పోస్ట్ చెయ్యని ఉత్తరాలు : కూతురు అమ్మకు రాసిన ఉత్తరం (అందరికీ…ఎవరికీ నిషేధం కాదు….)


 పోస్ట్ చెయ్యని ఉత్తరాలు : కూతురు అమ్మకు రాసిన ఉత్తరం (అందరికీ…ఎవరికీ నిషేధం కాదు….)
 
 
అమ్మా,
              ఈరోజెందుకో నువ్వు తెగ గుర్తొస్తున్నావు. చాలా బెంగగా, దిగులుగా అనిపిస్తుంది. ఆగి ఆగి కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి.  ఎందుకో తెలిదు దుఖం తన్నుకొస్తుంది. నీమీద చాలా బెంగగా ఉందమ్మా…..ఈవయసులో నేను ఈ మాటను ఎవరికన్నా చెబితే నవ్వుతారేమో? చిన్న పిల్లలు మాత్రమే అమ్మ కోసం బెంగ పడతారు అని ఎవరన్నారు?  ఒక బిడ్డకు అమ్మవయిన నీకు నీ అమ్మ మీద బెంగా అని ఎగతాళి చేస్తారు కదూ. అందుకే ఈ ఉత్తరం రాస్తున్నాను. ఒక ఆడపిల్ల అమ్మ అవతారమెత్తిన తర్వాతే తన అమ్మ కష్టాన్ని గుర్తిస్తుంది.
 
  అమ్మా, ఇంకోక్కసారి నన్ను మళ్లీ కనవూ, మరోసారి నన్ను పెంచవూ. నీ ఒడిలో మరోసారి వెచ్చగా ఒదిగిపోనీవూ. నీ కొంగు పట్టుకుని, నీ అడుగులకు అడ్డుపడనీవూ….
అమ్మా, నా చిన్నప్పుడు నువ్వు నన్ను కౌగిలించుకున్నట్లు మరోసారి నన్ను నీ కౌగిట్లో బందిచేయ్యవూ….ఆ  భద్రత, ఆ ధైర్యం మరోసారి కావాలనిపిస్తుంది. ఎందుకు ఇంత తొందరగా ఎదిగిపోయామో అనిపిస్తుంది, అమ్మా నన్ను ఎత్తుకో అని చెప్పలేనంతగా ఎందుకు ఎదిగిపోయామో? పాపం మనసుకు ఆ బంధనాలు తెలివు కదూ, ఇలా ఆశ పడుతూనే ఉంటుంది….
 
 అమ్మా, నీకో సంగతు తెలుసా? ఇప్పటికీ ఇంట్లోనో, బయటో ఏదన్న గొడవ జరిగితే, ముందు నువ్వే గుర్తొస్తావు. ఎన్ని బంధాలు వున్నా, భాంధవ్యాలు ఉన్నా అన్నీ నీ తర్వాతే. ఒంటరితనంలో తోడు నీ ఆలోచనలే.
యంత్రికతలో కూరుకుపోయిన నాకు నీ తలంపులే ఓదార్పులు. అమ్మ జ్ఞాపకాలే, ఎడారిలో ఒయాసిస్సులు.
 
 “నా చిన్నప్పుడు” అన్న మాట వెనుకాలే “మా అమ్మ” అన్న మాట ఎప్పుడూ ఉంటుంది. “నా చిన్నప్పుడు” అన్న జ్ఞాపకం నేను నా మనవళ్ళతో, మనవరాల్లతో కూడా పంచుకుంటానేమో.  నీ తోడు లేని నా చిన్నతనం లేనేలేదు. 
 
   అమ్మా, నేను వేసే ప్రతీ అడుగులోనూ నువ్వు నేర్పిన నడతే ఉంది. నా ప్రతీ ప్రవర్తనలోనూ, నువ్వు నేర్పిన సంస్కారమే ఉంది. నేను ఎదురుకుంటున్న ప్రతీ సమస్య వెనుక నువ్వు నేర్పిన నిగ్రహం ఉంది. నా ప్రతీ విజయం వెనుక నువ్వు నేర్పిన  ఆత్మవిశ్వాసం ఉంది. అన్నింటికన్నా ముఖ్యంగా, నాకు ఓటమి ఎదురైనప్పుడు, నాకు నువ్వు వున్నావన్ననమ్మకం ఉంది. 
 
   ఎప్పుడైనా విసుగ్గా ఉన్నప్పుడు, అన్నింటిని ఎలా ఉన్నాయో అలా ఒదిలేసి, నీ దగ్గరకు ఎగురుకుంటూ వచ్చేయాలనిపిస్తుంది. కానీ, వెనువెంటనే “అమ్మో నా పిల్లలు” అన్న నాలోని అమ్మతనం నన్ను కట్టిపడేస్తుంది. నీలో విసుగు నేను ఏనాడు చూడలేదు, అసలు అలాంటిది ఒకటి ఉంటుంది అని కూడా నాకు తెలిదు, నాదాకా వచ్చేదాకా. ఇదంతా నువ్వు నేర్పిందే కదమ్మా.   
“నేను నేర్పిందేముందమ్మా? నువ్వే నేర్చుకున్నావు”, అనేస్తావు నువ్వు.
 
