ప్రేమ, పెళ్లి, విడాకులు మీ ఇష్టం..మరి పిల్లలు?


ప్రేమ, పెళ్లి, విడాకులు  మీ ఇష్టం..మరి పిల్లలు?
 
మనిషికి స్వేఛ్చ ఎంత అవసరమో, ఆ స్వేచ్చకు హద్దు అనేది ఉండటం కూడా అంతే అవసరం. ఎవరిని ప్రేమిస్తున్నాము లేక పెళ్లి చేసుకుంటున్నాము అనే విషయాలలో మనసుకు స్వేఛ్చ అత్యవసరం. మన సమాజంలో ప్రేమ, పెళ్లి విషయాలలో కట్టుబాట్లు ఉన్నాయి. ఆ కట్టుబాట్లలో మంచి ఉంది, చెడు ఉంది. ఈ కట్టుబాట్ల కారణంగానే చాలా సంసారాలు సాగుతున్నాయి. క్షణికావేశాలకు, కోపతాపాలకు కాపురాలు కూలిపోవట్లేదు. అదే కట్టుబాట్ల కారణంగానే చాలా మంది బయటపడలేక నిత్య నరకం అనుభవిస్తున్నారు.
 
ప్రేమించటం, పెళ్లి చేసుకోవటం ఆ తర్వాత కలిసి ఉండాలా, విడిపోవాలా..ఇవన్ని వ్యక్తిగతం. అందులో స్వేఛ్చ ఎంత? కట్టుబాట్లు ఎంత అనేది వ్యక్తిని బట్టి ఆధారపడి ఉంటుంది.
పెళ్ళయిన వెంటనే వచ్చే బంధాలు, బాధ్యతలు ఒక ఎత్తు. పిల్లలు కలిగాకే తెలుస్తుంది బాధ్యత అంతే ఏమిటో, బంధంతో వచ్చే అనుబంధం అంటే ఏమిటో. ఒడుదుడుకులు ఎన్నున్నా బంధం అనేది ఉంటే సంసార నౌక సాగుతూ ఉంటుంది. కానీ, ఆ బంధం బీటలు వాడితే..చివరకు వాడిపోయేది పసి హృదయాలే.
పెద్దలు కుదిర్చిన వివాహంలో పెద్ద పాత్ర పోషించేది అదృష్టం. ముక్కు మొహం కూడా సరిగ్గా తెలీని మనిషి మన జీవితంలో ప్రవేసించేస్తారు. ఇక అప్పటినుంచి జీవితమంతా ఆ మనిషితోనే. ఆ వివాహంలోనే ఏదో మహత్తు ఉంది. అపరిచయస్తుడు(రాలు) ఆత్మీయుడిగా(రాలుగా) అతి తక్కువ సమయంలోనే దగ్గర అయిపోతారు. అలా దగ్గర కాలేనప్పుడే సమస్య.  అలా దగ్గర కాకుండానే బిడ్డకు జన్మనిస్తే అది అతి పెద్ద సమస్య.
ఒక మనిషితో జీవిత కాలం జీవించగలమా అనేది పెళ్ళయిన మొదటి రెండు సంవత్సరాలలో ఖచ్చితంగా తెలుస్తుంది. అభిప్రాయ భేదాలు అనేవి జీవిత కాలం అందరికి ఉంటూనే ఉంటాయి. ఒకే ఇంట్లో పెరిగిన ఇద్దరు పిల్లలే ఒక రకంగా ఉండరు కదా. కానీ భాగస్వామితో కలిసి జీవితమంతా జీవించగలము అనే నమ్మకం రావటానికి కనీసం 1 లేక 2 సంవత్సరాలు పడుతుంది. ఆ నమ్మకం అనేది పూర్తిగా రాకముందే పిల్లలు కనడం ఎంత వరకు సబబు?
ఒక మనిషిని అర్థం చేసుకోవటానికి జీవితం కాలం సరిపోదు అన్న మాట ఎంత నిజమో, ఒక మనిషితో సర్దుబాటు చేసుకుంటూ జీవించగలం  అనే నమ్మకం రావటానికి కొంత సమయం పడుతుంది అనేది కూడా అంతే నిజం. ఆ నమ్మకం మీదే కదా భార్యభర్తల బంధం నిలబడేది.  భార్యభర్తల బంధంతోనే కదా బిడ్డల భవిష్యత్తు నిర్మించేది.
నా సహోద్యోగి పోయిన సంవత్సరము ఇదే సమయంలో వాళ్ళ దగ్గరి చుట్టాల పెళ్ళికి సెలవు తీసుకుని ఇండియా వెళ్ళింది. ఆ టైములో తన వర్క్ కొంత నేను మేనేజ్ చేశాను. మొన్నీ మధ్య దిగాలుగా ఉంటే ఏమయింది అని అడిగా. పోయిన  సంవత్సరము పెళ్ళికని వెళ్ళాను గుర్తుందా, ఈ సంవత్సరము విడాకులకు వెళ్ళేలా ఉంది అంటూ బాధ పడింది. మొదటి పెళ్లి రోజు కల్లా కోర్టులో విడాకుల కేసు, చేతిలో  పసిబిడ్డ. విడిపోయిన వాళ్ళిద్దరూ కాస్త సమయం తీసుకుని ఎవరి జీవితాలల్లో  వాళ్ళు పడిపోతారు. మరి ఆ బిడ్డ సంగతి?? అమ్మమ్మల దగ్గరో, నానమ్మల దగ్గరో భారంగా పెరగాలి. బిడ్డ పుట్టడం కారణంగా అన్ని భరిస్తూ భార్య, భర్త కలిసి ఉండాలి అని నా ఉద్దేశ్యం కాదు. ఒకళ్ళ మిద ఒకళ్లకు నమ్మకం కలగకుండానే ఎందుకు మరో జీవికి జన్మనివ్వాలి??
“Why did the couple gave birth to a kid before even building their relation?”, అని నేను అంటే నా  సహోద్యోగి నా వైపు అదో రకంగా చూసింది. May be ఇది చదువుతున్న మీకు కూడా అలాగే అనిపిస్తుందేమో?!  మరీ materialist గా అనిపించే Practicality    అని నా కనిపిస్తుంది.
ఒక చిన్ని ప్రాణిని ఈ లోకంలోకి తిసుకోచ్చేతంత అదృష్టం దేవుడు మనకు ఇచ్చాడు. ఆ పసిప్రాణిని మన చేతుల్లోకి తీసుకున్నప్పుడు ప్రేమతో హృదయం ఉప్పొంగాలి, భారంతో హృదయం భరువెక్కకూడదు. single mother or father కి ఆ శక్తి ఉండదు అని కాదు నా ఉద్దేశ్యం. విధి తల రాతను ఎవరూ మార్చలేరు. కానీ మన చేతుల్లో ఉన్నది మనం దిద్దుకోవచ్చు కదా.  పెళ్లి చేసుకున్నాం, పిల్లల్ని కన్నాం అనికాకుండా పెళ్లి చేసుకున్నాం, భార్య భర్తల మధ్య ఉండాల్సిన బందం కనీసం basic గా అయినా ఏర్పరుచుకున్నాం, అప్పుడు కన్నాం పిల్లల్ని అని ఉంటే బాగుంటుంది.
(ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. నేను చుసిన కొన్ని సంఘటనల మూలంగా ఏర్పరుచుకున్న అభిప్రాయం) 
This entry was posted in జీవితం, Uncategorized. Bookmark the permalink.

