ప్రేమ పందిట్లో పెళ్లి
ప్రేమ,
ఆకర్షణతో మొదలయి,
చిలిపిగా ఉరకలేసి,
అపురూపంగా ఓ రూపాన్ని సంతరించుకుని,
బాధ్యతల నడుమ నలిగి,
గాంభీర్యాన్ని ఆపాదించుకుని,
మనసు పొరల మబ్బుల మాటున,
మసక బారుతున్న భ్రమ కలిగించి,
జీవితాన్నంతా ఆక్రమించి,
మలి వయసులో,
మమతల వెల్లువను కురిపించే,
మమతల వెల్లువను కురిపించే,
ప్రేమ పందిట్లో ముడిపడిన,
పెళ్లి…..
ok
i think above defined the both sides of marriage, beautifully written!
Nice One …