అమ్మా, నేను నీకు ఎప్పుడూ ఎలా చిన్న పిల్లనో, నువ్వు కూడా నాకెప్పుడు అలాగే అమ్మవు. అందుకే అమ్మ నాకు నీ మీద బెంగగా ఉంది…ఈ బెంగను తగ్గించుకోవటం ఈ ఉత్తరం రాస్తున్నా.
కానీ, అమ్మ…ఈ ఉత్తరం నేను ఎప్పటికీ పోస్ట్ చెయ్యను. నీ చిరునామా తేలిక కాదు, నీ మనసు తెలుసు కాబట్టి. ఈ ఉత్తరం నువ్వు చదువుతే, నా కూతురికి నేనంటే ఎంత ప్రేమో అని గర్వంగా పొంగిపోవు, అయ్యో నా బంగారు తల్లి నా మీద బెంగ పెట్టుకుందే అని బాధ పడతావు. అందుకే ఈ ప్రేమను, కృతజ్ఞతను మనసులో దాచిపెట్టుకుని, సెలవల్లో నీ దగ్గర ఉండే కొద్ది రోజుల్లో నా బెంగను తీర్చుకుంటాను. అప్పటిదాకా నేను నీకు రాసిన ఈ ఉత్తరాన్ని నాకు నేనే చదువుకుంటాను, కాస్త దిగులు తగ్గించుకోవటానికి ప్రయత్నిస్తాను.  
                                                                                                                   ఇట్లు,
                                                                                                                   నీ బంగారు తల్లి. 
 
This entry was posted in పోస్ట్ చెయ్యని ఉత్తరాలు. Bookmark the permalink.

22 Responses to పోస్ట్ చెయ్యని ఉత్తరాలు : కూతురు అమ్మకు రాసిన ఉత్తరం (అందరికీ…ఎవరికీ నిషేధం కాదు….)

 1. Anonymous says:

  really wonderful

 2. రాఘవ says:

  దాదాపు ఇలాంటిదే నేను వ్రాసినది గుర్తొచ్చిందండీ… బాగుంది.

 3. SOUZANYA says:

  IT IS NICE

 4. Anonymous garu, సౌజన్య గారు: ధన్యవాదాలు…
  రాఘవ గారు: లింక్ ఇచ్చినందుకు ధన్యవాదాలు..మీ భావాల వెల్లువ చాలా బాగుంది…

 5. Ravi Babu says:

  మధురమైన ఆలోచనలకు నిలయం
  alochanalu.woardpress.com

 6. murali says:

  ప్రవీణ గారు బాగా రాశారు. ఆదివారం ఫాదర్స్ డే ఏమైనా రాయండి . ఎందుకో తండ్రి గురించి వచ్చిన సాహిత్యం తక్కువే

 7. Anonymous says:

  Praveena garu

  Simply nice.. just got to see your blog… very touching…

  subrahmanyam
  Toronto

 8. Anonymous says:

  Praveena

  very nice work…

  chal bavundi….

  subrahmanyam
  Toronto

 9. Srinivas says:

  చదివిన తరువాత మాటలు రవటం లేదు. చాలా సేపు నిశబ్దం ఆవరించింది.కన్నీటి పర్యంతం అయిందంటే నమ్మండి.వెంటనే నా ఇద్దరి కూతుర్లకు మేయిల్ పంపా..అమ్మ గురించి తెలియని మరిచిపోయిన విషయాలు తెలుసు కొటారనే ఆశతో

  • Srinivas garu: లోకంలో ఇంకా కలుషితం కానీ ప్రేమ ఇంకా వుందంటే అది తల్లి, తండ్రుల ప్రేమే. ధన్యావాదాలు

 10. అమ్మ గురించి ఎక్కడ ఏమి చదివినా ….మీరె గుర్తుకు వస్తున్నారు …ఎందుకంటే అమ్మ గురించి మీ కంటే తెలిసిన వారు అర్ధం చేసుకొనేవారు ఇంక ఎవరుంటారు చెప్పండి ..ప్రవీణ గారు ! అందుకే ఫేసుబుక్ లో కన్పించిన ఈ పోస్టింగ్ ను మీకు పంపిస్తున్నాను

