ఒక్కసారి ఒకే ఒక్కసారి


ఒక్కసారి ఒకే ఒక్కసారి

ఒక్కసారి ఒకే ఒక్కసారి, ఈ virtual   ముసుగులన్నీ తీసి పక్కన పెట్టి……”నేను బాగానే ఉన్నానులే”, అన్న ముసుగు కూడా తీసేసి,

మనసు లోతుల్లో ఆణువణువూ స్పృశిస్తూ, “సంతోషంగా ఉన్నానా?”, అని గొంతెత్తి అరిస్తే…..

బండరాతి గుండెల మధ్య పలుమార్లు ప్రతిధ్వనించి ఉక్కిరి బిక్కిరి చేస్తుంది అదే ప్రశ్న.

బండరాయి శబ్దం తప్ప సమాధానం ఇస్తుందా?

ముసుగులు కప్పీ కప్పీ ఊపిరాడకుండా చేసి ప్రాణం తీసిన గుండె కదూ?…. పాపం ఎండిపోయింది…..

ఒక్కసారి ముసుగులన్నీ తొలిగేటప్పటికి, మళ్లీ ఊపిరి పిల్చుకోవాలని ప్రయత్నం. కొన ఊపిరి అందగానే ఏదో ఆనందం…నగ్నత్వంలో  స్వచ్ఛతలాగా…..

స్వచ్ఛత సువాసనను వెదజల్లే స్వేఛ్చను ఊపిరిగా పీల్చుకుంటూ మళ్లీ ప్రాణం పోసుకుంటున్న గుండె స్పందించటం మొదలు పెట్టింది.

 ఆ స్పందనలో ధనం, దర్పం, అధికారం ఏమీ లేవు….స్వచ్ఛత తప్ప…

గుండెల నిండా ఊపిరి పీల్చి వదిలే సరికి, సుదూరంగా అలజడి  శబ్దం. లోకం శరవేగంతో పరుగులు పెడుతుంది,  సునామీ కాలం వెంబడిస్తున్నట్టు……

తిరిగి ముసుగులు వేసుకోవాల్సిన సమయం ఆసన్నమయింది. మనసు ఒప్పికోవట్లేదు…సునామి తరుముకొస్తుంది…..

ఓ ముసుగును అక్కడే వదిలేసి మిగతావన్నీ తగిలించుకుని లోకంతో పాటు పరుగులు.

ఏ అలిసిన క్షణానో మరోసారి ఈ ఒకే ఒక్కసారి అంటూ ముసుగులు తొలిగించకపోతానా……మరో సంఖ్య తగ్గించుకోకపోతానా…..

This entry was posted in కష్టం, జీవితం, వ్యాసాలు. Bookmark the permalink.

3 Responses to ఒక్కసారి ఒకే ఒక్కసారి

  1. Phaneendra says:

    absolutely correct ….

  2. Siva Cheruvu says:

    Nice expression! I can see the positive approach at the end of your post. People think that we are compromising for some one. However, it’s a wrong idea. We compromise for our selves .. either temporarily or permanently.. When we start compromising we start wearing those masks. But getting rid of them is not so easy…

    All the best!
    Siva Cheruvu

  3. Hari Krishna Sistla. says:

    Nice is the expression. Good thought indeed.Still attained higher level of perfection if the landing sentence was “ఒక సారి తొలగించుకున్న ముసుగులని మరోసారి తగిలించుకునే సాహసం చేయగలనా….”?
    However the literature is good though it did not contain that sentence.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s