Vacation time…


 Vacation time…

సెలవలకు ఇండియా వెళ్ళే టైం వచ్చేసింది. ఇంకొన్ని రోజుల్లో అమ్మ, నాన్న దగ్గర వాలిపోవొచ్చు. వెళ్ళిన రోజు నుంచి తిరిగి వచ్చే దాకా 24 * 7 * 30 days of pampering . అక్కడ ఉండే నెల రోజుల కోసం రెండు నెలలుగా ఎదురు చూస్తాము. ఎన్నెన్నో Plannings ……ఆ ఊహే ఎంత బాగుంటుందో. ఎదురు చూసినంత సేపు ఉండదు…అలా వెళ్లి ఇలా వచ్చేసినట్టు ఉంటుంది. కానీ ఆ ఎదురుచూపులో ఎంతో ఆత్మీయత ఉంటుంది.

నన్ను చూడగానే అమ్మ అనే మొదటి మాట, “ఏమ్మా అలా చిక్కి పోయావు?”, which is never true. అమ్మ పలకరింపు, ప్రేమ అంతా ఆ మాటలోనే చూపించేస్తుంది. నాన్న డైరెక్ట్ గా అనరు కానీ, పిల్లలిద్దరూ ఆయన కాళ్ళకు చుట్టుకున్నప్పుడు, “ఏరా బాగా అల్లరి చేసి విసిగిస్తున్నారా?”, అంటూ ముద్దుగా కసురుకుంటారు. వెళ్ళిన తర్వాత ఒక వారం రోజులు దాకా పిల్లలు మాట్లాడేది డాడీ అర్థం కాదు, డాడ్ మాట్లాడేది పిల్లలకు అర్థం కాదు. నేనో, మావారో translate చెయ్యాలి. అమ్మ నాన్నను విసుక్కుంటుంది, “వాళ్ళు అంత చక్కగా మాట్లాడుతుంటే, మీకు ఎందుకు అర్థం కాదు”, అంటూ.

ఇక్కడ డాడ్ తో ఓ చిక్కు. ఇంత పెద్ద వాళ్ళము అయినా, ఇప్పటికీ మమ్మల్ని తిడతారు. టైం కి స్నానం చేసారా, టిఫిన్ చేసారా, భోజనం చేసారా….అంటూ. ఇప్పటికీ లేట్ నైట్ సినిమా చూడాలంటే మా ఆనందరికి జంకే. ఏ పూటన్నా బుడింగ్స్ సరిగ్గా తినక విసిగిస్తుంటే, ఏమన్నా తిట్టమా…..”నువ్వు తిన్నావా ఏంటి చిన్నప్పుడు, అంత కంటే ఎక్కువే విసిగించావు. పిల్లలు అలాగే చేస్తారు. బుజ్జగించి ఓపిగ్గా పెట్టాలి”, అంటూ అక్షితలు వేసేస్తారు. నేను ఊరుకుంటానా, “చిన్నప్పుడు మీరు తిట్టారుగా మమ్మల్ని…”, అంటూ మొదలు పెట్టేస్తాను. సందట్లో సడేమియా బుడింగి తప్పించేసుకుంటాడు. వంటిట్లో నుంచి అమ్మ వచ్చేస్తుంది, మంచి సినిమా చూడటానికి. నవ్వులు పండుతాయి హాయిగా. But we miss other sister who is in US.


అమ్మకు ఓపిక ఉన్నా లేకున్నా కనీసం కారప్పూస, చెక్కలు వండుతుంది. డాడ్ ఎంత చెప్పినా వినిపించుకోకుండా ఎక్కడెక్కడికో వెళ్లి మాకు ఇష్టమైన వన్నీ కొనుకొస్తుంటారు. చెల్లి కొత్తగా కొనుకున్న డ్రస్సెస్ తో సహా అన్ని వాడేసి, షాపింగ్ చేసేసి సూట్ కేసు నిండా కొత్త బట్టలు సర్దేసుకుంటాను. నేను తప్పకుండా చేసే మరో షాపింగ్ బుక్స్. ఇప్పటికే చిన్న లిస్టు తయారు చేసేసుకున్నాను.

మాకు చాలా మంచి Neighbors . పొద్దున్న లెగిసిన దగ్గర నుంచీ పెత్తనాలు, షికారులు, కబుర్లు. పిల్లలు కూడా ఇంట్లో నాలుగు గోడల మధ్య వుంటూ అల్లరి చేసి మన బుర్రలు పాడు చెయ్యకుండా, చుట్టుపక్కల అందరి ఇళ్ళకు వెళ్తూ ఉంటారు. వాళ్ళ అల్లరిని అందరు తలా కాస్త పంచుకుంటారు.

