సరిపోదూ?

వ్యధ ధ్వని వినాలంటే,
మాటలే మాట్లాడాలా,
మౌనం సరిపోదూ?
బాధని చూడాలంటే,
కన్నీరే కారాలా,
కళ్ళలో భావం సరిపోదూ?
వేదన చెప్పుకోవాలంటే,
ఏకాంతమే కావాలా,
వినే హృదయం సరిపోదూ?
దుఖం పంచుకోవాలంటే,
సంబంధమే కావాలా,
బంధం సరిపోదూ?
మనసు ముక్కలవ్వాలంటే,
యుద్ధమే జరగాలా,
చిన్న మాట సరిపోదూ?
కష్టం తగ్గించుకోవాలంటే,
సుఖమే కావాలా,
మరో కష్టం సరిపోదూ….. 🙂 🙂
Very nice
Good literature indeed. ‘Saripodaa…’ might have suited still better. If yo do not want to change the The sentences,Question mark did not suit. ( Try ! instead ? )
This too is good however.
దుఖం పంచుకోవాలంటే,
సంబంధమే కావాలా,
బంధం సరిపోదూ
in this these words are highlight
బాగుంది
Mr.Uday Bhaskar Reddy gave a better suggestion. Sambandhame ” Kaavaalaa “.Bandham “Saripodaa” might have suited for better Rhyming.
వేదన చెప్పుకోవాలంటే,
ఏకాంతమే కావాలా,
వినే హృదయం సరిపోదూ? ane lines loo hrudayamee kaaavaaalaaa , vine ekaantam saripoosdu…
ani marchiteee ella vuntundi madam…
venkata prasad garu: నా ఉద్దేశ్యం హృదయమే కావాలి, ఏకాంతం లేక పోయినా పరవాలేదు. చిన్న మాటలో అర్థం చేసుకునే హృదయం వుంటే, ఏకాంతం అవసరం లేదేమో…ధన్యవాదాలు
eekantamloo migileedi hrudayameee kadaaaa madam…
Anonymous : “ఏకాంతంలో మిగిలేది హృదయమే” …అద్బుతంగా చెప్పారు..
chaala baagundi
ninnu abinandinchaalante…maatalu kaavaalaa…mounamgaa abhinandinchalemaa…
“కష్టం తగ్గించుకోవాలంటే,
సుఖమే కావాలా,
మరో కష్టం సరిపోదూ”
chaalaa baagundi ee prayogam..chinna vaakyaalloo pedda ardhaalu baaga guppistunnare.. well done… keep going..
“మనసు ముక్కలవ్వాలంటే,
యుద్ధమే జరగాలా,
చిన్న మాట సరిపోదూ?”
సరిపోయేలా పెట్టేశారుగా 😀
Nice expression
G: 🙂 thanks andi..