కాలమా…


కాలమా…
 
కాలమా,
కన్నీటి చుక్కల్లే జారి కరిగిపోకు,
కన్నుల్లో కలలున్నాయి,
కనురెప్పల మాటున వ్యధలున్నాయి,
కనుసన్నల్లో ఆశలున్నాయి,
కనుమూసేలోపు కాగల కార్యాలెన్నో ఉన్నాయి,
సమయమా కాస్త సహకరించు,
ఎప్పుడూ నీ వెనుక పరుగులేనా?
అప్పుడప్పుడూ మనసు మాట విననీ,
సేద తీరనీ,
శక్తిని సమకూర్చుకోని,
సమరంలో విశ్రాంతా అని ఎగతాళిగా నవ్వకు,
నిష్క్రమించని  నిరంతర పయనంలో,
చలివేంద్రపు నీటిని గుక్కేడన్నా తాగనీ,
అరుగుపై అరక్షణమన్నా వాలనీ,
సాటి బాటసారులతో కష్టసుఖాలు పంచుకోని,
కాలమా,
సాకిలపడి వేడుకోవట్లా,
ఎదురునిలిచి నిలదీయట్లా,
కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నా…
 
This entry was posted in కవితలు, కష్టం, కాలం. Bookmark the permalink.

10 Responses to కాలమా…

  1. కన్నుల్లో కలలున్నాయి,
    కనురెప్పల మాటున వ్యధలున్నాయి,
    కనుసన్నల్లో ఆశలున్నాయి,
    కనుమూసేలోపు కాగల కార్యాలెన్నో ఉన్నాయి,
    సమయమా కాస్త సహకరించు,

    these words are excellent praveenaaa

  2. నాకోసం నువ్వాగవు
    నేనేమో నిన్నందుకోలేను
    ఒక లిప్త పాటు అలుపు కోసం ఆగితే
    ఇక నేనెప్పటికీ నిను చేరుకోలేను ..
    ఇక ఎప్పటికి ఈ పరుగాగుతుందో తెలీదు ….

    హ హ హ .. ప్రవీణా .. nee poetry చూసి నాకూ కపిత్వం వచేస్తోంది

  3. Hari Krishna Sistla. says:

    Awesome Literature Mam.
    Only one suggestion which I can make is “Kanneeti chukkalle jaari Aari poku”(Jaari karigi poku May give a different expression as your time is with you,Now of course in liquid state but if you use the word Jaari Aari poku…The one is disappeared)

  4. ప్రవీణ గారూ !
    చక్కటి భావావేశం వుంది మీ కవిత్వంలో. పదాడంబరం కంటే లోతైన భావవ్యక్తీకరణ కనబడుతోంది. కొనసాగించండి. అభినందనలు.

  5. Anonymous says:

    So nice of you praveena i lk ur blog….

  6. k.Annapurna says:

    very nice

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s