వెలుగు కోసం వెతుకులాట
చీకటిని చీల్చుతూ,
వెలుగు కోసం వెతుకులాట,
వెలుగు ఓ వింత,
ఆమడ దూరంలో కానవస్తూ,
అలసి సొలసి పోయినా,
అందుకోలేని ఆగమ్యగోచరం.
లాంతరు చేతబట్టి,
వెలుతురని భ్రమపడి,
భ్రమలో బతికేస్తూ,
ఏనాటికో భ్రమలు తొలిగి,
నిజం నిక్కచ్చిగా నిలదీసే వరకు,
కాలం కరిగిపోతూ,
జీవనం సాగుతూనే ఉంటుంది.
కేవలం కలవరిపడి,
కలవరానికి అలవాటుపడి,
ఆమడ దూరాలు దాటుతూ,
శ్రమను ఓర్చుకుంటూ,
ఆశను బతికించుకుంటూ,
వెలుగు కోసం అసలు వెతుకులాట మొదలు,
కరిగిన కాలం కరిగిపోగా,
కరగని కాలం కాంతివంతంగా,
baagaa raasaaru chaalaa baaavundi
praveena gaaru well written !
వెలుగు మాత్రం ఎంత వరకూ?
చీకటెక్కడ కరిగిందో అంత వరకు!
చీకటి మాత్రం ఎంత వరకూ?
వెలుగెక్కడ ఆగిందో అంత వరకు!
ఆగని వెలుగుల్లో చీకట్లు కరగాలని ఆశిస్తూ…
సత్య
మంజు గారు: ధన్యవాదాలు..
సత్య గారు: చీకటి వెలుగుల సంఘమం జీవితం. చీకటిలో వెలుగు కోసం వెతుకులాట, వెలుగు విలువను తెలియజేస్తుంది. థాంక్స్ అండి.