జీవితం!?


జీవితం!?

ఆనందం, విషాదం,
చెరో చెయ్యి పట్టుకుని,
జీవితాన్ని నడిపించేస్తున్నాయి,
అదేమిటో,
ఆనందానికి అప్పుడప్పుడు అలుపన్నా ఉంటుంది,
విషాదానికి ఎన్నడూ అలసటే ఉండదు!

జీవితపు కోర్టులో,
కాలం జడ్జి ముందు అనుదినం,
తప్పొప్పుల వాదులాట జరుగుతూనే ఉంటుంది,
వాది, ప్రతివాది ఇద్దరూ బలవంతులే,
 అదేమిటో,
కాలం సునాయాసంగా తీర్పుని ఇచ్చేస్తుంది!

సంపద, సంతోషం,
ఈ క్షణం ఒకదానితో మరొకటి,
మమేకమైనట్టే ఉంటాయి,
అదేమిటో,
మరో క్షణంలోనే విభేదించుకుంటాయి!

ప్రేమ, ద్వేషం,
ఒకరినొకరు ద్వేషించుకున్నట్టే ఉంటాయి,
అదేమిటో,
అవసరార్థం అటుఇటు మారిపోతూ,
ఆలింగనం చేసుకుంటాయి!

జీవితం పెద్దదో, చిన్నదో?
గమ్యం దగ్గరో, దూరమో?
సాగే నిరంతర ప్రయాణంలో,
చివరకు మిగిలేది,
గుప్పెడు జ్ఞాపకాలు,
పిడికెడు అనుభూతులు….

This entry was posted in కవితలు, జీవితం. Bookmark the permalink.

8 Responses to జీవితం!?

 1. Vamsi kolli says:

  So the conclusion is to keep memorable moments in this short life journey by doing according to our wish, enjoyinng every monet of it!

 2. Ravi babu says:

  intha spostamaina abhiprayaalu mee manasukela thduthundhi ?

 3. Hari Krishna Sistla says:

  Good job done Mam..
  Nothing much to call but suggestion towards only One sentence.”………..Vaadi prathivaadi iddaroo ………’Manassakshi annadi iddariki lekapothe’…..Kaalame Tana baadhyathagaa teerpunistundi”. If the sentence suggested was been used the literature might have meant that You are giving some respect to moral values ad showing same sort of respect towards humanity too.
  Apologize for Bo(the)ring you.

  • Hari Krishna garu: Bothering లేదు, boring అంతకన్నా లేదు. నేనే మీకు థాంక్స్ చెప్పుకోవాలి. బోరింగ్ అనుకోకుండా మీరు నా పోస్ట్ అన్నీ చదువుతున్నారు. More over you respond to all posts..Thanks andi.

 4. Anonymous says:

  chala bagundandi mee ru cheppina jeeveetam..
  vshadaniki alupannadi undadu…avunanipistundi….

  • Anonymous garu: ఒక్కోసారి విషాదాన్ని చూస్తుంటే విసుగేసి అలా అనిపిస్తుంది కదా 🙂 ..thanks.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s