నిన్న రేపటిల నడుమ నేడు


నిన్న రేపటిల నడుమ నేడు

నిన్నటి ఆలోచనలకు,
రేపటి ఆచరణకు,
నడుమ నేడు ప్రణాళికల ఘర్షణ.

నిన్నటి నిరాశకు,
రేపటి ఆశకు,
నడుమ నేడు సంకల్పాల సంఘర్షణ.

నిన్నటి ప్రశ్నకు,
రేపటి సమాధానంకు,
నడుమ నేడు అన్వేషణల ఘర్షణ.

నిన్నటి తప్పుకు,
రేపటి పశ్చాత్తాపానికి,
నడుమ నేడు ఆత్మవిమర్శల సంఘర్షణ.

నిన్నటి పనికి,
రేపటి ఫలితానికి,
నడుమ నేడు నిరీక్షణల ఘర్షణ.

నేటి ఘర్షణల రాపిడితో,
రాచుకున్న అగ్గి వెలుతురులో,
రేపటి కోసం వెతుకుతున్న,
నేడు మాత్రమే నిప్పు.

నిన్న రేపటిల నడుమ నలిగిన నిజం, నేడు.
కష్టానికి, అదృష్టానికి నడుమ నిలిచిన దైవం, నేడు.

This entry was posted in కవితలు, జీవితం. Bookmark the permalink.

4 Responses to నిన్న రేపటిల నడుమ నేడు

  1. Vamsi says:

    It is difficult to understand poetry…….. one must have a deep depth experience in life/society…. finally ur poetry, good ones!

    • వంశి గారు: మీరు భలే అంటారండి…నాకు deep depth poetry చదివితే అర్థమే కాదు…ఇంక రాయటందాకానా…. simple expressions are fitted in simple words..Thanks andi 🙂

  2. Hari Krishna Sistla says:

    Good poetry.Definitely a good one.Rhyming might have been still better if you did sentence as,Ninnati Naa aalochanalaku,repati naa aacharana ku,naduma nedu pranaalikala gharshana – Ninnati naa niraasakoo,chigurinche aasalkoo,naduma nedu samkalpaala gharshana………..
    If the rhyming did proceed in that mode it might have still a better one,I am made to feel.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s