కష్టాలున్నాయి అయితేనేం…


కష్టాలున్నాయి అయితేనేం….

గుండెనిండా కష్టాలున్నాయ్
మనసునిండా బాధలున్నాయ్
అయితేనేం!
సూర్యోదయాన్ని ఆస్వాదించేద్దాం
ఓ క్షణం వేకువ వెలుగులో కరిగిపోనీ కష్టాలు
ఆ క్షణం చలి కాచుకో వెచ్చని వెలుతురులో…

కళ్ళనిండా కన్నీరున్నాయ్
మధినిండా వేధనలున్నాయ్
అయితేనేం!
వాన చినుకులలో గంతులేసేద్దాం
ఓ క్షణం కొట్టుకుని పోనీ కన్నీటిని
ఆ క్షణం తడిసి ముద్దవనీ ఆనంద బాష్పాలని…

ఆశల ఆవేదనలున్నాయ్
నిరాశల నిట్టూర్పులున్నాయ్
అయితేనేం!
పిల్లగాలి తెమ్మేరలలో తేలిపోదాం
ఓ క్షణం గాలికోదిలేయ్ నిరుత్సాహాన్ని
ఆ క్షణం ఎగిరిపో ఉత్సాహంలో…

ఓటమి వెక్కిరింతలున్నాయ్
గెలుపు ఎగతాలులున్నాయ్
అయితేనేం!
వెన్నెల కాంతులలో కరిగిపోదాం
ఓ క్షణం నెలవంకకిచ్చెయ్ నీలాపనిందలను
ఆ క్షణం వెలిగిపో అభినందనల పౌర్ణమిలా….

సమస్యల సుడిగుండాలున్నాయ్
సాధింపుల సతాయింపులున్నాయ్
అయితేనేం!
పుష్పాల పరిమళాలు పలకరించేద్దాం
ఓ క్షణం ఉచ్వాసతో శ్వాసను బిగపట్టి
ఆ క్షణం నిచ్వాసతో నిట్టుర్పును వదిలేద్దాం…

ఓ క్షణం నవ్వేసేయ్
ఆ క్షణం జీవించేసేయ్
ఓ క్షణం మరిచిపో బాధలు
ఆ క్షణం గుర్తుంచుకో క్షణంక్షణం…

వెతలున్నాయ్, వేధనలున్నాయ్
వేదంలాంటి జీవితమూ ఉంది
బాధలున్నాయ్, బరువులున్నాయ్
బంధంలాంటి బతుకూ ఉంది…

This entry was posted in కవితలు, కష్టం, జీవితం, ప్రకృతి సృష్టి, మనిషి. Bookmark the permalink.

13 Responses to కష్టాలున్నాయి అయితేనేం…

  1. Girish says:

    చాలా బాగ రాసారు..

  2. naku e kavita enta nachindi ante…ventane mimmalni chusi, ade kalisi gattiga abhinamdanalu cheppali anipinchindi…

    urs…
    sailu

  3. వెతలున్నాయ్, వేధనలున్నాయ్,
    వేదంలాంటి జీవితమూ ఉంది,
    బాధలున్నాయ్, బరువులున్నాయ్,
    బంధంలాంటి బతుకూ ఉంది.

    really wonderful presentation.

  4. s says:

    వెతలున్నాయ్, వేధనలున్నాయ్,
    వేదంలాంటి జీవితమూ ఉంది,
    బాధలున్నాయ్, బరువులున్నాయ్,
    బంధంలాంటి బతుకూ ఉంది.

    Beautifully expressed. The best definition for life i hav ever read.

  5. kallurisailabala, శ్రేయోభిలాషి garu, s garu: Thank you so much for responding..

  6. David says:

    ఎంత బాగా రాశారో…

  7. వెతలున్నాయ్, వేదనలున్నాయ్,
    వేదంలాంటి జీవితమూ ఉంది
    బాధలున్నాయ్, బరువులున్నాయ్,
    బంధంలాంటి బతుకూ ఉంది.

    అద్భుతంగా చెప్పారండి. నాలుగు వాక్యాలలో బ్రతుకంటే ఏమిటో చెప్పారు. మీ బ్లాగుని తరచుగా చదువుతూంటాను. మీ బ్లాగు, మీ ఆలోచనలూ చాలా బాగుంటాయి.

  8. latha says:

    Good one.

  9. డేవిడ్ గారు, శిశిర గారు, లతా గారు : కృతజ్ఞతలు…

  10. Rashmi says:

    nachhindi.. ide nijamemo..

  11. kishore babu, a says:

    praveena garu..
    manchi bhavavesham mee sontam..
    kavitha chaduvutunte…
    varshamlo tadusunnattu.
    baruvekkin madi tadustunnatuu
    aa tadilo vedanalanni jaaripotunnattu
    anandam urakalestunnattu…
    o teeyati bhavana… palukarinchi.. vellutunattu..
    thanks..

    kishore babu, a

  12. Pingback: ఎన్నెన్నో వర్ణాలు | మనసుతో ఆలోచనలు…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s