  Mother’s Love
  When you were 1 year old, she fed you and bathed you.
  – You thanked her by crying all the night.
  When you were 2 years old, she taught you to walk.
  – You thanked her by running away when she called.
  When you were 3 years old, she made all your meals with love.
  – You thanked her by tossing your plate on the floor.
  When you were 4 years old, she gave you some crayons.
  – You thanked her by coloring the dinning room table.
  When you were 5 years old, she dressed you for the holidays.
  – You thanked her by looping into the nearest pile of mud.
  When you were 6 years old, she walked you into school.
  – You thanked her by screaming, “I’M NOT GOING”.
  When you were 7 years old, she bought you a baseball.
  – You thanked her by throwing it through the next-door-neighbor window.
  When you were 8 years old, she handed you an ice cream.
  – You thanked her by dripping it all over you lap.
  When you were 9 years old, she paid for piano lessons.
  – You thanked her by never even bothering to practice it.
  When you were 10 years old, she drove you all day, from soccer to gymnastic to one birthday party after another.
  – You thanked her by jumping out of the car and never looking back.
  When you were 11 years old, she took you and your friends to the movies.
  – You thanked her by asking to sit in the different row.
  When you were 12 years old, she warned you not to watch certain TV shows.
  – You thanked her by waiting until she left the house.
  When you were 13, she suggested a haircut that was becoming.
  – You thanked her by telling her she had no taste.
  When you were 14, she paid for a month away at summer camp.
  – You thanked her by forgetting to write a single letter.
  When you were 15, she came home from work, looking for a hug.
  – You thanked her by having your bedroom door locked.
  When you were 16, she taught you how to drove her car.
  – You thanked her by taking it every chance you could.
  When you were 17, she was expecting an important call.
  – You thanked her by being on the phone all night.
  When you were 18, she cried at your school graduation.
  – You thanked her by staying out partying until dawn.
  When you were 19, she paid for your college tuition, drove you to campus, carried your bags.
  – You thanked her by saying good-bye outside the dorm so you wouldn’t be embarrassed in front of you friends.
  When you were 20, she asked whether you were seeing anyone.
  – You thanked her by saying “It’s none of you business”.
  When you were 21, she suggested certain careers for your future.
  – You thanked her by saying “I don’t want to be like you”.
  When you were 22, she hugged you at your college graduation.
  – You thanked her by asking whether she could pay for a trip to Europe.
  When you were 23, she gave you furniture for your first apartment.
  – You thanked her by telling your friend it was ugly.
  When you were 24, she met your fiancee and asked about your plans for the future.
  – You thanked her by glaring and growling, “Muuhh-ther, please!”
  When you were 25, she helped to pay for your wedding, and she cried and told how deeply she loved you.
  – You thanked her by moving halfway across the country.
  When you were 30, she called with some advice on the baby.
  – You thanked by telling her, “Things are different now.”
  When you were 40, she called to remind you of a relative’s birthday.
  – You thanked her by saying you were “really busy right now.”
  When you were 50, she fell ill and needed you to take care of her.
  – You thanked her by reading about the burden parents become to their children.
  And then, one day, she quietly died. And everything you never did, came crashing down like thunder on your heart.
  If she’s still around, never forget to love her more than ever. And if she’s not, remember her unconditional love

  • Thotakuri Srinivas garu: I have no words to thank you for sharing this wonderful post…felt soo heavy. amma amme….Iam going to call my mother now. I have received this as a comment, now I am writing this comment. Thank you so much….

 11. thotakuri says:

  మళ్ళి మీ కోసం అమ్మ ప్రేమ గురించి వాస్తవం ………….

  అమ్మలేని ప్రపంచం
  Posted on October,2011 by విహంగ
  అమ్మలేని ఈ ప్రపంచంలో

  ప్రతి క్షణం

  ఓ అనాధలా మిగిలాననే భావం

  వెంటాడుతూనే వుంటుంది

  కానీ-

  చల్లని గాలి స్పర్శిస్తూన్నప్పుడు

  అమ్మ నా తల నిమురుతున్నట్టు

  ఉదయభానుడి నులి వెచ్చని కిరణాలు

  కిటికీలోంచి

  నా వొంటిని తాకినపుడు

  అమ్మ వొడిలో వున్నట్లు

  కొబ్బరి చెట్ల ఆకుల మధ్యనుంచి

  చల్లగా కురిసే వెన్నెలని చూసినప్పుడు

  అమ్మ నాతో మాట్లాడుతున్నట్టు

  ఏ తియ్యని పండు తిన్నా

  అమ్మ తన ప్రేమనంతా

  ఆ పండు ద్వారా నాకందిస్తున్నట్టు ,

  చివరికి

  అమ్మ అస్థికలై కలిసిన

  ఈ గోదావరిని చూస్తున్నప్పుడల్లా

  ఒక ప్రశాంతతని ఆస్వాదిస్తున్నట్టు

  అనుభవైక్యమౌతుంది

  అవును అమ్మంటే ప్రకృతి కన్నా మిన్న!

  ఆ ప్రకృతి కైనా

  విలయతాండవం వుంటుంది కానీ

  నా తల్లి ప్రేమలో

  కోప తాపాలకి తావులేదు

  ఆప్యాయతలూ,అనురాగాలకూ తప్ప!

  అమృతం తగిన వాళ్ళని

  చిరంజీవులంటారని విన్నాను

  కానీ నా అనుభవంలో

  అమ్మ ప్రేమను

  పొందగలిగిన వారే

  నిజమైన చిరంజీవులు!!

  – పుర్లి సత్య

  • thotakuri garu: అంతా అమ్మే…చక్కటి కవితను పోస్ట్ చేసారు. ధన్యవాదాలు
   అమ్మ గురించి ఎంత రాసినా తక్కువే….

  • murali says:

   నా గుండెకు చిల్లు పడ్డట్లు వుంది
   ఒక అమ్మ కురిపించిన ప్రేమ తో నిండటం లేదు.