One of my best friend వచ్చేస్తుంది కొద్ది రోజులకు. ఆ రెండు మూడు రోజులు కబుర్లు, కబుర్లు ….అంతు లేని కబుర్లు. సంవత్సరమంతా కూడ బెట్టుకున్న కష్టాలు, సుఖాలు, నవ్వులు, కన్నీరు …అన్ని చెప్పేసుకుని కడుపుబ్బరం తగ్గిచుకుని, మరో సంవత్సరానికి సరిపడా శక్తిని తెచ్చేసుకుంటాము. I am going to meet few other friends this time.

నెల కాదు, ఇంకో నాలుగు నెలలు ఉన్నా వచ్చేటప్పుడు దిగులుగా, బెంగగా ఉంటుంది. కొద్ది సంవత్సరాల నుంచీ ప్రతీ సంవత్సరం జరిగే తంతే అయినా, ప్రతీ సారి అదే బావం, అదే ఆనందం, అదే బెంగ. ఇప్పుడింకా నయం, అంతక ముందు కృష్ణ, గోదావరి పొంగేవి. ఇప్పుడు కాస్త maturity వచ్చిందో, లేక రొటీన్ కి బాగా అలవాటు పడిపోయమో లేక సంసారం గొడవలో పడిపోయామో తెలిదు కానీ దిగులుగా మాత్రమే ఉంటుంది.

తిరిగి వచ్చాక, ఒక వారం రోజులు చాలా వెలితిగా ఉంటుంది. ఆ తర్వాత మళ్లీ మామూలే. Yet, life is beautiful with so many small pleasures

This entry was posted in అమ్మ, జీవితం, నా అనుభవాలు, వ్యాసాలు, Uncategorized. Bookmark the permalink.

24 Responses to Vacation time…

 1. prabandh pudota says:

  Have a Very Nice Time Praveena gaaru…
  ……I am also waiting for that movement…

 2. Beautiful narration madam…Heart touching.

 3. Vamsi kolli says:

  we read completely even though is not poem/poetry! like your story, simple but has depth in that. If one has the beaty of life daily then the sweetness will not be recognized by us:)

 4. Hari Krishna Sistla. says:

  మా చిన్నప్పుడు ఇంకొక తమషా జరిగేది,మేము సామాన్లు తీసుకుని రైల్వే స్టేషన్ చేరేసరికి మా తాత గారు ఆదరాబాదరా గా సైకిలు పై రైల్వేస్టేషన్ చేరే వారు.మేము బయల్దేరే సమయం లొ శకునం బాగా లేదనో ,ముహూర్తం బాగా లేదనో చెప్పి ఇంటికి తిరిగి తీసుకెళ్ళేవారు.
  ఎంతైనా నిన్నటి దాకా కళకళలాడిన ఒక్కసారిగా మూగపోతుందంతే వాళ్ళకీ బాధేగదా ………
  We used to feel sad if our Grandfather did not arrive the Railway Station.

 5. Hari Krishna Sistla. says:

  Await your comment Ms.Praveena. Any corrections or suggestions are welcomed.I am sure I was n t was a successful user of LEKHINI. ” సమయం లొ ” was the one which I could trace.
  This is practical and not a narration.

 6. vineela says:

  omg..naku edupochestondi..me lage naku intiki vellali ani benga vachestondi…Have a great Vacatoin !!

 7. Deepthi says:

  Have a nice time, Praveena!! I am soooo jealous…

  Nee story narration tho aunty, uncle ni kallaki kattinatlu choopinchaavu 🙂

 8. Krishnapriya says:

  🙂 బాగుంది.

 9. enthaga nacheesindante ma site lo mee link ni pettenthaga.

 10. SrinivasRao Jagarlamudi says:

  vellataniki mundari aatrutha vellivachaka migultundivelithiga adi sahajam,memories okka sariga maruvalemuga, anduke jeevitham sukhadukhalu cenema lantidi,anni vunna edo ledanna veliti, adi puttuka nundi chavu varaku mananu ventaduthundi,

 11. vijaya says:

  Have a nice vacation andi with all your family members and kids and please share all those memories with us after coming because anyway we dont have that opportunity so we will feel every part of your vacation by reading it andi

 12. Anonymous says:

  nice pravenn garu.

 13. thotakuri says:

  కామెంట్సు తెలుగులో రాస్తే బావుంటుంది. మన భాషను గౌరవించాలి మరియు రక్షించాలి కదా…దీనికోసం జీ మైల్ మరియు లేఖిని ని ఉపయోగించుకోవచ్చును. అన్నట్లు మరిచి పోయాను మీ తరఫున సుంకవల్లి వాసుకి కీ మిస్ యునివర్స్ కోసం వోటు చేయమని చెప్పండి ..మన తెలుగు అమ్మయి కదా…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s