పెళ్లి బంధమా? ప్రతిబంధకమా?
మూడు ముళ్ళు, ఏడడుగులు,
మంగళ సూత్రాలు, మట్టెల,
లెక్కలు తెలీవు కానీ,
మనుషులను మనసులతో ముడివేసే బంధం,
ఆత్మీయతను బంధించే అనుబంధం,
కష్టనష్టాల ఆటుపోటులలో కొట్టుకుపోకుండా,
ఆసరాగా ఆదుకునే అనురాగం.
తప్పొప్పుల కలగాపులగంలో,
ఓ తప్పు, ఓ మాట,
నిప్పులా దాహించేసినా,
మరో ఒప్పు, మరో మౌనం,
నిప్పుతో కడిగిన నిజాలే.
ఓ రోజు విసుగనిపించినా,
ఓ క్షణం వద్దనిపించినా,
మరో రోజు అక్కున చేర్చుకుని,
మరో క్షణం సేద తీర్చేదే.
చిక్కులున్నాయని,
కుటుంబంలో చిక్కుకుపోని జీవి,
గాలిపటంలా ఎగరటం స్వేచ్ఛా?
ఎదుగుటకు హద్దులుంటే ప్రతిబంధకమే,
జీవితానికి లోబడి,
నైతికతకు కట్టుబడి,
బతకటం కోసం హద్దులుంటే ప్రతిబంధకమా?
అంతరాత్మ హెచ్చరిస్తున్నా,
మనసు మాట విననప్పుడు,
సమాజం, విలువలు, కుటుంబం, బాధ్యతలు,
మనసుకి కట్టిపడేస్తే తప్పా?
మనసు చంపుకుని బ్రతకమని కాదు,
మనసుకి,
మనుషులతో, మమతలతో, బంధాలతో,
ప్రాణం పొయ్యి ….అది కుటుంబంతోనే సాధ్యం,
పెళ్లి కుటుంబానికి నాంది,
మరి పెళ్లి బంధమా? ప్రతిబంధకమా?
Read an article about premarital, live in relations..
కోపానికి మించిన బాధ, చిరాకుకు మించిన కష్టం, ఏమూలో రాబోయే రోజులంటే భయం అనిపించింది. యాంత్రికంగా ఎంత వేగంగా పరుగులు పెడుతున్నా, కాసేపు కూర్చుని సేద తీరేది కుటుంబంతోనే. పగలంతా కష్టపడి సాయంత్రం ఇంటికి వెళ్ళటానికి మన కోసం ఎదురుచూసే బంధాలు లేకపోతే, అంతకు మించిన బాధ నరకం ఇంకోటి ఉంటుందా? ఇప్పుడు ఆ బంధాలన్నీ ప్రతిబంధకాలుగా చిత్రీకరింపబడుతున్నయా??
good.. post. prapancham anthaa chuttesinaa..illu ane bandham manishi viluva ni nirnayisthundhi.illu ante konni itukalu..nalugu dwaraalu ,konni kitikeelu kaadhu. mamathaanbandhala chaluva pandhiri.
Vanaja Vanamali garu: చాలా మంచి కామెంట్ రాసారు, కృతఙ్ఞతలు
na manasuloni maatalanu poorthigaa rasaaru. bandhaalante ishtam thone maa vaaru , nenu 12 yrs joint family lo vunnamu. kaani maaku ippudu chaalaa nashtam indi. andarikee premanu andinchaanu. kaani dabbu mundu antaa taru maaru indi. mee feelings chaala karact. kaani artham chesukone vaaru kuda vundaali.
Anonymous garu: డబ్బు అన్నింటిని కలుషితం చేసేస్తుందా అని బాధ అనిపిస్తుంది. మీరు అన్నది కరెక్ట్…ఏ బంధమైనా ఇరువైపుల నుంచి వుండాలి …Thanks for sharing.
@Anonymous, giving is a gift and not to expect anything in return especially in family/blood relations…..in general joint families has human binding which is not in other cases…..
@vanaja, home meaning said in a very good way!
@praveena, chala bagundi….. so one needs a life companion and family!
Vamsi kolli @ “not to expect”….at the end we r humans. We expect love n affection in return, if money over takes all these then the problem comes.
naa kaithe emi artham kaaledu.
chakri garu: అసలేమి అర్థం కాలేదాండి ?? పోన్లెండి…అది మంచిదే ఒక్కోసారి. May be మీకు పెళ్ళయి వుండదు 🙂 🙂
Innocence is bliss
Chala bagundi Praveena! Naa manasuni okasari kalavaraparachindi. Ee Bandalu anni ee kalamlo dabbu to mudipadi potunnayi. Evarina dabbuke importance istunnaru. Asalu ee Bandam anedi ranu ranu koravadutondi manushulalo…. mundu taram lo asalu ‘Bandam” ante artham teleyakapovachhu………..Chala bagundi Praveena!
వనజ గారు మేరు చెప్పింది నిజం చాల బాగా రాసారు…
నేనుకొంత మందిని చూసాను ఎదుటి వాళ్ళ దగ్గెర నుంచి మనకి కావలిసినది దొరకనపుడు వదిలేసారు …
గుర్రాన్ని నిటి దగ్గేరకి తెసుకు వెళ్తే అది నీల్లు తగదు కాని అదే గుర్రాన్ని పరిగేట్టించితే అదే వెళ్లి తాగుతది. i think relations/affections/love kuda అంతే. naku unna knowledge tho cheppanu tappaithe sorry…
but these days some relations are linked with money. if no money no relation i faced it ……….. its tooooooooo horrible
Attachment is mother of SORROW. Any how If U well aware of Vedas Marriage is part of three seasons in human life. Its not ultimate for a man. Kindly know “Arthanareeswara Tatwam”. But now a days in this material world of kaliyuga WOMAN & MONEY takes importance.