40 Responses to ప్రేమ, పెళ్లి, విడాకులు మీ ఇష్టం..మరి పిల్లలు?

 1. Praveen Sarma says:

  ఈ లింక్ వీక్షించండి: http://radicalfeminism.stalin-mao.in/40432628 విడాకులు అవసరమయ్యే పరిస్థితులలో విడాకులు తీసుకోవడమే మంచిది.

 2. ప్రవీణ్ గారు: విడాకులు తీసుకుంటే పిల్లలు పాడైపోతారు అనడానికి నేను పూర్తిగా వ్యతిరేకం. ప్రతి రోజు పోట్లాడుకుంటూ చేతులారా పిల్లల్ని చేతులారా పాడుచేసుకోవటం కంటే విడిపోవటమే బెటర్. తప్పని పరిస్తితుల్లో తీసుకునేదే విడాకులు.

  What all I am saying here is wait for few years before you give birth to kids. First build a relation with your partner.

  మీ భర్త, భార్య గురించి కాస్తన్నా అవగాహనా లేకుండా పసివాళ్ళను ఈ లోకంలోకి తీసుకు రావటం సరి కాదేమో అని నా ఉద్దేశం.

  నాకు రాయడం అంత బాగా రాదు. I don’t know whether I expressed it the way I wanted

 3. sarayu says:

  manava sambhandalaku viluva taggipotunna ee rojullo vidakulu mukhyama ? leka pillalu mukhyama ? ane prasnaku samadhanam cheppatam chala kastam. adi vaalla vignatha ke vadilesthe baguntundi.,,ee vishayam lo thondarapatu paniki radu..koncehm baga alochinchi nirnayam theesukonte baguntundi.. lekapothe jeevitham antha badha padavalasi vasthundi

 4. sarayu says:

  it depends on the situation.. we cant say whether its rite ? or wrong ?

