సగటు ఆడపిల్ల (2 ) — Society


సగటు ఆడపిల్ల (2 ) — Society

“అమ్మలూ, కాలేజీకి బయలుదేరుతున్నావా?” 

“ఇంకా కొంచెం టైం ఉందమ్మా, బయలుదేరుతాను.”

“జాగ్రత్త తల్లీ, నువ్వు బయటకు వెళుతుంటే నాకు భయంగా ఉంది.”

“అదేమిటమ్మా కొత్తగా?”

“టీవీ లోనూ, పేపర్లోను చూడట్లేదు రోజూ, అవన్నీ చదువుతుంటే కంగారుగా అనిపిస్తుంది. ”

“కంగారు పడకమ్మ, నేను నా జాగ్రత్తలో ఉంటాను.”

“ఎవరితోనూ మాట్లాడక, అబ్బాయిల జోలికి అసలే వెళ్ళకు. ఇంటి దగ్గర దించిన తల మళ్లీ ఇంటికి వచ్చాకే ఎత్తు. ఆకు వెళ్లి  ముళ్ళు మీద పడ్డా…”

 “అమ్మ అమ్మా…నీ ఆదుర్దా నాకు అర్థం అవుతుంది. ఎప్పుడూ తల దించుకునే ఉంటే చుట్టూ ఉన్నలోకం ఎలా చూసేది? అందరితోను కలివిడిగా ఉంటూనే, నా పరిధిలో నేనుంటాను. ఎవరికీ అతిగా ప్రవర్తించే ఛాన్స్ ఇవ్వను, నేనూ తీసుకొను.  ఒక అబ్బాయితో మాట్లాడుతున్నప్పుడు, అతను మాట్లాడే విధానం బట్టి మనకు అతని మనసులో ఏముందో తప్పక తెలుస్తుంది. ఏదన్నా తేడాగా ఉన్నట్లు సూచాయిగా అనిపిస్తే నిర్లక్ష్యం చెయ్యకుండా, ఉండాల్సిన దూరంలో అతన్ని ఉంచుతాను, నేనూ ఉంటాను. sixth sense అనేది మన అందరికీ ఎంతో కొంత ఉంటుంది కదమ్మా.”

“ఏమో తల్లి, ఈ రోజుల్లో అబ్బాయిలను నమ్మేదట్టు లేదు” 

“అమ్మా, ప్రతీసారి అబ్బాయిలదే తప్పు అని అనలేము. వాళ్లను రెచ్చగొట్టడం ఎందుకు? ఆ తర్వాత తప్పులెంచడం ఎందుకు? Generalize చేసేసి అబ్బాయిలంతా అలాగా, అమ్మాయిలంతా ఇలాగ అనటం ఎంత వరకు సబబు?”

“నువ్వు చెప్పింది నిజమే అమ్మలూ, అమ్మాయిలు కూడా ఏమీ తక్కువ కాదు ఈరోజుల్లో”.

“అవునమ్మ, అమ్మాయా, అబ్బాయా అన్న విషయం పక్కన పెడితే. అది వ్యక్తిని బట్టి, వ్యక్తిత్వాన్ని బట్టి ఆధారపడి వుంటుంది”.

“ఎంత మన జాగ్రత్తలో ఉన్నా అమ్మలూ, కొన్ని అపశృతులు దొర్లుతూనే ఉంటాయి.”

“అమ్మ, ఎవరన్నా నాతో ఎకిలిగా ప్రవర్తిస్తే, అదంతా గమనిస్తూనే, ఒకటి రెండు సార్లు పట్టించుకోనట్టు  ఉంటాను. వారికి వారు సరైతే సరి, లేకపోతే concerned authorities కి complain చేస్తాను. అన్నింటికన్నా ముఖ్యంగా బయట జరిగే ప్రతీ విషయం నీతోను, నాన్నతోనూ చెపుతాను.”

“బాగుందమ్మా నువ్వు చెప్పేది వింటుంటే, నాకు కాస్త ధైర్యంగా అనిపిస్తుంది. ఎందుకైనా మంచిది నీ పర్సులో చిన్న కారం పొట్లం పెట్టుకో తల్లీ.”

“అలాగేనమ్మా, నువ్వు నాకు బరోసాతో కూడుకున్న ధైర్యం చెప్పు, భయాన్ని పెంచకు.”

🙂 *     *      *        *         *      *        *         *           *          *           *             *       * 🙂

 సగటు ఆడపిల్ల (1) —– పుట్టిల్లు

This entry was posted in సగటు ఆడపిల్ల. Bookmark the permalink.

5 Responses to సగటు ఆడపిల్ల (2 ) — Society

 1. Pingback: సగటు ఆడపిల్ల (1) —– పుట్టిల్లు | నా అనుభవాలు….ఆలోచనలు…

 2. RSReddy says:

  హలో ప్రవీణగారూ!
  పొదుపుగా వ్రాసినా విషయం చాలా లోతుగానే టచ్ చేసారు. బావుందండీ:)

 3. Naa koothuriki (yashaswi chittiki) alaa ennadu cheppaledu mumbai lo
  naa koothuru kaadu naa koduku adi
  meeru maanasika paripoornulani nammuthunnanu
  maa koothuru mee laane kaavaalani aashirvadinchandi
  mee

 4. Kesava Kumar says:

  ప్రవీణ గారూ.. “సగటు ఆడపిల్ల” చాల ప్రాక్టికల్ గా ఉంది…సహజత్వం అంశంలో ..కధనం లో సున్నితం..గుర్తుపట్టాను…ఇప్పుడే మీ కవితని.. కాపీ చేసుకున్నాను…ఎందుకో తెలుసా.. కాలేజి కి వెళ్ళే మా అమ్మాయికి ఇవ్వడానికి.. Thanks..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s