దారి తప్పకు నేస్తం
నీ జ్ఞాపకం,
నా పెదవులపై దోబూచులాడే,
చిరునవ్వుకు చిరునామా.
నీ కోసం ఎదురుచూపు,
నా కళ్ళల్లో మెరిసే,
మెరుపుకు అసలైన అర్థం,
నేస్తమా,
నీవే దోవనోస్తున్నవో మరి,
నా చిరునామాను జారవిడుచుకోకు,
దారి తప్పావన్న సంగతే నాకు చేరదు.
ఏళ్ళు గడిచినా,
ఆశ ఇంకిపోకపోయినా,
చిరునవ్వుల మెరుపు మాత్రం మాసిపోతుంది.
సమయం మించిన తర్వాత చేరిన నీకు,
గాజు కళ్ళే స్వాగతం పలుకుతాయి.
మనసు మీరిన తర్వాత దరిచేరిన నిన్ను,
ఎండిన గుండెల తడే తడుముతుంది.
I,Personally did not feel you did not reach up to the mark.Many corrections can be suggested.
If you did have tried the sentence “Neevedovana Vastunnaa naa Chirunaamaa Jaaraviduchukoku”(which ever the way you take do n t loose my address) might have touched the heart.,
Better not to find a sense in your wording “Chirunavvula merupu maatram maasipotundi”.