   అందుకే, ప్రతి పలుకరింతలోనూ
   ప్రేమను కోసుకుని గుండెను నింపాలని ప్రయత్నిస్తున్నాను…

   కానీ నిండటం లేదు..
   అవును, నా గుండెకు చిల్లు పడ్డట్లు వుంది.

   • Murali garu: ఆ చిల్లు జీవితాంతం కారుతూనే వుంటుంది…ఎంత చక్కటి expression. ధన్యవాదాలు

 12. thotakuri says:

  మీ లాగే ఓ అమెరికా వాసి రాసిన ఉత్తరం….మీ కోసం

  అమ్మకో ఉత్తరం – కల్పనా రెంటాల
  ఇందాక నీతో ఫోన్ లో మాట్లాడుతుంటే సడెన్ గా లైన్ కట్ అయిపోయింది. ఇంట్లో ఉన్న కంప్యూటర్ నేర్చుకొని ఈమెయిల్ ఇవ్వడం అలవాటు చేసుకొమంటే వినవు కదా అమ్మా! ఇప్పుడు చూడు, నాకెంత టైమ్ వేస్టో. ఆ కాలింగ్ కార్డులతో ఫోన్ చేస్తుంటే మనిద్దరి మాటలు మధ్య లో ఉన్న మధ్యధరా సముద్రం లోనో, అరేబియా సముద్రం లోనో కలిసిపోతుంటాయి. అన్నయ్య ను అడిగితే నీకు ఈ మధ్య సరిగా వినపడటం లేదని, ఫోన్ చేసినా ఉపయోగం లేదని చెప్పాడు. ఇక తప్పుతుందా మరి అని ఈ ఉత్తరం మొదలుపెట్టాను. అమెరికా కబుర్లేమిటి అంటూ అక్కయ్య నన్ను ప్రాణం తీస్తోంది. కాన్ఫరెన్స్ కాల్ చేసి మనం ముగ్గురం ఫోన్ లో హాయి గా కబుర్లు చెప్పుకుందామంటే దిక్కు మాలిన కాలింగ్ కార్డ్ లు ఉన్నట్లుండి ఉలుకుపలుకుల్లేకుండా అవుతాయి.
  నువ్వు ఊరికే బాధపడుతుంటావు కానీ అమ్మా, నాకేమైంది? ఇక్కడ నేను హాయిగా వున్నాను. నా గురించి ఊరికే దిగులు పడకు. నేను, మా ఆయన , పిల్లలం అందరం సుఖం గా ఉన్నాం. నువ్వు నిశ్చింతగా ఉండు. నేను సరిగ్గా వండుకొని తింటున్నానో లేదో అని ఊరికే దిగులు ఇదై పోకు. ఓ పది రోజులు ఏదో నీ మాట తీసెయ్యలేక, ‘ అమ్మ వారు’ పోసిందని జాగ్రత్తగా పథ్యం చేశాను. ఇవాళ ఆదివారం తలంటుస్నానం చెశాను కానీ పోలేరమ్మ కు పెరుగన్నం నైవేద్యం మాత్రం పెట్టడం వీలు కాలెదు. నా తెల్లటి మొహం మీద మచ్చలు పడ్డాయేమోనని నువ్వంత కంగారు పడుతున్నావు కానీ ఇక్కడ డాక్టర్లు అతి శ్రద్ధ్గగా, పరమ జాగ్రత్త గా చూసుకుంటున్నారనుకో. ‘ చికెన్ పాక్స్’ అని తెలియగానే ఎంత హడావిడి చేశారనుకున్నావు! ఎవరెవరికి ఎప్పుడెప్పుడు ఈ జబ్బు వచ్చి ఉంటుంది అన్న దాని మీద మన వంశ వృక్షమంతా తిరగేశారు. అసలు ముందు వాళ్ళు చేసిన పనేమిటనుకున్నావు? నన్ను ఎమర్జెన్సీ రూమ్ కు పంపటం. ఎన్ని రకాల పారీక్షలు చేయవచ్చో ఒక్కటీ వదలకుండా అన్నీ చేశారు. వాళ్ళ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక నా తల ప్రాణం తోక కు వచ్చినా పేషెంట్ల పట్ల వాళ్ళ శ్రద్ధ చూసి ముచ్చటేసిందనుకో. ఓ విషయం మాత్రం తెలిసి వచ్చింది. అనంతపురం లోనే కాదు, అమెరికాలో కూడా ‘ అమ్మవార్లకు’ అయ్యవార్లకు కూడా మందుల్లేవని. కానీ ఇండియా – అక్కడైతే సన్నగా బక్క పీచు లాగా వున్నానని అందరూ ఏడిపించేవాళ్ళు కానీ ఇక్కడకొచ్చాక నేను మంచి రంగు వచ్చాను. అమెరికా గాలి, నీళ్ళు నాకు బాగా సరిపడ్డాయి. కాకపోతే ఇక్కడి నీళ్ళకు నా జుట్టు కాస్త చిట్లినట్లుంటే సన్నగా పిలకలా వుందని నాకే చికాకనిపించి చక్కగా భుజాల దాకా కత్తిరించేసుకున్నాను. బుద్ధిమంతుల జడ భుజాలు దాటదని నువ్వే చెప్పావు కదా. సో, అలా బుద్ధిమంతురాలినైపోయానన్న మాట.

