ఆలోచిస్తూ…
నా ఆలోచనల మహాప్రవాహంలో,
నేనో నీటి బిందువును,
ఉధృతంగా ఉప్పొంగే ఓ నాడు,
ప్రశాంతంగా సాగే మరో నాడు,
అనుధినం ఓ శోధన,
శోధనలో వేదన,
వేదనలో ఆనందాన్ని ఆస్వాదిస్తూ, ఆలోచిస్తూ…..
మనసు గర్భంలో శిశువునై,
ఊహల ఉమ్మనీటిలో తేలియాడుతూ,
ఊసులాడే గుండె లయకు తలాడిస్తూ,
అనుభవాల రక్త ప్రసరణ ఘోషలో,
అనుభూతులను వెతుక్కుంటూ,
ఆత్మవిమర్శల గర్భద్వారంలో నలిగిపోతూ,
ఏకాంతంలో,
మరోసారి జన్మిస్తూ,
పసిపాప స్వచ్ఛతను,
ఆస్వాదిస్తూ, ఆలోచిస్తూ…..
My note: ఇలా అప్పుడప్పుడూ రాసేస్తూ, చదివే వాళ్ళ బుర్ర తినేస్తూ, ఆనందించేస్తూ…భలే భలే బాగుంది నా ఈ ఆలోచన…
Naa aalochanala pravaaham lo nenoo oka binduvunu
Yekaanthamlo nunchi bayatiki vastoo,Marosaari janmistoo.