నిద్ర పట్టని రాత్రి
బెడ్ లాంప్ చుట్టూ జ్ఞాపకాలు ముసురుకుంటాయి
చేతి విదిలింపుతో తరిమేయ్యలన్న ప్రయత్నంతో
పారిపోయినట్టే పోయి
మళ్లీ కమ్ముకుంటాయి….
బోరున ఏడుపు రాదు
గుండె బరువు తీర్చుకోవటానికి.
కనుకొన నుంచి ఆగి ఆగి రాలుతున్న,
ఒక్కో చినుకులో
తడిసిన తలగడ
చెంపకు ఆని
గుండె తడిని గుర్తుచేస్తుంది ప్రతీ రాత్రి…
దీపం కొండెక్కించి
చీకటిలో నిద్రపోదామంటే
వెలుతురులో రాచుకున్న
జ్ఞాపకాలతో నిద్ర పట్టని రాత్రులెన్నో….
The sentencing “దీపం కొండెక్కించి,….చీకటిలో కనుమూయలేక”.May give a different meaning than to which we are expecting, I feel.
I beg your apology if I did hurt your feelings.
Why I could not find your writings after 12 th day of July’011in this blog?.Let me hope everything is going well.
Hari Krishna garu: Every thing is fine, Vacation ki india vachhanu, so little busy. Thx for ur msg, it gives me encouragement.
Nice