  • సరయు గారు: నిజమేనండి. ఏ విషయంలోనూ ఏది మంచి, ఏది చెడు అని మనం చెప్పలేము. కేవలం కాలమే చెప్పగలదు. ధన్యవాదాలు..

 5. ఈమధ్యనే చలంస్త్రీ మళ్ళీ చదివాను. ఇప్పుడు చర్చిస్తున్న అన్ని అంశాలను ఆయన ఎనబయి సం”క్రితమే క్షుణ్ణంగా చర్చించి తన సలహాలు ఇచ్చారు. మనుషులకు స్వార్థం ,ఎమోషన్లు ,ఎక్కువ. విచక్షణ తక్కువ. నేటి పరిస్థితుల్లో కలహించుకుంటూ కలసి వుండటం కంటే మంచిగా విడిపోవటం మేలు. ఐతే అది కోర్టు ద్వారానే జరగాలి.పిల్లలు వుంటే వారికి చట్ట రీత్యా అన్ని రక్షణలు కల్పించాలి. ఇప్పటికే వున్నాయనుకొంటాను.లాయర్లకి తెలుస్తుంది. లేకపోతె వెంటనే రక్షణలు కల్పిస్తూ చట్టం తీసుకురావాలి. ;;;;రమణీయం

  • రమణారావు గారు: నేను చలం పుస్తకాలు ఒకటి రెండు చదవాలని ప్రయత్నించాను. నా వాళ్ళ కాలేదండి.ధన్యవాదాలు..

 6. Indian Minerva says:

  “Why did the couple gave birth to the kid before even building their relation?”

  చాలా చక్కటి ప్రశ్నండి I believe this is what I had been trying to frame all the way along. మీ అభిప్రాయాలతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను.

  “ఒక మనిషితో జీవిత కాలం జీవించ’గలమా’…”
  అలాగే ఇదీనూ… కొన్ని సర్దుబాట్లు అవసరమవ్వచ్చు కానీ వ్యక్తిత్వాన్నే త్యాగం చెయ్యాల్సివస్తే మాత్రం ఆ బంధం అఖ్ఖర్లేదనుకోవడం మంచిది. ఏది ఏమైనా ఒక అవగహనకు వచ్చేంతవరకూ తొందరపదకపోవడం మంచిది.

  • Indian Minerva garu : హమ్మయ్య..మీరు నన్ను కరెక్ట్ గా అర్థం చేసుకున్నారు. నేను సరిగ్గా express చెయ్యలేదు అని ఇందాకటి నుంచి తెగ ఫీల్ అయిపోతున్నా. ఏదో రాద్దామని మొదలు పెట్టి మరేదో రాసానా అనిపించింది నాకు.
   సర్దుబాటు తప్పనిసరి కానీ మనల్నిమనం కోల్పోయే బంధాలు జీవితాంతం భరించలేము. పెద్దలు కుదిర్చిన వివాహాలలో అదృష్టం, ప్రేమ వివాహాలలో ముసుగు తొలిగే దాక మన భవిస్యత్తు ఏమిటో మనకే తెలిదు. Thanks andi.

 7. Snkr says:

  /పెద్దలు కుదిర్చిన వివాహాలలో అదృష్టం, ప్రేమ వివాహాలలో ముసుగు తొలిగే దాక మన భవిస్యత్తు ఏమిటో మనకే తెలిదు/
  అదృష్టం/రిస్క్ అనేది పెద్దలు కుదిర్చినా, ప్రేమ వివాహమైనా రెండిట్లోనూ వుండేదే. ప్రేమవివాహంలో ప్రేమతప్ప మరేమీ తెలియని ఇద్దరు గుడ్డిగా పెళ్ళికి సిద్ధమవుతారు. పెద్దలు కుదిరిస్తే మరిన్ని విషయాలు చూస్తారు – గౌరవమైన కుటుంబమా? వాళ్ళ కుటుంబం ఎలాంటిది/ వ్యక్తుల నడవడిక ఎలాంటిది, ఎదుటివారి ఉద్యోగం, గుణగణాలు వగైరాలు – ఏ విష్యాలైతే ప్రేమికులు సాధారణంగా విస్మరిస్తారో అవన్నమాట. దాంతో కొంత రిస్క్ తగ్గే అవకాశాలున్నాయి.

