నా మౌనమే నీ నెపమా ప్రియా,
అయితే,
మరి విను నా బాధ,
నా పెదాలు పలికితేనే,
నీ చెవులు ఆలకించి,
నీ హృదయానికి చేరవెయ్యాలా నా బావాన్ని?
మౌనంగా నా కళ్ళు,
నీ మనసుతో మాట్లాడట్లేదు?
నీ హ్రదయం వినట్లేదు?
అది నిజం కానప్పుడు,
నా మాటలు పెడర్ధాలుగా మారి,
నీ హృదయాన్ని గాయపరచవూ?
నీ మనసుని ముక్కలు చెవ్వవూ?
ఇక,
నేను మౌనాన్ని ఆశ్రయించక,
మాటలతో యుద్ధానికి దిగనా?
యుద్ధంలో గెలిచేది,
నీ నేపమా? నా బాధా?
nice