సగటు ఆడపిల్ల (1) —– పుట్టిల్లు


సగటు ఆడపిల్ల (1) —– పుట్టిల్లు

“అమ్మలు, కాస్త ఇటు వచ్చి కొంచెం పని అందుకో తల్లీ”

“అమ్మా నా ప్రాజెక్ట్ వర్క్ ఇంకా complete అవ్వలేదు, రేపే submit చెయ్యాలి. అన్నయ్య కాలీగానే ఉన్నాడుగా. ఆ టీవీ చూసే బదులు నీకు సాయం చెయ్యమను.”

“ఓయ్, ఏంటీ ఉచిత సలహా ఇస్తున్నావ్, నేను అమ్మకు సాయం చెయ్యలా?”

“మగ పిల్లాడు, వాడేం చేస్తాడమ్మా?”

“అమ్మా, నువ్విలాగే వాడిని పాడు చెయ్యి. రేపు వాడికొచ్చే పెళ్ళాం వాడిని కాదు, ముందు నిన్ను వాయించేస్తుంది.”

“నువ్వు నోర్ముయ్యి, నీలాంటి అమ్మాయిని నేను చేసుకోను.”

“మరి ఎలాంటి అమ్మాయిని చేసుకుంటావేమిటి? చదువు, ఉద్యోగం, డబ్బు, అందం అన్నీ కావాలిగా?దేనిని ఒదులుకుంటావు చెప్పు? మరి అన్నీ ఉన్న అమ్మాయి నువ్వు చెప్పినదానికల్లా గంగిరెద్దులా తలాడిస్తుందంటావా? ఆ వచ్చే అమ్మాయి నీలోనూ అన్నీ వుండాలనుకుంటుంది కదా.”

“నీలాగా పోగారుండకూడదు. పొగరులేని అమ్మయినైతేనే చేసుకుంటా.”

“బాబు మహారాజా ఇది పొగరు కాదు. నీకు అహంకారముగా  కనిపించే ఆత్మగౌరవం.   నీకు నీ  ఆత్మగౌరవం అంటే ఎంత గౌరవమో నాకు కూడా అంతే. I am demanding for equal responsibilities and rights.”

“సుత్తేం కాదు, పెద్ద చదువుకున్నావని పొగరు.”

“నేనూ నీలాంటి మనిషినే అని నేను అంటుంటే, నీకు పొగరుగా ఎందుకు అనిపిస్తుంది? నేనేమి నీకంటే గొప్ప అని అనట్లేదుగా, నీతో పాటే నేను, నాతో పాటే నువ్వు అని మాత్రమే కదా అంటున్నా, అందులో తప్పేముంది?”

“నాతో పాటు నువ్వా, నీతో పాటు నేనా..ఇదేదో కవిత్వం చెపుతున్నట్లుంది. ఉండు అమ్మకు చెపుతా”.

“చెప్పు చెప్పు…అమ్మ చాదస్తాన్ని నువ్వు బాగా వాడుకుంటున్నావు. నేనూ చెపుతా నాన్నకు.”

“అవునవును, నాన్న గారబాన్ని నువ్వు బాగా అలుసుగా తీసుకోవట్లా? నీతో వాదించటం నావల్ల కాదు. నిన్ను చేసుకునే వాడెవడో  కానీ, పాపం అయిపోయాడు.”

“ఏమీ అయిపోడు, చక్కగా ఉంటాడు. ఎక్కడ సర్దుకోవాలో, ఎక్కడ నేను నేనుగా ఉండాలో నాకు తెలుసు. expectations, limitations balance చేసుకోవటం మొదటి రోజు నుంచే అలవాటు చేసుకుంటాను. నాకేమి పెద్ద పెద్ద ఆశలు లేవు. కలల రాకుమారుడు, వీరుడు, శూరుడు…..extra..extra. నేను ఎంత సాధారణమైన మనిషినో, నాకు అంతే సాధారణమైన మనిషే దొరుకుతాడు.”

“నా సంగతి నేను చూసుకుంటానులే కానీ, ఇంతకీ తమరికేలాంటి వైఫ్ కావాలేంటి?”

“నాకా చెప్పమంటావా….నిన్ను ఆడపడుచుగా బరించే శక్తి సామర్ధ్యాలు ఉన్న అమ్మాయి ఐతే చాలు.”

“నిజమే నిజమే నిన్ను దారిలో పెట్టాలంటే ఆ మాత్రం శక్తి సామర్ధ్యాలు ఉండాలిలే.”

“అమ్మలూ వస్తున్నావా?”