  చివరగా పెళ్ళి చేసుకుంటే, కొంత వరకూ వ్యక్తిగత స్వేచ్చ తగ్గించుకోవాల్సివుంటుంది. ‘రాజీ లేని ధోరణి’, ‘మడమ తిప్పే ప్రసక్తి లేదు’ అని విర్రవీగేవాళ్ళకు ఏ టైపు పెళ్ళైనా సజావుగా వుండే అవకాశాలు తక్కువ.

  పెళ్ళయ్యాక, పిల్లలు కనడానికి 2ఏళ్ళు అంతరం తప్పులేదు, కాని దానివల్ల ఖచ్చితంగా అంతా సజావుగా వుంటుందని అనుకోలేము. విడిపోతే చెడిపోతాం అనేది మెజారిటీ కేసుల్లో నిజమే అవుతుంది, ముఖ్యంగా పిల్లల విషయంలో.

  • Snkr garu: అందరు గుడ్డిగా ప్రేమిస్తారు అని అనలేము. చదువుకునే వయసులో, teenage లో ప్రేమలు గుడ్డిగా వుండవచ్చేమో కానీ, చదువు అయిపోయి, ఉద్యోగాలు చేసుకుంటూ లోకాన్ని కాస్తన్నా చుసిన వాళ్ళ ప్రేమ గుడ్డిది అని అనలేము. ఇక పెద్దలు కుదిర్చిన పెళ్లి…అదో puzzle. Investigations ఎంత కనుక్కోగలము?!!

   ఏదిఏమైన వివాహంలో కాస్త స్తిరత్యం వచ్చేదాకా, ముసుగు తొలిగి అసలు రంగు తెలిసేదాకా పిల్లల మాట ఎత్తకపోవటమే బెటర్ అని నా అభిప్రాయం.

   “పెళ్ళయ్యాక, పిల్లలు కనడానికి 2ఏళ్ళు అంతరం తప్పులేదు, కాని దానివల్ల ఖచ్చితంగా అంతా సజావుగా వుంటుందని అనుకోలేము. “…ఖచ్చితంగా అనుకోలేము. కానీ ఈలోపు కాస్త ఐడియా అన్నా వస్తుంది కదా.

   “విడిపోతే చెడిపోతాం అనేది మెజారిటీ కేసుల్లో నిజమే అవుతుంది, ముఖ్యంగా పిల్లల విషయంలో. “…విడిపోవటంలో చెడిపోవటం ఎంత నిజముందో, కలిసివుండతంలో చెడిపోవటంలోను అంతే నిజం ఉంది. అది పరిస్తుతులను బట్టి ఉంటుంది.
   Thanks for sharing your opinion.

 8. advaita says:

  I too agree with ur question.
  Nenu ide suggestion istunnanu ee madhya marriage chesukobotunna valla andariki.
  vintara ,vinara annadi valla istam.
  Kani atleast alochistaru kada ani.
  wife and husband madhya kachitam ga machi manasika sambadham erpadina tarvate pillalani kanadam manchidi.
  godava padutu kalisi vundadam kante vidipovadame manchidi ilantavi vinadaniki baguntayi.
  okasari aa pillala place lo manam vundi alochiste telustundi.
  pillali emi mammalni kanamani adagatledu kada,manaku istamyi kantunnam.
  alanti appudu vallaki manchi life ivvalsina responsibility manade.
  Ala ivvalenapudu asalu kanoddu,aa hakku manaku ledu anipistundi naku.

 9. advaita garu: మనలో చాలా మంది పెళ్ళయిన తర్వాత..జాబులో సెటిల్ అయిన తర్వాత, సొంత ఇల్లు కొనుక్కున్న తర్వాత లేక ఇంకేదో సాధించిన తర్వాత పిల్లలు అని అనుకుంటామే కానీ relation buildup చేసుకున్న తర్వాత పిల్లలు అని అనుకోము. ఈలోపు ఇంట్లో ముసలివారు ఉంటే అదో torture.
  we should educate our kids అని నాకు అనిపిస్తుంది. Thanks for responding.

  • advaita says:

   ya i know the live examples of those kind of people.
   ippudu pillalu kavali anukontunnaru,kani vallu emyna flat,car,duplex houseaa konukovadaniki.

 10. Mauli says:

  మీరు వ్రాయలనుకొన్నది స్పష్టం గానే వ్రాసారు.

  @ మనల్నిమనం కోల్పోయే బంధాలు జీవితాంతం భరించలేము.
  ఇది పొరపాటు .అసలు మనల్ని మనం ఏ విషయాల్లో కోల్పోవాల్సి వస్తున్నది? ఎవరి కోసం ?ఎ౦దుకు కోల్పోకూడదు ? ