అనుభవాల బ్రతుకు పుస్తకం


అనుభవాల బ్రతుకు పుస్తకం

అక్షరాలు ఆప్యాయంగా ఆహ్వానించాయి,
రండి రండి,
కాసేపు కులాసాగా,
కబుర్లు చెప్పుకుందామని.

పదాలు ప్రేమగా పిలిచాయి,
పద పద,
చుట్టూ ఉన్న కష్ట సుఖాలను,
చుట్టపు చూపుగా చుట్టివద్దామని.

వాక్యలు హుషారుగా కదిలాయి,
పదాల అడుగులలో అడుగులేసుకుంటూ,
పలకరిపుల కుశలప్రశ్నలతో.

వ్యాకరణం పట్టువిడుపులలో,
పంతాలు అటకెక్కి,
పద్యాలూ, వ్యాసాలు,
పరుగులు పెట్టాయి ఒకదాని వెనుక మరొకటి.

అనుభవాల పుటలు నిండిన,
బ్రతుకు పుస్తకం చదువుతుంటే,
బాల్యం మరోసారి ముద్దాడుతున్నట్టు,
యవ్వనం చిలిపిగా మరోసారి పిలుస్తున్నట్టు,
కాలచక్రంలో మరోసారి షికారు కెళ్ళినట్టు ఉంది.

This entry was posted in కవితలు, కాలం, జీవితం. Bookmark the permalink.

7 Responses to అనుభవాల బ్రతుకు పుస్తకం

 1. k.ANNAPURNA says:

  hai Praveena garu,

  Naku me NETI MAHILA chala nachindi, meru baga rastharu.

  am soo happy.,after reading this……bye.

 2. Hari Krishna Sistla says:

  Kulaasaa kaburulu (Not Kaburlu) Cheppukundaamani, Might have suited still better.However,The sentence Vyakaranam pattu vidupulato………..Made me not to comment about literature.You did cover every Grammatical and Rhyming mistakes in a single shot.
  Appreciable job done.

  • Hari Krishna Sistla garu: మీరు సరిగ్గా చదివినట్టు లేరు..నేను కబుర్లు అని మాత్రమె రాయలేదు “కాసేపు కులాసాగా, కబుర్లు …” అన్నాను. కృతఙ్ఞతలు..

   • Hari Krishna Sistla says:

    I got you,follow the lines ” Kaasepu kulaasaa KaBURULU”or “Kaasepu kulaasaa gaa KaBURULU” (KaBURULU and KaBURLU,give same meaning but the word Kaburulu suits the situation well)

 3. padmarpita says:

  ఇంకా చాలా పుటలు ఉన్నాయి కదండీ!!!
  Nice….

  • Padmarpita garu: లెక్కలేనన్ని పుటలు..ఒక పుట్టినరోజు నాటికి 365 పుటలు తయారైపోతాయి…బాగుందండి మీ కామెంట్..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s