మనిషి ఎంత చిత్రం, మనసు అంత విచిత్రం…
మనిషి ఎంత చిత్రమో,
మనసు అంత విచిత్రం,
ఆలోచనలు అనంతం,
ఆశలు అపరిమితం,
చేతలు మాత్రం పరిమితం,
సప్త సముద్రాల నీటిని సిరాగా నింపి,
నిఘంటువు ఆఖరి అక్షరంతో సహా లిఖిలించినా,
ఇంకా లెక్కలేనన్ని విషయాలు మిగిలే ఉంటాయి.
అంతా అర్థం అయ్యినట్టే అనిపిస్తూ,
ఏమీ అర్థంకాని విశ్వరహస్యం మానవ మనసు.
ఏ ఏ విషయాలకు ఏ మనిషి ఎప్పుడూ ఎలా స్పందిస్తాడో కనీసం మనిషిని సృష్టించిన దేవుడికైనా తెలుసా?
ఒక్కోసారి, ఓ చిన్న మాటతోనే అన్నీ చెప్పినట్లు ఉంటుంది,
మరోసారి,ఎంత మాట్లాడినా ఏమీ చెప్పనట్లే ఉంటుంది.
ఒక్కోసారి, సున్నితమైన స్పర్శలోనే ప్రేమంతా ఒలకపోసినట్టు ఉంటుంది,
మరోసారి, బిగి కౌగిలింతల్లోనూ కృత్రిమత్వమే కనిపిస్తుంది.
ఒక్కోసారి, చిరునవ్వే ఆనందాన్ని మోసుకొస్తుంది,
మరోసారి, బిగ్గరగా నవ్వినా సంతోషం ఉండదు.
ఒక్కోసారి, మొదటి కలయికలోనే ఆత్మీయులమైపోతాము,
మరోసారి, ఎన్నాళ్ళు కలిసి ఉన్నా సన్నిహితమే రాదు.
ఒక్కోసారి, కళ్ళల్లోనే ఉసులన్నీ వినిపిస్తాయి,
మరోసారి, కళ్ళల్లో కళ్ళు పెట్టి వెతికినా ఏ బాష కనిపించదు.
ఒక్కోసారి, తప్పులు కూడా ఒప్పులుగా కానవస్తాయి,
మరోసారి, మంచి కూడా చెడుగా అనిపిస్తుంది.
ఒక్కోసారి, మనిషి చేసే చిన్న పనుల్లోనే మనస్తత్వం అర్థం అవుతుంది,
మరోసారి, ఎన్ని సేవా కార్యక్రమాలలో పాల్గొన్నా ఏదో సంశయం ఉంటుంది.
ఒక్కోసారి, ఎంత అందమైన జీవితం ఇది అనిపిస్తుంది,
మరోసారి, ఈ బతుక్కి ఇన్ని కష్టాలా అనిపిస్తుంది.
ఒక్కోసారి, అందరూ అత్మీయులుగానే అగుపిస్తారు,
మరోసారి, బందువులు కూడా బద్ధ శత్రువులుగా కానవస్తారు.
ఒక్కోసారి, భారమైన మనసుకు తోడు కావాలనిపిస్తుంది,
మరోసారి, బాధలోనూ ఒంటరిగానే ఉండాలనిపిస్తుంది.
ఒక్కోసారి, ప్రసంశలు మాటల్లో వినిపిస్తాయి,
మరోసారి, విమర్శలు నుదుటి చిట్లిపుల్లో కనిపిస్తాయి.
ఒక్కోసారి,చిరునవ్వు సమాధానమవుతుంది,
మరోసారి, అవునన్నా, కాదన్నా ఏదీ జవాబు కాదు.
ఒక్కోసారి, ప్రేమ కటినంగా బాధిస్తుంది,
మరోసారి, ద్వేషం సున్నితంగా సంతోషపెడుతుంది.
ఒక్కోసారి కాదు, మరోసారి కాదు అన్నిసార్లయిన, ఎన్నిసార్లయినా మనిషి సారం మరో మనిషికి అర్థం కానే కాదు…అందుకేనేమో తెలుసుకోవాలన్న ఉత్సుకత ఎప్పటికీ తగ్గదు, తీరదు…
మై నోట్: ఒక్కోసారి ఏదో ఉద్దరించేద్దాం అనుకుంటాను. మరోసారి కాదు, అన్నిసార్లు అనుకుంటాను ఏమి ఉద్దరిస్తాములే అని. నాకు ఓ మంచి ఆలోచన ఉంటుంది..మంచి అంటే ఆ పని చేస్తేనే మంచి, ఇలా బ్లాగులో రాసుకుంటే కాదు (ఆలోచనలు అపరిమితం) .నెలలో కనీసం రెండుసార్లు old age home or orphanageor special needs school కి వెళ్లి ఏదన్నా చెయ్యాలి అని, కానీ అన్నిసార్లు అనిపిస్తుంది పిల్లలతో కాస్త టైం స్పెండ్ చేసేదే వీకెండ్లో, ఏమి చేస్తాములే అని (చేతలు పరిమితం, కారణాలు అనంతం). “సంసార సాగరం, భవబందాలు…etc”, చిన్న జీవితానికి చెప్పిన పెద్ద పెద్ద సూక్తులు అతి చిన్న విషయాలకు కూడా వర్తింప చేసేసుకుని ఒక్కోసారి అనుకునేవి ఏ ఒక్కసారి చెయ్యకపోవటం. నాలాగానే చాలా మంది చాలా అనుకుంటారు, కానీ చాలా కొద్దిమంది మాత్రమే చెయ్యగలుగుతారు….. Hats off to them.
VERY NICE POSTING,, I HV VREY NICE FEELINGS WHEN I READ ……..KEEP POSTING
good article ,manise manishiki teerani siksha devudu ilaa teerchukunnadu kaksha……sarma TSS
చాలా బావుందండీ.
chaala baaga cheppaaru… motham manishi jeevitham lo manasuku sambandhinchi maxmum konaalanu sprusinchaaru chakkaga saralamaina padaalatho…
శర్మ గారు: సరళమైన భాషలో…..అసలు సంగతి ఏమిటంటే నాకు భాష మీద పట్టులేదు. ఏదో రాయాలన్న తపన, భావనే కానీ తెలుగులో క్లిస్తమైన పదాలు తెలివు. ఎవరికీ చెప్పకండే.. 🙂 కృతజ్ఞతలు.
ఉదయ్ గారు, తృష్ణ గారు: ధన్యవాదాలు
PRAVEENA GARU ,CHADIVEY MEMU CNNFUSE AVVAKUNDA MEE(MAA) CONFUSTIONS NI CHALAA CHAKKAGA RASARU..