ఇంత మాత్రానికేనా?
కనులు మూస్తే కమ్మని కలల అలల హొయలు,
కనులు తెరిస్తే చేదు నిజాల సమ్మెట పోటులు,
లిప్తపాటులో కరిగిన కలలు,
జీవితమంతా ఎదురు చూసిన ఆశలు,
ఇంతకీ,
ఏమంత ఆశ పడ్డామని,
ఇన్ని నిరాశలు,
ఏమంత పెద్ద కోరికలని,
ఇన్ని నిట్టూర్పులు,
కూడుతో,
మనసు పొట్ట నింపాలని,
గుడ్డతో,
మమతలు అలంకరించాలని,
గూడులో,
అనురాగాలు పెనవేసుకోవాలని,
ఆశ పడడమే నేరమా?
ఇంత మాత్రానికే,
కొండెక్కిన కోరికలైపోయాయా?