నీకు నాకు మధ్య


నీకు నాకు మధ్య…


నీకు నేను చేరువయ్యే క్రమంలో,
నన్ను నేను పూర్తిగా కోల్పోతుంటే,
నేను నీకు దగ్గరవుతున్ననేమో కానీ,
నువ్వు నాకు దూరమవుతున్నవని గ్రహించుకో!

సర్దుబాటు నాకే కాదు నీకు కూడా,
కోపతాపాలు నీకే కాదు నాకు కూడా,
మన్ననలు మన్నిపులు నాతో పాటు నీకు కూడా,
పంతాలు పట్టింపులు నీతో పాటు నాకు కూడా,
అలకలు అహాలు మనిద్దరివీనూ,
ప్రేమ, గౌరవం జంటకవులు మనలాగా.

స్నేహమయినా,నేస్తమయినా,
ప్రేమయినా, పెళ్లయినా,
బంధమయినా, బంధుత్వమైనా,
బంధం అనుబంధంగా మారేది,
నీకు నాకు మధ్య నున్న సన్నని గీతను గౌరవించిన నాడే.

ఊపిరాడని ప్రేమలోద్దు,
తిరస్కరించే తీర్పులోద్దు,
కావలసిందల్లా,
నువ్వు నన్ను ప్రేమించు, నీ ప్రేమను నే గౌరవిస్తా,
నేను నిన్ను గౌరవిస్తా, నా గౌరవాన్ని నువ్వు ప్రేమించు.

My Note:నాలో భావుకత్వం పూర్తిగా పోయినట్టుంది. ప్రేమ, ప్రియుడు, ప్రియురాలు….ఇలాంటి వాటి పై రాయడం నాకు రావట్లేదు. ౩౦+ middle age జాడ్యం అనుకుంటా…God help me plssss…

This entry was posted in కవితలు, జీవితం. Bookmark the permalink.

23 Responses to నీకు నాకు మధ్య

  1. manju says:

    baagaa raasaaru chaalaa baavundi

  2. KumarN says:

    ఊపిరాడని ప్రేమలోద్దు,
    తిరస్కరించే తీర్పులోద్దు,
    కావలసిందల్లా,
    నువ్వు నన్ను ప్రేమించు, నీ ప్రేమను నే గౌరవిస్తా,
    నేను నిన్ను గౌరవిస్తా, నా గౌరవాన్ని నువ్వు ప్రేమించు

    Simple and Straight. I guess those 4 lines are probably the best yet, from your pen.

  3. Hari krishna anne says:

    ayyooo baaavundi andi laast lo kummesaaru nice one

  4. కుమార్ గారు, హరి కృష్ణ గారు: కృతఙ్ఞతలు..

  5. Anonymous says:

    “నువ్వు నన్ను ప్రేమించు, నీ ప్రేమను నే గౌరవిస్తా,
    నేను నిన్ను గౌరవిస్తా, నా గౌరవాన్ని నువ్వు ప్రేమించు.”

    చాలా బాగుందండీ..
    అన్నీ నిజాలే చాలా చక్కగా చెప్పారు..

  6. సత్య says:

    కవికి కాల దోషమా?…. నెవ్వర్!!
    వయసుమీరినా మసకబారని వాడు కవి…..


    అనుభవం నేర్పెన పాఠాలతో
    కర్తవ్యం యిచ్చిన స్పూర్తితో
    జ్ఞాన౦ యిచ్చిన ఆస్తితో
    మొదలు పెట్టాను మరో కొత్త రోజుని.
    ——————————
    ఆ అలుపులో నన్ను నేను తట్టి చూసుకున్నాను,
    నా పునాదిలో నన్ను నేను వెతుక్కున్నాను,
    నా మనసు లోతుల్లో తొంగిచూసుకున్నాను,
    నా ఆలోచనల్లో నన్ను నేను శోధించుకున్నాను,
    అప్పుడే అక్కడే నాకు దొరికింది నా తోడు.
    ——————————–
    కరిగిన కాలం కరిగిపోగా,
    కరగని కాలం కాంతివంతంగా,
    కరిగించుకుంటూ వెలుగు కోసం వెతుకులాట.
    ———————————
    ఇవన్నీ అప్పుడే జ్ఞాపకాలు ఇపోయాయా!
    ఎంత వేగం ఈ కాలగమనం
    కాలాన్నే నా గుప్పెట్లో బంధి౦చగలిగితే
    బాల్యం దగ్గరే ఆగిపోతాను.
    ——————————-

    మీ ఈ మాటలన్నీ ఇప్పటికీ మా వీనుల్లో మారుమ్రోగుతున్నాయి….
    మీకింకా వినబడలేదా….?

