గెలిచారోచ్, గెలిచారోచ్ కప్పు మాత్రమే కాదు….
గెలిచారోచ్, గెలిచారోచ్,
మనాళ్ళు గెలిచారోచ్, మనందరినీ గెలిపించారోచ్,
యావత్ దేశం గర్వంగా ఉప్పొంగిపోగా,
జై జై ద్వానాలతో దేశం దద్దరిల్లగా,
ప్రపంచ కప్పు మన ఒడిలో ఒదిగిపోగా,
ముక్త కంఠంతో మనమంతా ఒక్కటని,
ఇది మన దేశ విజయమని,
మనం భారతీయులమని మురిసిన మధుర క్షణం,
కప్పు సాధించిన విజయం మాత్రమే కాదిది,
సంబరాలలో సమైక్యత విజయ ధరహాసం,
మువ్వెన్నల జండా రెపరెపల మాటున,
బహిర్గతమైన భారతీయ సంస్కృతీ, సంస్కారం,
భుజస్కంధములపై ఊరేగిన గౌరవం, కృతజ్ఞత.
గెలిచారోచ్ అని ఉండాలి
ఓబుల్ రెడ్డి: Thanks andi. సరి చేసుకున్నాను