  నన్ను చూసి అయిదారేళ్ళయిందని బెంగెట్టుకున్నానన్నావు. నిజమేననుకో. నాకు రావాలనే ఉంది కానీ ఇండియా ఎప్పుడొద్దామన్న ఏదో ఒక ఇబ్బంది. వర్షాకాలంలో వస్తే మన వీధుల నిండా ఆ బురద, మట్టి, రోడ్డు పక్కన ఎట్సెట్రా… తల్చుకుంటేనే రోత. చలికాలంలో వద్దామంటే మనింట్లో హీటింగ్ లేదు. ఇంక ఎండాకాలం సెలవులకు వద్దామంటే అబ్బో..ఆ ఎండ…ఆ ఉక్కపోత…పైగా ఇక్కడ పిల్లలు సమ్మర్ యాక్టివిటీస్ అన్నీ మిస్ అవుతారు. ఇక ఎప్పుడు రమ్మంటావో నువ్వే చెప్పు.
  ఇందాక నువ్వడిగినదేమిటి? సంతోషంగా వున్నానా అనేనా? నీకా అనుమానం ఎందుకు వచ్చింది? అమెరికాలో ఉండటమేమిటి ఏమిటి? ఒట్టి సంతోషమా? బ్రహ్మానందంగా ఉంటుంది. స్వేచ్ఛకు ఈ దేశం పెట్టింది పేరు. కొద్ది రోజులు పోతే, అప్పుడే పుట్టిన పిల్లకు పేరు కూడా ఆ పసి గుడ్డునే అడిగి పెడతారేమో! ప్రతి మనిషి మాటకు విలువుంటుంది. ఎవరి ‘ఛాయిస్’ కి ఎవరూ అడ్డురారు. ఇక సౌకర్యాల విషయానికొస్తే ఈ దేశం లో వున్నన్ని సౌకర్యాలు అంతరిక్షంలో కూడా ఉండవేమోనమ్మా. నీకో నిజం చెప్పనా? శరత్ నల్లగా తుమ్మ మొద్దులా వున్నా, ఎందుకు ఇష్టపడి మరీ పెళ్లి చేసుకున్నది? అతను అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడనే కదా! ఏ మాటకామాటే చెప్పుకోవాలి. ఇక్కడ ఆడవాళ్ళకు సూది బెజ్జంలో దారం ఎక్కించే పని కూడా ఉండదు. ఒంట్లో కొవ్వు కరగాలంటే జిమ్ కెళ్ళి వాకింగ్ నో, జాగింగ్ నో చేయాల్సిందే కానీ ఒళ్ళు అలిసే పనులే ఉండవు. ప్రతి దానికి మెషిన్లు ఉంటాయి. పర్సులో డబ్బుల బరువు కూడా ఉండదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ మెషీన్ లో పెట్టి కార్డ్ పెట్టి డబ్బులు తీసుకోవడమే.

  మెషిన్లకు టైమ్ సెట్ చేసి పెడితే అన్నీ అవే చేసుకుపోతాయి. కాళ్ళున్నా , లేకపోయినా బాధ లేదు. కార్లుంటే చాలు. ఎక్కడికైనా ఝామ్మంటూ వెళ్లిపోవచ్చు. విశాలమైన రోడ్లు. పచ్చటి చెట్లు. రకరకాల పూల మొక్కలు. ముఖ్యం గా తెల్లగా, పరిశుభ్రంగా మెరిసిపోయే బాత్ రూమ్ లు. కావల్సినంత అప్పు చేసే స్వేచ్ఛ. ఇంతకన్నా ఎవరికైనా మరీ ముఖ్యంగా ఆడవాళ్ళకు కావాల్సిందేముంటుంది చెప్పు. అడుగడుక్కి షాపింగ్ మాల్స్. ఒక్కో మాల్ లో లెక్కలేనన్ని షాప్ లు. తిరగటానికి ఓపిక ఉండాలే కానీ ఒక్కో దానిలో ఎన్ని వెరైటీలో! ఎప్పుడూ ఏదో ఒక క్లియరెన్స్ సేల్ ఉంటూనే ఉంటుంది. అసలు లోపలకు వెళితే బయటకు రాబుద్ధి కాదనుకో. జగదేక వీరుని కథ లో రామారావు ఒక్కో లోకానికి వెళ్ళి వస్తుంటాడు చూడు. అలాగన్న మాట. మనకు కూడా ఒక్కో మాల్ లోకి వెళ్ళి వస్తుంటే అచ్చంగా అలాగే అనిపిస్తుంటుంది.

