ఇంతేనా అని ఆగిపోయి ఇదేనా అని నిలదీసి సాగిపోనా…


ఇంతేనా అని ఆగిపోయి ఇదేనా అని నిలదీసి సాగిపోనా…
 
‘ఇంతే జీవితం’  అనుకున్నన్నాళ్ళు,
సాగిపోయింది జీవితం,
‘ఇంతేనా జీవితం’ అనిపించిననాడు,
సాగిపోతున్న జీవితం ఆగిపోయి,
జాలిగా వెనక్కి తిరిగి చూసింది.
ఆగిన ఆ క్షణం,
నిప్పులా దాహించేసింది మనసును,
ఆగని మరో క్షణం,
ఊగిసలాటల్లో ఉక్కిరిబిక్కిరి చేసింది హృదయాన్ని.
బేలకళ్ళ భయంతో,
‘ఇంతే’ అని సాగిపోనా?
సాగిపోతూ కరిగిపోతూ,
కార్చిన కన్నీరు,
నా కోసం కానప్పుడు,
కన్నీరెందుకు నాకు?
కన్నీరు నాకు కానప్పుడు,
భయం భ్రమలు తొలిచి,
‘ఇంతేనా’ అని నిలదీయుటకు,
ఎందుకు వెనుకబాటు?
నిలదీసి నవ్వులపాలవుతాం అన్న సంశయమా?
సంశయాల నడుమ సంతోషం  కరువయినా,
ఆగలేదన్న ఆనందం కోసమా?
ఆగలేదన్న ఒక్క ఆనందం కోసం,
బ్రతికే ఒక్క బ్రతుకు ఈడ్చడమెందుకు?
మరో క్షణం చేయిదాటక మునుపే,
బ్రతుకు బ్రతికించుకోవటం కోసం,
మొదలు పెట్టిన ప్రయాణంలో,
మొదటి అడుగుకు ఆసరా ఈ క్షణం.    
This entry was posted in కవితలు, కాలం, జీవితం. Bookmark the permalink.

8 Responses to ఇంతేనా అని ఆగిపోయి ఇదేనా అని నిలదీసి సాగిపోనా…

  1. Hari Krishna Sistla says:

    Inte jeevitham anukunnalloo -Saaginchaanu jeevitham ; Intenaa jeevitham Anukunna roju- jeevitham saagincha lekapoyaanu.The same passion Intenaa ani niladeethaku-Yenduku naa venukabaatu.
    Any way got high negative feelings,Could not make the reason.

  2. padmarpita says:

    సాగిపొండి అడగాల??:)
    బాగుందండి మీ కవిత!!!

    • Padmarpita garu: సాగిపోనా అని అడగట్లేదండి…ఆత్మవిమర్శ, అంతర్శోధన అంతే… ధన్యవాదాలు

  3. Hari Krishna Sistla says:

    Of course about the script.

    • Hari Krishna garu: నేను రాసేవి కేవలం మనసుకు తోచినవే…అందులో అక్షరాలు, పదాలు, వ్యాకరణాల తప్పొప్పుల గురించి నాకు పెద్ద పట్టింపు లేదు. మీరు చాల సహృదయంతో ప్రతీ పోస్ట్ లోను తప్పొప్పులు సూచిస్తున్నారు , ఇలా సరిచేస్తూ పొతే, మీకు ప్రతీ పదం లోను తప్పుప్పులే కనిపిస్తాయి….

  4. Hari Krishna Sistla says:

    Let me stay frank now “High negative feelings”,I meant was in the literature.Was in a depressive mood,I felt.rather I am made to feel.
    After all What Qualification I had to correct the grammatical mistakes.As I did quote earlier,almost my childhood went in North India only therefore I feel I am not the right person to correct grammatical errors. But the definite I do follow is to hum the sentence Twice or Thrice.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s