అవును నిజమే, గొప్పే….. మరి?


అవును నిజమే, గొప్పే….. మరి?

ప్రపంచాన్ని గుప్పెటలో బంధించాము,
అవును నిజమే, గొప్పే….. మరి,
గుప్పెడంత గుండెలో ఏమి బంధించావు?

ప్రపంచీకరణతో ప్రపంచాన్ని పల్లెటూరు చేసాము,
అవును నిజమే, గొప్పే….. మరి,
సొంతూరు అనుభందం, ఆత్మీయత ఉందా?

ఆదేశం, ఈదేశం అన్ని దేశాలు చుట్టివచ్చాము,
అవును నిజమే, గొప్పే….. మరి,
నీ దేశంలో నీ వాళ్ళ దగ్గర ఎన్నాళ్లున్నావు?
ఎంత ప్రేమను పొందావు?
ఎంత ఆత్మీయతను పంచావు?

అంతర్జాలంతో దేశవిదేశాల సమాచారాన్నంతా వాకిట్లో ఉంచాము,
అవును నిజమే, గొప్పే….. మరి,
బంధుమిత్రుల కష్టసుఖాల సమాచారం తెలుసా?   

పేస్ బుక్, ట్విట్టర్ లో వేల మందితో స్నేహం చేస్తున్నా,
అవును నిజమే, గొప్పే….. మరి,
నీ పొరుగింటి వారిని ఎప్పుడైనా పలకరించవా?

సృష్టికి ప్రతిసృష్టి సృస్టించాము,
అవును నిజమే, గొప్పే….. మరి,
ప్రకృతిని వినాశనం చేస్తూ నువ్వు నాశనమై పోతున్నావని గ్రహించావా?

ఒక్కమాట, నువ్వు మరిచిపోయిన మాట,
విలాసాలల్లో సుఖాన్ని అనుభవిస్తూ,
సంతోషాన్ని మరిచిపోయిన మాట,
విడిది విందు ఎంత రుచిగా ఉన్నా,
అమ్మ చేతి ముద్దే పొట్ట నింపుతుంది,
వ్యాపారసభల ఉపన్యాసాలు ఎన్ని విన్నా,
భార్య/భర్త పలకరింపే వీనుల విందుగా ఉంటుంది.
నోట్ల కట్టల సంపాదన ఎంత ఉన్నా,
బిడ్డలతో అనుభందమే ఆనందాన్నిస్తుంది.

ఓ మనిషి, నువ్వు తెలివి ఉన్న ఓ జీవివి మాత్రమే,
చావు పుట్టుకుల నడుమ నడమంత్రపు సిరి ఎంతున్నా,
నీ పొట్టకు కావలిసింది పిడికెడు మెతుకులే,
గుప్పెడు గుండెకు కావలిసింది మనసంత మమతే,
ఇదీ నిజం..అవును కదూ??

This entry was posted in కవితలు, జీవితం, మనిషి. Bookmark the permalink.

3 Responses to అవును నిజమే, గొప్పే….. మరి?

  1. Hari Krishna Sistla says:

    Though you have got many friends in Face book and Twitter,What is the comparative time you did spend with your neighbors is the point attracted me,After all, “What stood is the comparative time you did spend with your family persons” ?

  2. Siva Nagi Reddy says:

    Very nice one

  3. విజయ్ says:

    మీ అక్షరాలు కు లక్షల వందనాలు

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s