ఇంతేనా మనం??
ఆలోచనల చిక్కుముడుల నడుమ,
ఏమూలో చిక్కుకుపోయిన మనసును,
ఆవేశపు ముళ్ళులు గుచ్చి గుచ్చి బాధిస్తుంటే,
చేతకానితనం సానుభూతిగా చూస్తూ,
ఎగతాళిగా వెక్కిరిస్తుంటే,
స్వార్థానికి అసమర్ధత జతపరిచి,
బాధ్యతకు నిర్లక్ష్యం తోడుచేసి,
అసహాయతకు నిస్సహాయతను లంకె పెట్టి,
నా పరిధిని నే సౌక్యంగా నిర్ణయించుకుని,
తోచినట్టు నా చుట్టూ నే గిరి గీసుకుని,
కర్తవ్యం కేవలం కలంలో నింపి,
రాస్తున్న రాతలివి,
ఎంత రాస్తే ఏం ఉపయోగం,
ఒక్క అడుగు ముందుకు పడనప్పుడు,
స్పందన హృదయానికి మాత్రమేనా,
చేతలు చేతులకు కాదా??
ఏం, చేతులు కాలతాయనా?
మరి, రాతల సెగలు తగలట్లేదూ?
ఓహో, రాతల వాతల మంటలు మానిపోతాయనా?
అయితే,
వాతల మచ్చలతో అలాగే బతికేద్దాం,
ఎవరో తొలి అడుగు వేస్తారని,
అప్పుడు ఆ అడుగులో అడుగు కలుపుదామని,
అదే విశాల విప్లవ హృదయం అని పొంగిపోతూ,
గడిపేద్దాం రోజులు, నెలలు, సంవత్సరాలు, జీవితాలు.
ఇంతేనా మనం?
🙂 ఎ౦దుకు?
Mam,Was this your First Writing ? Some sentences made me feel as such.
Hari Krishna garu: mari Immature gaa vundaandi?? Its not my first one…Thanks for letting me know that..
పదాలూ, వ్యక్తీకరణ వేరైనా ఉన్నదున్నట్లు ఇదే ఆలోచనని నేను ఈరోజు ఫేస్ బుక్ లో మిత్రులతో పంచుకున్నప్పుడు కట్టా శ్రీనివాస్ గారనే మిత్రుని ద్వారా మీ పోస్ట్ ని చూడడం జరిగింది. చాలా వాస్తవికతతో రాశారు, మీ పదాల్ని స్వయంగా అనుభూతి చెందుతున్నాను. నేను ఈరోజు రాసిన పోస్ట్ ని ఇక్కడ చూడొచ్చు https://www.facebook.com/nallamothusridhar/posts/370955502928219?notif_t=feed_comment ధన్యవాదాలు.
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
ప్రవీణ … మీ కవిత్వం చాలా బావుంది….
WOW..
Praveena garu.. jeevitam edi kaadani; maro ‘alochana’ ani… inka spastangaa cheppalemo jaatheki?