ప్రేమగా తాకి వెళ్ళిన పవనం (పరిచయం)
ఎచట నుంచో,
అనురాగపు శీతల పవనం,
ఆప్యాయతను ఆదరంగా మోసుకొచ్చి,
ప్రేమను నిలువెల్లా ఒలకపొస్తూ,
మనసుని మధురంగా తాకింది.
గాలికి చెదిరిన ముంగురులు,
నుదిటిపై అల్లరి చేస్తుంటే,
ముద్దుగా విసుక్కుని,
కనులు మూసుకుని,
మనసారా ఆస్వాదించి,
కనులు తెరిసేటప్పటికి,
వయ్యారంగా ఊపుకుంటూ వెళ్ళిపోయింది.
చిన్న నిట్టూర్పుతో,
చిరునవ్వు సాయంతో,
పవనం పయనించిన దారిలో,
జ్ఞాపకాలు ఏరుకుని,
సాగిపోయాను నా దారిలో.
ఏకాంతంలోనో, ఒంటరితనంలోనో,
మూటగట్టిన జ్ఞాపకాలు,
విప్పుకుంటూ మురిసిపోతూ,
సేద తీరుతాను ….
మూటగట్టిన జ్ఞాపకాలు,
విప్పుకుంటూ మురిసిపోతూ,
సేద తీరుతాను ….
My Note: “హమ్మయ్య …కూసంత భావుకత్వం నాక్కూడా అబ్బినట్టుంది…”
Awesome……Except the one ‘Chinna Nittoorpu to -Chiru Navvula saayamto.
Very nice, away from eveyrthing, sometimes into our own world!
Hari Krishna garu, vamsi garu: thanks for responding…