పిల్లల పెంపకంలో నిర్లక్ష్యం చేస్తున్న కొన్ని చిన్నవిషయాలు
కొన్ని తరాల క్రితం వరకు “division of work” అనేది ఆడ, మగ వారి మధ్య సరిసమానంగా ఉండేది. ఆడవారు ఇంటి పనులు చక్కబెడితే, మగవారు బయటి పనులు చూసేవారు. నేటి తరంలో అందరూ అన్ని పనులు చెయ్యవలిసిందే. మహిళలు ఇంటా, బయటా అన్ని పనులు చెయ్యాల్సిందే. మగవారు బయటి పనులతో పాటు ఎంతో కొంత ఇంటి పనులు అందుకోవలిసిందే. కలగాపులగంగా అందరూ అన్నీ చేస్తే కానీ రోజు గడవని రోజులు నేటి రోజులు.
ఈ సిద్దాంతాన్ని ఎంత వరకు మనం మన పిల్లలకు నేర్పుతున్నాము? ఆడ పిల్లలకు చిన్నప్పటి నుంచే చదువుతో సమానంగా ఇంటి బాధ్యతలు కూడా నీవే అని నూరిపోస్తాము. ఇక్కడ నా ఉద్దేశ్యం చిన్నప్పటి నుంచే వంట వార్పూ నేర్పాలి, నేర్పుతున్నాము, నేర్చుకున్నాము అని కాదు. చదువు, ఉద్యోగంతో సమానంగా ఇంటి పని కూడా నీ బాధ్యతే అనే mentality develop చేస్తున్నాము. ఆడపిల్లల మెంటాలిటీ ఆరకంగా develo అవ్వడం వల్ల అవసరార్ధం అన్నీ పనులు నేర్చుకోగాలుగుతున్నారు.
నేటి తరంలో భార్య,భర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు. ఇద్దరూ అలిసిపోయి ఈ సాయంత్రమో ఇంటికి వస్తున్నారు. చాల కుటుంబాలలో గొడవలు మొదలయ్యేది ఇక్కడే.
నేను అలిసిపోయి వచ్చాను, వంట పని నా ఒక్కదానిదేనా?ఈ పూట నువ్వు చెయ్యి.
నావల్ల కాదు, అసలు నాకు వండటమే రాదు.
నాకు మాత్రం వచ్చా, నేర్చుకుంటేనే కదా వచ్చేది. అయితే cleaning చెయ్యి.
నేనా..గిన్నెలు తోమాలా?! అయినా నేను చేస్తే నీకు నచ్చదు.
నువ్వు సరిగ్గా చేస్తే ఎందుకు నచ్చదు. ప్రతీ విషయం చెప్పాలి నీకు.
చిలికి చిలికి గాలి వానలా ముదురుతుంది.
అమ్మాయి గారు, అబ్బాయి గారు ఇద్దరూ అలిసిపోయారు. అబ్బాయి గారికేమో చెయ్యటం రాదు అంటారు(?!), అమ్మాయి గారికేమో ఎప్పుడు నేనే చెయ్యాలా అనే ఉక్రోషం. మరి ఎవరిది తప్పు?
సంసారంలో ఓ చిన్ని బీట మొదలు. అసంతృప్తి మొదలవ్వలేదు?
మగ పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచే చిన్న చిన్న పనులు అలవాటు చేస్తే మంచిదే కదా. వండిన పదార్ధాలు dining table పైన సర్దటం. తినడం అయిపోయిన తర్వాత టేబుల్ క్లీన్ చెయ్యటం. అమ్మకు సాయంగా కూరగాయలు తరగటం. ఈ పూటైనా పనమ్మాయి రాకపోతేనో, చుట్టలోచ్చి పనేక్కువైతేనో cleaning చెయ్యటం. తేలికగా అయ్యే కూరలు ఒకటో రెండో నేర్చుకోవటం. minimum necessities..కాఫీ, టీ పెట్టుకోవటం, అన్నం వండుకోవటం లాంటివి నేర్పించటం.
ఇవన్నీ నేర్చుకోవటం, నేర్పించటం పెద్ద కష్టమేమి కాదు. ఈ పనులు చెయ్యగలిగే mentality అలవాటు చెయ్యటమే అతి పెద్ద సవాలు. నలభీములు భర్తలుగా వంట చెయ్యగలగటం 🙂 🙂
ఇక మరికొందరుంటారు, టీవీ ముందో, పేపర్ ముందో కూర్చుని ఫ్యాన్ వెయ్యి, పెన్ అందుకో, పేపర్ ఇవ్వు, మంచి నీళ్ళు ఇవ్వు……వీళ్ళను చెల్లెళ్ళు, అక్కలు బాగా గారాబం చేసి పాడు చేసారు. పాపం వారి భార్యలు. ఇక ఇంటికి సోలో వారసుడనుకోండి, ఆ అయ్యగారికి ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ ఉంటుందో కూడా తెలిదు.
