బతుకు సమరంలో కొన్ని కొన్ని…
బతుకు సమరంలో జీవించాలంటే,
కొన్ని తప్పులు చెయ్యనే చెయ్యకూడదు,చేసామా, సరిదిద్దుకునే అవకాశం రానే రాదు.
కొన్ని చెయ్యాల్సిన పనులు చెయ్యల్సినప్పుడే చేసే తీరాలి,చెయ్యలేదా, ఆ పనులు చెయ్యాల్సిన అవకాశం రానే రాదు.కొన్ని గాయాలు తగలనే తగలకూడదు,తగిలాయా, ఆ గాయాల మచ్చలు మాననే మానవు.కొన్ని విభేదాలు రానే రాకూడదు,వచ్చాయా,ఆ విభేదాలతో బంధాలు నిలవనే నిలవవు.కొన్ని అన్యాయాలు ఎదిరించే తీరాలి,ఎదిరించలేదా, ఆ అన్యాయాలకు బలైపోతూనే ఉండాలి.కొన్ని అవకాశాలు వచ్చినప్పుడే అందిపుచ్చుకోవాలి,అందుకోలేదా, ఆ అవకాశాలు అందనే అందవు.కొన్ని ఆత్మీయతలను దూరం చేసుకొనే చేసుకోకూడదు,చేసుకున్నమా, అనురాగాన్ని పంచుకోవటానికి ఎవరూ మిగలరు.కొన్ని సందర్బాలలో మనసు మాట మాత్రమే వినాలి,వినలేదా, మూగబోయిన మనసు మరి పలకదు.కొన్ని కాదు, మనసుతో ఆడుకునే అన్ని ఆటల్లోను గెలిసే తీరాలి,ఓడామా, ఏ ఆట ఆడే అవకాశం రానే రాదు.
My Note: Hmmmm….looks so complicated…
Good Literature. You may attain a bright future if you do switch on to that profession however do not necessarily mean leave the profession which you are in currently.
Hari Krishna garu: I just hope that it continues as a hobby…hope my laziness shouldn’t overtake my hobbies. 🙂 My current prof is required to earn money…:)