  ఒళ్ళు కొవ్వు కాకపోతే ఇక్కడ కూడా ఆడవాళ్ళకు బోలెడు కష్టాలుంటాయని వాదించే వాళ్లనేమనాలి? నువ్వే చెప్పు. ఇక్కడ పని మనిషి రాలేదని హడావిడి పడనక్కర లేదు. ఇడ్లీ పిండి సరిగ్గా పూలవలేడ్ని దిగులు పడక్కరలేదు. పంటలు బాగా పండ లేదనో, వర్షాలు సరిగా కురవలేదనో, పుష్కరాల కోసం చుట్టాలు ఎక్కువ వచ్చారనో, ఆడపడుచుకు డబ్బులు పంపించాలనో దిగులు మేఘాల్లేవు. అడగకుండా ఎదురింటి పిల్లలు కూడా మన ఇంటికి రారు. పంచదారో, పది రూపాయలో అప్పు అడిగే పక్కింటి వాళ్ళు లేరు. వద్దన్నా పిలిచి మరీ డబ్బులు అప్పిచ్చే దేశంలో ఆడవాళ్ళు సుఖంగా లేకపోవడమేమిటమ్మా! అంతా నీ చాదస్తం కాకపోతేనూ!

  చెత్త పారేసుకోవటం దగ్గర నుంచి బస్సులు తిరగటం దాకా ఇక్కడంతా ప్రతిదీ ఓ పద్ధతిగా జరుగుతుంది. బస్సు ఏ స్టాప్ లో ఏ నిమిషానికి ఆగుతుందో స్కేడ్యూల్ లో ఉంటుంది. వాన అయినా, చలి అయినా అందులో మార్పేమి ఉండదు. మన దేశంలో నైతే స్టాప్ ఎక్కడో ఉంటుంది. బస్సు ఎక్కడో ఆగుతుంది. ఎప్పుడు ఏ బస్సు ఎందుకు వస్తుందో, అసలెందుకు బస్సు రాలేదో జ్యోతిష్కులు కూడా చెప్పలేరు కదా. పై పెచ్చు బంద్ లనీ, రాస్తారోకోలనీ ఎప్పుడూ ఏవో ఆటంకాలు. అంటే అన్నానంటావు కానీ మన వాళ్లోట్టి వెధవాయిలోయి అన్న గిరీశం మాట ఎంత నిజమనుకున్నావు!

  నాకైతే ఇక్కడ ప్రాణం తెరిపిన పడ్డట్లుందనుకో. అక్కడైతే పొద్దుట పాల ప్యాకెట్లు అయిపోతాయేమోనన్న టెన్షన్ తో తెల్లారేది. కానీ ఇక్కడ అలాంటి గొడవ లేదు. కాఫీ మేకర్ లో టైమ్ సెట్ చేసి రాత్రే కాఫీ పౌడర్ వేసి పెడితే పొద్దుట కరెక్టు గా మనం లేచే సమయానికి వేడి వేడిగా పొగలు కక్కుతూ డికాక్షన్ రెడీ గా ఉంటుంది. పాల ప్యాకెట్లు అయిపోతాయని పొద్దుటే నాలుగు గంటలకు నువ్వు లేచి వెళ్ళేదానివి కదా. అవన్నీ గుర్తొస్తే ఇప్పటి దాకా నువ్వెన్ని కష్టాలు పడ్డావో, ఇంకా ఎన్ని కష్టాలు పడతావో తలుచుకుంటే గుండెబరువెక్కుతుందనుకో.

