అందమైన జీవితం
ఎంత మధురంగా ఉందో,
గడిపిన క్షణ కాలమయినా,
ఆనందాన్ని దోసిళ్ళలో నింపుకుని,
సంతోషాన్ని మనసారా తాగినట్టు.
ఎంత ఆత్మీయంగా ఉందో,
నాలుగు పలుకులే పలికినా,
ప్రేమను నింపి,
భావుకత్వాన్ని కలగలిపి,
భావాన్ని మనసారా ఆస్వాదించినట్టు.
ఎంత తృప్తిగా ఉందో,
లీలగా ఆలకిస్తున్నా,
లయలో లీనమయి,
గానంలో గొంతు కలిపి,
జీవనరాగం మనసారా నింపుకున్నట్టు.
ఎంత కమ్మగా ఉందో,
కన్నీటి చుక్కలే కార్చినా,
కడిగిన ముత్యంలా మెరిసే,
మనసు లోగిలిలో,
పురివిప్పిన అనుభూతుల చిట్టా,
ఎంతని విప్పి చెప్పను?
జీవన ప్రవాహంలో కలిసిన పిల్ల కాలువను…
nice Expression.. I like it..
thats why need to enjoy every moment of life… being optimistic in life for whatever comes on the way, accepting it!
vanaja vanamali garu, Vamsi : Thanks for responding…
Good expression.Appreciable one.
Only Two are the suggestions I can make, the first is Jeevana raagam mansaaraa aalaaapisthunnattu / Jeevana maadhuryam manasanthaa nimpukunnattu (The landing sentence of Third Paragraph) You can choose any of these both.
Secondly The Final sentence should have been Pilla kaaluvanu nenu. (The landing sentence of the last paragraph).
GooD….nice Expression.. I like it.
Rajesh Kumar garu: Thanks for ur comment.