ఓ చిన్ని గుర్తింపు
నా కవిత “అదిగదిగో…” కౌముది మే ఎడిసన్లో అచ్చయిందోచ్. నా మొదటి కధ “ప్రేమరాహిత్యం” సాధారణ ప్రచురణకు ఎన్నికయిందోచ్. కౌముది యాజమాన్యానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు..
అదిగదిగో…
అదిగదిగో ఆనందం,
చిటారు కొమ్మన మిఠాయి పొట్లం,
అదిగదిగో సంతోషం,
ఎగిరే పక్షుల రెక్కల మాటున మరి భద్రం,
అదిగదిగో మనశ్శాంతి గమ్యం,
అలల లయల హోయలలో తేలియాడే చందం.
అదిగదిగో మందహాసం,
సెలయేటి పరవళ్ళ కేళీవిలాసం,
అదిగదిగో విలాసం,
ఆకాశాన ఇంధ్రధనుస్సు పరావర్తనం,
అదిగదిగో గమ్యం,
గగనాన మబ్బుతునకల పయనం,
అదిగదిగో విజయం,
పిల్లగాలి పలకరింపుల నిత్యచలనం,
అదిగదిగో జీవితం,
ధరణి సహనపు ఓదార్పుల నిట్టూర్పుల సంగమం,
రణరంగపు శౌర్య పరాక్రమాల వీరత్యం.
అభినందనలు ప్రవీణ గారు….
బహుశా ఇది రెండవదనుకుంటాను…
చాలా బాగా రాసారు…
గుర్తుండిపోయేలా వుంది మీ కవిత
కంగ్రాట్స్….
and of course.. u deserve it!
సోదరీ! చాలా సంతీషం. చాలా బాగుంది. ఇలా కొనసాగించు నీ కవన విన్యాసం
సత్య గారు: అవునండి ఇది రెండోసారి. ధన్యవాదాలు
ఉదయ్ గారు: ధన్యవాదాలు