“మేమింతేనోయే, మాకు రావు, నువ్వు చెప్పు అప్పుడు చేస్తాము” అంటారు మరి కొందరు. వీరికి నడవటం ఎలాగో కూడా చెప్పాలి. కుడి పాదం ఎత్తు, దించు, ఎడమ పాదం ఎత్తు, దించు, కుడి పాదం………
ఎప్పుడైనా ఫ్యామిలీ gatherings ఉన్నాయనుకోండి. మగవారు, సదరు భర్తలు అందరూ కలిసి కూర్చుని కులాసాగా అర్థరాత్రి వరకు పేకాడుకుంటూ, ప్రపంచ రాజకీయాలు మాట్లాడేసుకుంటూ ఉంటారు. ఆడవారు, సదరు భార్యలు అందరూ కలిసి, “ఒబామా మల్లి గెలుస్తాడా లేదా?” అని పేకాడుతూ నిర్ణయిస్తున్న వారికి వండి పెట్టడమే ప్రధమ కర్తవ్యంగా పోద్దస్తామాను వంటిట్లో చెమటలు కక్కుతూ వండుతూనే ఉంటారు. Of course gossips spread చేస్తూ ఉంటారు, అది వేరే సంగతి.
నిజంగా ఇలా అందరూ కలిసి వండుకుంటూ, తింటూ, కబుర్లు చెప్పుకుంటూ ఉంటే చాల బాగుంటుంది. e.g. మిరపకాయ బజ్జీలు వేస్తున్నారనుకోండి, మగవారు పేకాడటం కాకుండా, రాజకీయాలు మాట్లాడుకుంటూ, మిరపకాయలలో ఫిల్లింగ్ పెట్టడం, ఆడవారు సెనగపిండి కలిపి, తాయారు చేసిన మిరపకాయలు నూనెలో వేపటం ఎంత బాగుంటుంది. అందరూ కలిసి చేసుకుంటుంటే పని తొందరగా అవుతుంది, అందరూ relax అవుతారు.
నా భార్య నాలాగానే ఉదయం నుంచి ఆఫీసులో కష్టపడి వచ్చింది. సాయంత్రం ఇంటికి వచ్చాక నేను రిలాక్స్ అయినట్టే, తను కూడా విశ్రాంతి తీసుకోవాలి. ఇద్దరం కలిసి పని చేసుకుని, ఇద్దరం రిలాక్స్ అవుదాం అనే mentality ఎప్పుడు డెవలప్ అవుతుంది? పుట్టింట్లో అమ్మ కష్టాన్ని గుర్తించినప్పుడు, అమ్మకు సాయం చెయ్యగలిగినప్పుడు. అమ్మలు కూడా అన్నీ పనులు మేమే చెయ్యాలి అని అనుకోకుండా, కూతుర్ల సాయం తీసుకున్నట్లే, కొడుకులను కూడా సాయానికి పిలిస్తే, ఆ కొడుకులు తమ భార్య కష్టాన్ని గుర్తించగలుగుతారు కదా.
ఇప్పటి దాక మొగవారి బద్ధకం గురించి లోడలోడా వాగేసానా?? I know I know…ఇప్పుడు నాలాంటి ఆడవారి మేధావితనం గురించి కూడా మరీ ఎక్కువ కాకుండా 🙂 కొంచెం వాగుతా 🙂
మాలో చాల మందికి చాలా అవసరమైన చాలా పనుల గురించి కొంచెమైన తెలీదు. తెలీదు అనేకంటే పట్టించుకోరు అంటే బాగుంటుందేమో. e.g. visa apply చెయ్యాలంటే ఎక్కడికి వెళ్ళాలి, ఏఏ documents కావాలి? passport expiry ఎప్పుడు? వీసా renewal ఎలా? tax ఎప్పుడు ఎలా ఇక్కడ కట్టాలి? బ్యాంకు పనులు……
మగవారికీ ఇంటి పనులు తెలిసి ఉండటం ఎంత అవసరమో, ఆడవారికి పైన చెప్పిన పనులు తెలిసి ఉండటం కూడా అంటే అవసరం కద.
తండ్రులు బయట పనులకు వెళుతూ for example bank కు వెళ్తూ అన్నీ సార్లు కొడుకునే వెంట తీసుకెళ్లటం కాకుండా, కూతురిని కూడా అప్పుడప్పుడు వెంట తిసుకేల్లితే కాస్త అవగాహన వస్తుంది, బెరుకు పోతుంది.
ఇవన్నీ చిన్న చిన్న విషయాలే, కానీ నేటి తరంలో పెద్ద సమస్యలుగా తయారవుతున్నాయి.
చాల ఒరిజినల్ గ ఉన్నాయి. మీ ఆలోచనలు. పిల్లలకి పనులు మనమే నేర్పించాలి. కాని ఈ రోజుల్లో కొంచెం కష్టమే.