఆమెనే!

    • Jyothi kalyanam says:

      I Agree with u, aame ki evva galigina vallu evarunnaru?
      Aadade aadharam, mana kadha aadane aarambham evaru
      oppukunna, oppukokapoiena edi nijam….. EDE nijam.

  6. Pingback: ఆమె – 2 | మనసుతో ఆలోచనలు…

  7. Mauli says:

    సరదాగా ఒక ప్రశ్న ,

    @ యుద్ధం చేస్తూనే ఉంది సమాజంతో,
    తన సామ్రాజ్యాన్ని రక్షించుకోవటం కోసం.

    హ్మ్ ఆమె సోనియా గాంధీ నా 🙂 విజయమ్మ గారా 🙂

    మొదటి నాలుగు పేరాలు బావుంది. ఆమె ఎక్కడ ఉందో చెప్పక పొతే బాగుండేదేమో (ఇది నా అభిప్రాయం మాత్రమె )

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s