కష్టం కాలం సుఖం
కన్నీరు ఉప్పెనలా ఉప్పొంగి,
ఈ క్షణాన్ని ముంచెత్తింది,
కొట్టుకుపోతున్న సమస్తంలో,
మరో క్షణం కలిసిపోయింది.
శిధిలాల నడుమ,
కాలం ఒంటరిగా మిగిలింది,
కొనప్రాణం మిగిలి ఉన్న సెకను ముళ్ళు,
దేకుతూ పాకుతూ,
నిమిషాల ముళ్ళును నెట్టింది,
నెమ్మదిగా కదిలిన నిమిషం,
మెలమెల్లగా సత్తువను కూడగట్టుకుని,
గంటల ముళ్ళుతో జతకట్టింది.
ఇక అంతే,
సెకను వెనుక నిమిషం,
నిమిషం వెనుక గంటలు,
పరుగులు పెడుతూనే ఉన్నాయి.
కష్టం, కాలం, సుఖం వరుసగా,
ఒకరిని అందుకోవాలని మరొకరు,
వృత్తాకారంలో తీస్తున్న పరుగుల్లో,
పొంగినవి కన్నీరో, పన్నీరో,
తీరినవి కలతలో, కలలో,
గుర్తేలేదు……
good chala chla bavundi praveena gaaroo
ponginavi kanneeraina panneeraina….every thin frm heart…
i mean kasham kaalam sukham all are our perceptions…..