ఇంతేనా అని ఆగిపోయి ఇదేనా అని నిలదీసి సాగిపోనా…
‘ఇంతే జీవితం’ అనుకున్నన్నాళ్ళు,
సాగిపోయింది జీవితం,
‘ఇంతేనా జీవితం’ అనిపించిననాడు,
సాగిపోతున్న జీవితం ఆగిపోయి,
జాలిగా వెనక్కి తిరిగి చూసింది.
ఆగిన ఆ క్షణం,
నిప్పులా దాహించేసింది మనసును,
ఆగని మరో క్షణం,
ఊగిసలాటల్లో ఉక్కిరిబిక్కిరి చేసింది హృదయాన్ని.
బేలకళ్ళ భయంతో,
‘ఇంతే’ అని సాగిపోనా?
సాగిపోతూ కరిగిపోతూ,
కార్చిన కన్నీరు,
నా కోసం కానప్పుడు,
కన్నీరెందుకు నాకు?
కన్నీరు నాకు కానప్పుడు,
భయం భ్రమలు తొలిచి,
‘ఇంతేనా’ అని నిలదీయుటకు,
ఎందుకు వెనుకబాటు?
నిలదీసి నవ్వులపాలవుతాం అన్న సంశయమా?
సంశయాల నడుమ సంతోషం కరువయినా,
ఆగలేదన్న ఆనందం కోసమా?
ఆగలేదన్న ఒక్క ఆనందం కోసం,
బ్రతికే ఒక్క బ్రతుకు ఈడ్చడమెందుకు?
మరో క్షణం చేయిదాటక మునుపే,
బ్రతుకు బ్రతికించుకోవటం కోసం,
మొదలు పెట్టిన ప్రయాణంలో,
మొదటి అడుగుకు ఆసరా ఈ క్షణం.
hmmm
Inte jeevitham anukunnalloo -Saaginchaanu jeevitham ; Intenaa jeevitham Anukunna roju- jeevitham saagincha lekapoyaanu.The same passion Intenaa ani niladeethaku-Yenduku naa venukabaatu.
Any way got high negative feelings,Could not make the reason.
Hari Krishna garu: “high negative feelings”…I hope its not about script. Thanks for responding…
సాగిపొండి అడగాల??:)
బాగుందండి మీ కవిత!!!
Padmarpita garu: సాగిపోనా అని అడగట్లేదండి…ఆత్మవిమర్శ, అంతర్శోధన అంతే… ధన్యవాదాలు
Of course about the script.
Hari Krishna garu: నేను రాసేవి కేవలం మనసుకు తోచినవే…అందులో అక్షరాలు, పదాలు, వ్యాకరణాల తప్పొప్పుల గురించి నాకు పెద్ద పట్టింపు లేదు. మీరు చాల సహృదయంతో ప్రతీ పోస్ట్ లోను తప్పొప్పులు సూచిస్తున్నారు , ఇలా సరిచేస్తూ పొతే, మీకు ప్రతీ పదం లోను తప్పుప్పులే కనిపిస్తాయి….
Let me stay frank now “High negative feelings”,I meant was in the literature.Was in a depressive mood,I felt.rather I am made to feel.
After all What Qualification I had to correct the grammatical mistakes.As I did quote earlier,almost my childhood went in North India only therefore I feel I am not the right person to correct grammatical errors. But the definite I do follow is to hum the sentence Twice or Thrice.