“అమ్మా వస్తున్నా, పదరా నువ్వు కూడా, ఇద్దరమూ కలిసి తొందరగా అమ్మ పని అవచేద్దాం, ఆ తర్వాత నేను ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకుంటానురా.”

“పద తప్పుతుందా నాకు. ముందే చెపుతున్నా క్రికెట్ మ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత నన్ను disturb చెయ్యకూడదు.”

“సరేరా అన్నా, నీ క్రికెట్ మ్యాచ్ మొదలయ్యే లోపు నాకు, అమ్మకు సాయం చెయ్యి. ఆ తర్వాత మిగిలిన పని నేనే చేస్తాను. నిన్ను disturb చెయ్యను. సరేనా ”

🙂 *     *      *     *     *        *       *       *        *       *        *         *         *         *  🙂

సగటు ఆడపిల్ల (2 ) — Society

This entry was posted in సగటు ఆడపిల్ల, Uncategorized. Bookmark the permalink.

12 Responses to సగటు ఆడపిల్ల (1) —– పుట్టిల్లు

  1. uday says:

    చాలా బాగుంది. చక్కగా వ్యక్తపరిచావ్ ప్రతి ఇంటిలో జరిగే విషయాల్ని

  2. Ravi Chowdary says:

    I read some more your posts before this post today.Felt something dat i always wanted to.
    Requesting god to give some freetime n patience to read allllllllllllllllllllllllllllll ur posts 🙂

  3. ఉదయ్ గారు: ధన్యవాదాలు

    రవి గారు: నా సోది భారించాలంటే చాచాచాలాలాలా ఓపిక ఉండాలండి 🙂 🙂 Thanks a lot…:)

  4. Pingback: సగటు ఆడపిల్ల (2 ) — Society | నా అనుభవాలు….ఆలోచనలు…

  5. manju says:

    baga rasaru,,chinnappati nunde modalu avvali kasta sayam cheyatam,,lekapote inti panulu anevi kevalam aadavarive ani abhiprayam loki vastaru magavallu,,,
    nice post,,

  6. ప్రవీణ గారు,

    బాగా వ్రాశారు.ఇదొక పార్శ్వం మాత్రమే.మగపిల్లల మధ్య ఒక్కతే ఆడపిల్లైతే,తల్లిదండ్రుల గారాబాన్ని ఆసరా చేసుకొని పొగరుగా ప్రవర్తించే ఆడపిల్లలూ ఉన్నారు

    • Naseer says:

      “ఏమీ అయిపోడు, చక్కగా ఉంటాడు. ఎక్కడ సర్దుకోవాలో, ఎక్కడ నేను నేనుగా ఉండాలో నాకు తెలుసు. expectations, limitations balance చేసుకోవటం మొదటి రోజు నుంచే అలవాటు చేసుకుంటాను. నాకేమి పెద్ద పెద్ద ఆశలు లేవు. కలల రాకుమారుడు, వీరుడు, శూరుడు…..extra..extra. నేను ఎంత సాధారణమైన మనిషినో, నాకు అంతే సాధారణమైన మనిషే దొరుకుతాడు.” —– అలా అయితే సరే! కాని అందరూ ఇలా లేరు సుమా!!

  7. మంజు గారు: హాహా..ఇప్పటికే ఆ అభిప్రాయంలో లేరంటారా??ధన్యవాదాలు.
    బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ గారు: నిజమేనండి, మితిమీరిన గారాబం భవిష్యత్తులో ఎన్నో సమస్యలకు దారి తీస్తుంది. ధన్యవాదాలు.

  8. Hari Krishna Sistla says:

    As I was calling earlier, The opinions of yours stood the single side of the coin. Almost,The same was the opinion of Mr.Lokesh Srikanth . B .
    However I am aware The same answer myself too shall make.

  9. కమల్ says:

    మీ కథలో మగాడు పనిచేయట్లేదు కాని మా ఇంట్లో మాత్రం ఆడపిల్ల ఏ పని చేయలేదు..మగాళ్ళమైనా మేమే అన్ని పనులు చేసేవాళ్ళం..! చివరకు వంట కూడ మాకు వచ్చు కాని మా చెల్లాయ‌కి కనీసం అన్నం వండటం కూడ వచ్చేది కాదు.. ఏంటో ప్రపంచం అంతా ఒకేలాగే వుందనుకుంటారు అనుకుంటాను. ప్చ్..!

    • కమల్ గారు: పోన్లెండి…ఎలాగు పెళ్ళయ్యాక తప్పదు కదా, మీరు మీ ఆవిడకు హెల్ప్ చెయ్యగలుగుతారు…ఏమంటారు 🙂

Leave a reply to manju Cancel reply