  ఇప్పటికైనా నా మాట విను. నీ మనసు మార్చుకో. నీ వీసా పేపర్లు పంపిస్తాను. ఇక్కడకు వచ్చేయి. నీ జీవితంలో కాస్త సుఖపడటం అంటూ ఏదైనా ఉంటే, అది అమెరికాలో మాత్రమేనని మరిచిపోకు. ఇక్కడేదో చాలా చలిగా ఉంటుందని నువ్వు భయపడతావు కానీ పై నుండి కింద దాకా దట్టమైన కోట్లేసుకొని ఇంట్లో హీటింగ్ పెట్టుకొని హాయిగా ఓ పెగ్ వైన్ తాగితే చలా, గిలా …ఇక్కడ టైమ్ ని, వాతావరణాన్ని అన్నింటినీ మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ముందుకు , వెనక్కి తిప్పుకోవచ్చు. మొన్ననే మేం టైం ని ఒక గంట వెనక్కు తిప్పుకున్నాం కూడాను. అదేం చోద్యమే అనకు. కారణం నేను చెప్పినా నీకర్థం కాదు.
  ఇక్కడన్నీ రాజభోగాలేనమ్మా, మైనస్ డిగ్రీల చలి లో కూడా పంపు తిప్పితే వేడి నీళ్ళు. ఆకలేస్తే అయిదు నిముషాలుకూడా ఆగక్కరలేకుండా ఎప్పుడూ రెడీగా ఉండే సెరియల్స్, శాండ్ విచెస్, ఇన్ స్టంట్ రైస్. చిన్నప్పుడు జ్వరం వచ్చినప్పుడు బ్రెడ్ తినమంటే గొడవ చేసేదాన్ని కదా. ఇప్పుడు ఆ పట్టింపు లేదు. అమెరికాలో ముందు మనం అలవాటు చేసుకోవాల్సింది సెరియల్స్, శాండ్ విచెస్ తినటమే. టైం లేకపోతే కూరలు తరిగే పని కూడా లేదనుకో. అన్నీ ఫ్రోజెన్ వే దొరుకుతాయి. అలా సీల్ తీసి ఇలా బాణలిలో పడేయటమే. పడీ పడీ తెల్లగా మెరిసేలా గిన్నెలు తోమక్కర లేదు. ఒక్క సారి పై పైన కడిగి డిష్ వాషర్ లో పడేస్తే చాలు. గిన్నెలను శుభ్రంగా కడిగి తడిగా లేకుండా డ్రై కూడా చేసే పెడతాయి. వారానికో సారి బట్టలు, దుప్పట్లు, కర్టెన్లు అన్నీ చక్కగా వేటికవి విడి విడిగా జాగ్రత్త చేసుకొని వాషింగ్ మెషిన్లో పడేస్తే చాలు. బాత్ టబ్ లు, కమోడ్ లు వారానికో సారి గంట సేపు బ్రష్ చేస్తే వారమంతా తెల్లగా మెరుస్తుంటాయి. వారంలో అయిదు రోజులు ఆఫీస్ పని. వీకెండ్ మొత్తం ఇలా ఇంటి పని. చూశావా? నేనెంత పని మంతురాలినై పోయానో! అక్కడైతే ప్రతి పనికీ పని మనుష్యుల్నీ బతిమి లాడాలి. వాళ్ళు నాగాలు పెడితే ఎంత టెన్షన్ పడే వాళ్ళం! ఇక్కడ అలాంటి డిపెండెన్సీ ఏమీ లేదు. మన పనులు మనం చేసుకోవడం శరీరానికి ఎంత ఆరోగ్యం అనుకున్నావు. ఈ సారి మేమంతా ఇండియా వచ్చినప్పుడు పని పిల్ల చెప్పకుండా ఎగ్గొట్టిందని నువ్వేమి కంగారూ పడిపోకు. అమెరికా అమ్మాయి అంటే అసలు సిసలైన పని మంతురాలు అంటుంది నా ఫ్రెండ్ అరుణ. ఈ సారి నువ్వే చూస్తావు గా నేను బాత్ రూమ్ లు ఎంత బాగా క్లీన్ చేస్తానో, ఇల్లు ఎంత బాగా నీట్ గా పెడతానో!

  వారం రోజులు ఆఫీస్ తో కొంచెం బిజీగా అనిపించినా వీకెండ్ మాత్రం చాలా హేపీగా , జాలీగా రక రకాల పార్టీలతో గడిచిపోతుంటుంది. ఒక్కో వారం ఒకొక్కళ్ళ ఇంట్లో పార్టీ. అచ్చంగా మనం వారాలు చెప్పుకున్నట్లు. సగం పార్టీలు పాట్ లక్ లే. అంటే ఏమీ లేదు. ఒకొక్కళ్లం ఒక్కో వెరైటీ చేసి తీసుకెళతాం. లేదంటే అన్నీ వంటలు ఒకరే చేయాలంటే ఎంత కష్టం! ఇలా అందరూ ఎవరూ ఎక్కువ కష్టపడకుండా, ఎవరి మనసు ఎక్కువ నొప్పించకుండా నడుచుకుంటుంటారు. ఇక్కడ ఏడుపులు, నవ్వులు, పుట్టినరోజులు , చావు పలకరింపులు ప్రతీదీ టైం సెట్ చేసి పెట్టుకున్నట్లు జరిగిపోతుంటాయి. బర్త్ డేలు, వెడ్డింగ్ యానివర్సరీలు, బేబీ షవర్లు అన్నింటికీ వీకెండే మంచి ముహూర్తం. మనకేం జరిగినా తీరిగ్గా కూర్చొని వీకెండ్ లో ఏడ్చుకోవచ్చు. అక్కడైతే ప్రతీ నెలా ఏదో ఒక పండుగ. కొత్త బట్టలు, పిండి వంటలు, పట్టు చీరలు, పేరంటాలు. మనకి ఇష్టం లేకపోయినా చుట్టు పక్కల వాళ్ళ కోసమైనా ఏవో ఒకటి చేయాల్సి వచ్చేది. అబ్బో, ఎంత హైరానో కదా. మన దీపావళి, సంక్రాంతి కంటే హేలోవిన్, థాంక్స్ గివింగ్ , క్రిస్ మస్ లైతే బాగా గుర్తుంటాయి. ఎందుకంటే వాటికి అధిక మాసాలు, తిథుల గొడవ లేదు.

  ఇవన్నీ చదివిన తర్వాత నీకు బాగా అర్థమయ్యే ఉంటుంది. నేనెంత పరమానందంగా జీవితం గడుపుతున్నానో! ఇప్పటికైనా నా గురించి దిగులు పడటం మానేసి నీకు తెలిసిన ఆడపిల్లలకు అమెరికా జీవితం గురించి, అమెరికా మొగుళ్ళతో వచ్చే లాభాల గురించి చెప్పు. మన భాష , మన దేశం, మనసు, గినసు అంటూ పెట్టుకుంటే అన్నీ కష్టాలే కానీ సుఖాలేమున్నాయి చెప్పు? కాబట్టి అలాంటి ట్రాష్ ని అక్కడే కృష్ణ లో కలిపేసి ఇక్కడున్న మెషిన్లతో పాటు మనం కూడా ఒక మెషీన్ గా మారిపోతే మనకూ లాభం, మన దేశానికి కూడా లాభం.