    మీకు చాలా ధన్యవాదాలు.

    –సత్య 🙂

    • సత్య గారు: మీకు ఎలా చెప్పను కృతజ్ఞతలు?? మీ కామెంట్ ఎన్నిసార్లు చదివానో లెక్క చెప్పలేను. ఊసుపోక రాసిన నా రాతలు మీరు ఎంత శ్రద్దగా చదివారండి. మీ కామెంట్లో ఆ పేరాలు చదువుతుంటే, ఇవి నిజంగా నేనే రాసానా అని అనిపించింది.
      “అనుభవం నేర్పెన పాఠాలతో
      కర్తవ్యం యిచ్చిన స్పూర్తితో
      జ్ఞాన౦ యిచ్చిన ఆస్తితో
      మొదలు పెట్టాను మరో కొత్త రోజుని.” ఇది 10 years back మా చెల్లి కోసం రాసాను. మళ్లీ 4 నెలల క్రితం (నా బ్లాగ్ వయసు) నుంచి రాయటం మొదలు పెట్టాను. My sis has asked me “10 long years ఏమి చేసావు అక్కా” అని. మీ కామెంట్ చదువుతుంటే మళ్లీ అదే question నాకు గుర్తిచ్చోంది.

      “మీ ఈ మాటలన్నీ ఇప్పటికీ మా వీనుల్లో మారుమ్రోగుతున్నాయి….
      మీకింకా వినబడలేదా….?” ఎంత సూటిగా అడిగారండి…రాయటానికి, చెప్పటానికి బోల్డు నీతులు ఉంటాయి. మన దాక వచ్చేటప్పటికి మూగ వాళ్ళము అయిపోతాము. నువ్వు చెప్పిన మాటలు నాకు వినిపిస్తున్నాయి, నీకు వినిపించట్లేదా ….good one. Thanks a lot.

      • సత్య says:

        “వెలుగుతున్న దివ్వెనచూడడానికి వేరోక దివ్వె అవసరంలేదు….”
        అందుకే ఎవరిమాటలో చెప్పడం ఎందుకని…
        మీవెలుగునే మీకు గుర్తుచేసాను…!
        అయినా…స్వతహాగా ” వెలుగుతున్న దివ్వె” కోసం నేను చేయగలిగిందంతే!

        -Satya

  7. Ravi babu says:

    మీ పోస్ట్ లు రెగ్యులర్ గా గమనిస్తున్నాను
    మంచి ‘ వ్యక్తిత్వం ‘ అంటే ఇలాంటి ఆలోచనలతోనే
    ఉంటుంధేమో అనిపిస్తుంటుంధి మీ రచనలు చూస్తుంటే
    మీరు ఏవయస్సు వారో నాకు తెలియదుకాని
    మీ రచనలు చూస్తుంటే మాత్రం జీవితాన్ని బాగా
    క్షుణ్ణంగా చదివి అర్ధం చేసుకున్నట్లు ఉంటుంది
    ఇలా ప్రతివారు ఆలోచించి అర్దం చేసుకొని జీవితాన్ని
    సాగించగలిగితే ఎంత బాగుంటుంది.
    ఎనీహౌ కీపిటప్

