మౌనం, మాటల ఘర్షణలో….
నీ మౌనం నా మనసును గాయం చేసినప్పుడు,
శూన్యంలో మాటలు వెతకలేక,
నేను మూగబోయినప్పుడు,
మాటల వర్షం కురిపిస్తావు.
హృదయం కరిగి,
మౌనం వీడి,
నా మాటల ప్రవాహంలో,
నీ హృదయం తడిపెయ్యాలని,
మరోసారి ప్రయత్నం చిగురేసి,
చుట్టూ చూసే లోపు,
కనుచూపు అంచుల్లో ఉంటావు,
హృదయపు అంతులను మాత్రమే,
తాకగల నా చిరుసవ్వడి,
నీ చూపుల్లో చులకన.
చిరుసవ్వడి పెనువేధనై,
పల్లకీలో ఊరేగుతుంది,
నా హృదయ పరిధిలో.
ఈ పరిధి దాటలేని నా నిస్సహాయత,
ఎన్నటికి అర్థం చేసుకుంటుందో,
నోరు పలికే పలుకుల కన్నా,
హృదయం చెప్పే మౌనమే మేలని.
నీ మౌనాన్ని అంగీకరించే క్రమంలో,
మనసు మాత్రం మూగగా రోదిస్తూనే ఉంటుంది.
నీవు ఎప్పుడూ నింగివే,
నేను ఎన్నడూ నేలనే,
నింగి నేలల నడుమ,
మౌనం, మాటల ఘర్షణలో,
జ్వనించిన మెరుపు వెలుతురులో జీవితాన్ని వెతుక్కుంటూ….సాగిపో నేస్తమా
హృదయం చెప్పే మౌనమే మేలని.
నీ మౌనాన్ని అంగీకరించే క్రమంలో,
మనసు మాత్రం మూగగా రోదిస్తూనే ఉంటుంది.
nice …..
నింగి ,నేల , మౌనం… ee words tho chala baagaa chepparu.. nice praveenaaaa… i observed more more quality in your expressions day by day…. keeit up… congrats
Uday Bhaskar Reddy garu: thanks for ur comment…
praveena garu enta baga chepparandi. superb.
Thanks Roja garu..
చాల బాగా వ్రాసారు. నా మనసులో కూడా ఇలాంటి మౌనమె రాజ్యం ఏలుతుది.. కాని నేను కవిని కాదుగా… ఇలా రాయడానికి…!!
నీవు ఎప్పుడూ నింగివే,
నేను ఎన్నడూ నేలనే,
నింగి నేలల నడుమ,
మౌనం, మాటల ఘర్షణలో,
జ్వనించిన మెరుపు వెలుతురులో జీవితాన్ని వెతుక్కుంటూ….సాగిపో నేస్తమా …
very very nice….
chamarchina kallanundi raalina Oo bhashpasanthakam
midisipade manasuku nammina manasu Usuru megilenu