  ఎన్నాళ్లయిందో కలం పట్టుకొని తెలుగు లో ఉత్తరం రాసి. అక్షరాలు కుదురుగా, ముత్యాల్లా లేవని తిట్టబోకు. అసలు తెలుగు ఈ మాత్రమైనా మర్చిపోకుండా నేను రాసినందుకు సంతోషించు. నీకీలా ఉత్తరం రాస్తుంటే గుండెపట్టేస్తోంది. రియాల్లీ ఐయాం మిస్సింగ్ యూ మామ్.

  ఇలా నీకుత్తరం రాస్తుంటే అచ్చంగా అప్పగింతలప్పుడు వచ్చాయి చూడు అట్లా నిజం కన్నీళ్లే వచ్చేస్తున్నాయి. టిష్యూ పేపర్ కావాలి. ఇప్పటి వరకూ వాటి మీదే నీకు లెటర్ రాశాను. ఉంటానమ్మా! ఎలాగైనా ఈ మెయిల్ ఇవ్వడం అలవాటు చేసుకో. నాకు ఈ ఉత్తరం రాసే ఆబ్లిగేషన్ తప్పుతుంది.

  అదుగో మైక్రోవేవ్ లో అన్నం పెట్టాను. అయిపోయినట్లు చిన్న గంట మోగిన శబ్దం. నాలుగు పొయ్యిల మీద నాలుగు వంటలున్నాయి. మళ్ళీ పదిహేను రోజుల వరకూ వంట కుదరదు. అన్నీ ఇవాళే చేసుకోవాలి. డ్రయ్యర్ లో బట్టలు తీసి మరో లోడ్ బట్టలు వేయాలి. వచ్చే వారానికి సరిపోయే ఊపిరి కూడా ఈ వీకెండ్ లోనే పీల్చుకోవాలి…ఉం…టా….

 13. sunderpriya says:

  డియర్ ప్రవీణ్

  నీవు రాసిన ” కూతురు అమ్మకు రాసిన ఉత్తరం”
  చాలా బావుంది.
  దూరంగా విదేశాలలో ఉన్న బిడ్డలు చదివారంటే రివ్వున
  తల్లి దగ్గరకు పరిగెత్తిపొతారు
  తల్లిని మించిన దైవంలెదు,అమ్మే అమృతకలశం
  అమ్మఒడిలోనే స్వర్గం ఉందని ఎందరో కవులు పాటల రూపంగా
  కథలరూపంగ వెల్లడించారు అన్నీ నిజమే!
  అమ్మ గురించి ఏమిరాసినా తక్కువే అనిపిస్తుంది
  నేనూ సింగపూర్లో ఉన్నాను తల్లికి దూరమై ఉన్న నాకు మీ ఉత్తరం
  నాకు ఓదార్పు నిచ్చింది నేనే రాసినట్లు ఒక ఫీలింగ్
  ఈ మరపురాని అనుభూతికి వెలకట్టలేనిది
  దాశరధి గారు రాసిన ఈ పాట వినే ఉంటారు
  అయినా మనందరి కోసం మరోమారు ఈ పాటని వింద్దాం

  అమ్మ అన్నది ఒక కమ్మని మాటా
  అది ఎన్నెన్నో తెలియని మమతల మూటా
  మమతల మూటా

  దేవుడే లేడనే మనిషున్నాడు
  అమ్మే లేదనువాడు అసలే లేడు
  తల్లి ప్రేమ నోచుకున్న కొడుకే కొడుకు
  ఆ తల్లి సేవ చేసుకునే బ్రతుకే బ్రతుకు..
  అమ్మ అన్నదీ..ఒక కమ్మని మాటా
  అది ఎన్నెన్నో తెలియని మమతల మూటా
  మమతల మూటా

  అమ్మంటే అంతులేని సొమ్మురా
  అది ఏనాటికి తరగని భాగ్యమ్మురా
  అమ్మ మనసు అమృతమే చిందురా
  అమ్మ ఒడిలోన స్వర్గమే ఉందిరా..ఉందిరా..
  అమ్మ అన్నది ఒక కమ్మని మాటా..
  అది ఎన్నెన్నో తెలియని మమతల మూటా..మమతల మూట

  అంగడిలో దొరకనిది అమ్మ ఒక్కటే
  అందరికీ ఇలవేలుపు అమ్మ ఒక్కటే
  అమ్మ ఉన్న ఇంటిలో లేనిది యేదీ
  అమ్మ అనురాగం ఇక నుంచి నీదీ..నాదీ..
  అమ్మ అన్నది ఒక కమ్మని మాటా
  అది ఎన్నెన్నో తెలియని మమతల మూటా..మమతల మూటా..

  చాలా థాంక్స్ ప్రవీణ్ మంచి కథ మాకోసం రాసినందుకు
  ప్రేమతో
  సుందర్‌ప్రియ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s