నేస్తమా,ఈ క్షణాన్ని కరిగిపోనీ..
నేస్తమా,
నీదికాని ఈ క్షణాన్ని కష్టంగా కరిగిపోనీ,
ఈ ఒక్క క్షణాన్ని ఎలాగోలా సహించుకో,
మరోక్కటంటే ఒక్కటే క్షణాన్ని ఓర్చుకో,
వేదనల ఆవేదనల,
ఆవేశపు ఆలోచనల,
నిరాశ నిట్టుర్పుల,
చిక్కు ప్రశ్నల వలయం,
దానికదే విడిపోతుంది,
పరిష్కారం లేని సమస్యే లేదుగా,
కాలానికి కానరాని పరిష్కారమే లేదుగా.
ఏ కష్టమైనా,
నేడు కొండంత,
రేపటికి గుట్టంత,
మరికొన్నాళ్లకు రేణువంత,
కాలం కౌగిలిలో కరిగిపోని కష్టమే లేదుగా,
నేటి గుణపాఠం రేపటి కష్టాన్ని కబలించక మానదుగా.
“కష్టాలన్నీ నాకేనా?”,
కాదు నేస్తం, కానేకాదు,
జీవితపు త్రాసులో,
కష్టసుఖాలు సరితూనికలు,
ఈ విషయంలో ఇటు తూగిన త్రాసు,
మరో విషయంలో అటు తూగక మనదుగా.
కన్నీరు,
నిశ్చలత్వం లోపించిన నీరు,
కాలప్రవాహంలో కొట్టుకుపోయే ధారలు,
బాధలో కూరుకుపోయిన మనసుకు,
కన్నీటితో కప్పుకుపోయిన కళ్ళకు,
మసకగా రాబోవు రోజులు కనిపించట్లేదూ?
చుట్టుపక్కల చూడలేదూ నిత్య సమస్యలు?
నిత్యం గమనించలేదూ నిండు పరిష్కారాలు?
నీ చేతిలోనున్నది,
నువ్వు చెయ్యగలిగినది,
చేతనయినంత వరకు,
శ్రమ అనుకోకుండా చెయ్యి,
అంతే,
రాబోవు కాలం రాకమానదు,
కష్టాలు తీరకా మానవు.
నేస్తమా: Let this time gooo….just do what you can…
chala baga chepparu,,, nice
“Let this time gooo….just do what you can…”
మీ అనుభవాలు ఆలోచనలు చాలా బాగున్నాయండీ..
Hanu garu, Raaji garu: Thanks for responding..