    • రవి బాబు గారు: మీరు నా పోస్ట్స్ రెగ్యులర్ గా చదువుతున్నందుకు నా హృదయ పూర్వక కృతఙ్ఞతలు..మీకు ఓపిక చాల ఎక్కువేనండి..:) 🙂 నేను ఐదేళ్ళ ఇద్దరు కొడుకులకు(కవలలు) తల్లిని, కానీ నాకు అప్పుడే నాయనమ్మ చాదస్తం వచ్చేసిందని అందరు నవ్వుతు ఉంటారు. జీవితాన్ని క్షుణ్ణంగా చదివి అర్ధం చేసుకునేటంత వయసు లేదు కానీ, మనవ సంబందాల్లో ఏమూలో దాగున్న సున్నితత్వం గమనించటం, అర్థం చేసుకోవాలని ప్రయత్నించటం చాల బాగుంటుంది, చాల సార్లు కష్టంగా కూడా అనిపిస్తుంది. నేను కాసేపు గర్వంగా ఫీల్ అయ్యే కామెంట్ రాసినందుకు చాల చాలా ధన్యవాదాలండి.

  8. Murali says:

    >> My Note:నాలో భావుకత్వం పూర్తిగా పోయినట్టుంది. ప్రేమ, ప్రియుడు, ప్రియురాలు….ఇలాంటి వాటి పై >> రాయడం నాకు రావట్లేదు. ౩౦+ middle age జాడ్యం అనుకుంటా…God help me plssss…

    చ, ఊరుకోండి. యవ్వనం అనే జాడ్యం నుంచి బయట పడ్డానని ఆనందించక!

  9. David says:

    ఊపిరాడని ప్రేమలోద్దు,
    తిరస్కరించే తీర్పులోద్దు,
    కావలసిందల్లా,
    నువ్వు నన్ను ప్రేమించు, నీ ప్రేమను నే గౌరవిస్తా,
    నేను నిన్ను గౌరవిస్తా, నా గౌరవాన్ని నువ్వు ప్రేమించు…….చాలా చాలా బాగా రాశారు.

  10. Ravi babu says:

    మురళీ గారు ఏమి చెప్పారండి – ‘యవ్వనం జాడ్యం’ అని
    నాకేమనిపిస్తుందంటే
    బాల్యం తప్పటడుగులు అంటారుగాని
    ఆ తప్పటడుగులు ఇతరులని మురిపిస్తాయి
    దానివలన ఎవరికీ నస్టం లేదు
    కాని యవ్వనంలో వేసే తప్పటడుగులు మాత్రం
    కాటేస్తాయి
    తన్నుతాను – ఇతరులని
    ఆ దశే జీవితంలో మరీ అపాయకరమైనది

  11. డేవిడ్ గారు: కృతజ్ఞతలు…
    రవిబాబు గారు: “దశే జీవితంలో మరీ అపాయకరమైనది”..vary true..

  12. roja says:

    mi kavitalu chaduvutunte nannu nene chavukuntunnattu undi. mimmalni matalatho pogadalenu. endukante nenu kuda 30+ andukenemo mimmalni pogadalani unna naku basha ravadavm ledu. anduke mounam gane mimalni abhinandistunnanu.

  13. simply superb? nenu inthaku minchi emi rayalenu endukante mee antha ……. eamani cheppalo teleedam ledu any how superb.

  14. ఉసురు తీసే ప్రేమలొద్దు
    ఊపిరిసలపని వాదనలొద్దు,
    నిజంగా
    నీకు నాకు మద్య ఎవరూ వద్దు

    అపోహలొద్దు, అనుమానలొద్దు
    అన్నీ మనమే అనంతం మనమే
    నువ్వు నేనన్నది ఎంతనిజమొ
    నేను నువ్వన్నది అంతే నిజం
    అయినా మనమధ్య దూరం అనంతం

    నాకు కవిత్వం రాయడం వచ్హెసిందోచ్ ……
    దీన్ని మీ బ్లాగులొ పోస్ట్ చేస్తారా ప్రవీణ గారు?

    • prasoonsiriveda garu: చాలా బాగుంది మీ కవిత. నేను రాసేవి కవితలు అనేకన్నా Simple expressions are put in simple words అంటే సరిపోతుందేమోనండి. ఇవన్నీ మన అందరి ఆలోచనలలో వుండే బావాలే. రాయటం మొదలు పెడితే ఫ్లో సాగిపోతుంది.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s