ఘనీభవించిన ఈ క్షణం
ఘనీభవించిన ఈ క్షణం,
ముక్కలవుతున్న హృదయంలో,
ప్రతీ ముక్క ఏరుకుంటూ
జీవించాలి వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ…
ఘనీభవించిన ఈ క్షణం,
స్పందన క్షీణించిన,
యద సవ్వడిని ఆలకిస్తూ,
జీవించాలి అస్తిత్వాన్ని నిలుపుకుంటూ…
ఘనీభవించిన ఈ క్షణం,
మూగబోయిన మనసును,
ఓదారుస్తూ ఓపికగా,
జీవించాలి మనుగడకు అర్థం చెపుతూ…..
ఘనీభవించిన ఈ క్షణం,
నిరాశను ఆస్వాదిస్తూ,
ఆశకు ప్రాణం పోస్తూ,
జీవించాలి అలసటను ఓదారుస్తూ…
ఘనీభవించిన ఈ క్షణం,
కఠినత్వాన్ని ఆపాదించుకోకముందే,
పొదిగి పట్టుకుని,
జీవించాలి సున్నితత్వాన్ని కాపాడుకుంటూ…
ఘనీభవించిన ఈ క్షణం,
కాలంలో కరిగి నీరవకముందే,
జీవించాలి జీవితాన్ని వెతుక్కుంటూ….
manchi feel rasaru
Appreciable literature. Might have been still better if you did use the words ” ….Prati mukkanu yerukuntoo”,”…..Ghaneebhavinchineekshanam”(Instead ghanee bhavinchina ee kshanam).
Gave a good feeling,However.