ప్రేమంటే….
ప్రేమంటే,
ఈ క్షణంలో ముంచెత్తే వరదను,
కాలంలో కలిపేసుకుంటూ,
ప్రశాంతంగా సాగిపోయే ప్రవాహం.
ప్రేమంటే,
కోపతాపాల ఈదురు గాలులకు,
తెలిపోని వర్ష మేఘం,
ముసురులా కురిపించే,
మమకారపు వాన జల్లు.
ప్రేమంటే,
ఆకాశంలో మెరిసే,
మెరుపు కలల మాటున,
మబ్బులతో అల్లుకున్న అనురాగం.
ప్రేమంటే,
సప్తవర్ణాల ఇంద్రధనస్సు,
సొగసులన్నీ కలగలిపిన,
శ్వేతవర్ణపు స్వచ్ఛత.
ప్రేమంటే,
జలపాతపు దూకుడు,
నేలనంటి నిమ్మదించి,
నడకలో అడుగులు కలుపుతూ,
సుధూర గమ్యం వైపు,
సాగిపోయే నిరంతర పయనం.
ప్రేమంటే,
కాలంతో కరిగిపోయే కల కాదు,
కలలకు కాలం ఇచ్చిన రూపం,
ప్రవాహం…జీవన ప్రవాహం..
ప్రేమంటే…రెండు బలహీనమయిన మనసుల్ని కలిపే బలం.అలాగే రెండు బలమయిన మనసుల్ని విడదీసే బలహీనత కూడా.
Anonymous : hmm…కటినమైన నిజం…
Good Literature Indeed.Might have been still good if “Prema “has given its individual addressing where the sentencing turn as “Ee kshanamlo munchette varadnu nenu”……..Saagipoye pravaahaannni nenu.
Good point Hari Krishna garu..
చాలా బాగా రాసారు… అలాగే చదువుతూ వుండాలనిపించింది!
Satya garu: thats a sweet comment..Thanks andi..
ప్రేమంటే, జీవన ప్రవాహం.. Nice exploration. Thanks
an.ancient.saint garu: Thanks for ur comment..
“కాలంతో కరిగిపోయే కల కాదు,
కలలకు కాలం ఇచ్చిన రూపం”
This line is really nice.
bonagiri garu: ధన్యవాదాలు