స్వేచ్ఛ హక్కా? అనుగ్రహమా?వరమా? శాపమా?
జీవితపు మనసులోని స్వచ్ఛత నుంచీ స్వేచ్ఛ తప్పిపోయింది,
తప్పిపోయిన స్వేచ్ఛను వెతుకుతుంటే,
నా మనసు, నా మధిని కొన్ని ప్రశ్నలు అడిగింది,
స్వేచ్ఛ హక్కా? అనుగ్రహమా?
స్వేచ్ఛ వరమా? శాపమా?
హద్దులు లేని స్వేచ్ఛ ఎక్కువ ప్రమాదమా?
కనీసపు స్వేచ్ఛ కరువైన బతుకు ఎక్కువ భారమా?
స్వేచ్ఛను వెతకటం పక్కన పెట్టి,
సమాధానాల కోసం అన్వేషిస్తుంటే తారసపడిన కొన్ని సంఘటనలు.
ప్రేమను తిరస్కరించే స్వేచ్ఛ,
యాసిడ్ బాటిల్ భగభగలలో కాలి భూడిదైపోయింది.
పేదవాడికి జబ్బు చేసే స్వేచ్ఛ,
corporate hospital బిల్లుల్లో కరిగిపోయింది.
సామాన్యుడు అన్యాయాన్ని ఎదిరించే స్వేచ్ఛ,
కుటిల రాక్షస రాజకీయాలలో అణిగిపోయింది.
తప్పును ధైర్యంగా తప్పు అని చెప్పగలిగే స్వేచ్ఛ,
కుల, మత, ఈమధ్యే ఇటు దాపురించిన ప్రాంతీయ దురభిమానంలో దహించుకుపోయింది.
మంచిని బహిర్గతంగా మెచ్చుకునే స్వేచ్ఛ,
తమ పర భేదాల మధ్య నలిగిపోయింది.
నీ అభిప్రాయంతో నేను ఏకీభవించను అనగలిగే స్వేచ్ఛ,
సంకుచిత భావాలలో బందీ అయిపోయింది.
సభ్యత, సంస్కారం, సంస్కృతులను గౌరవించే స్వేచ్ఛ,
పాశ్చాత్య నవీనత్వపు ఎగతాలులుగా మారిపోయింది.
యువత ఆవేశం ఆలోచనగా మారే స్వేచ్ఛ,
నాయకుల భవిష్యత్తు పునాదుల నిర్మాణంలో పాతుబడిపోయింది.
అందరూ చదువుకునే స్వేచ్ఛ,
చదువు అమ్ముకునే కళాశాలల్లో తాకట్టు పెట్టడమయ్యింది.
మూడేళ్ళ పసివాడి LKG సీటు స్వేచ్ఛ,
international concept school interviewలలో అమాయకంగా బలైపోయింది.
బాల్యపు ఆటలు ఆడుకునే స్వేచ్ఛ,
భారమైన కాన్వెంట్ చదువుల్లో బక్క చిక్కిపోయింది.
వేసవి సెలవుల కోసం ఎదురుచూసే స్వేచ్ఛ,
సమ్మర్ క్యాంపుల వ్యాపారంలో పెట్టుబడిగా మారిపోయింది.
ఈ క్షణాన్ని ఆస్వాదించే స్వేచ్ఛ,
మరుక్షణం ఏమవుతుందో అన్న భయంలో ఆనందాన్ని కోల్పోయింది.
స్పందించే హృదయపు ఆలోచనలు కార్యరూపం దాల్చాల్సిన స్వేచ్ఛ,
పదాలలో బందీ అయిపోయి, కవితలల్లడంతో సరిపెట్టుకుంది.
ఇదంతా నాణానికి ఒకవైపు అయితే, మరో వైపు ఇక్కడ(భారతదేశంలో స్వేఛ్చ స్వాతంత్ర్యం ఎంతంటే?),
ఇంతకీ స్వేచ్ఛ హక్కా? అనుగ్రహమా? వరమా? శాపమా?
నాకు ఇప్పటి వరకు దొరికిన సమాధానం స్వేచ్ఛ బాధ్యత. మీకు సమాధానం తెలిస్తే కొంచెం చెప్పరూ….
My note: హమ్మయ్య…రాసేసా. బ్లాగ్ లో రాసుకునే స్వేచ్ఛ ఇంకా నేను కోల్పోలేదు. కాస్త కలవర పెట్టే అనుభవాలు ఒకటి రెండు ఎదురైనా, ఇంకా రాసుకునే స్వేచ్ఛ నానుండీ తప్పిపోలేదు.
nice bagumdi
బాగా రాశారండి.
The last sentence “Idantaa Naaneniki okavaipu”,did attract me a lot
Hari Krishna garu: I did write the otherside of the coin..Thanks andi..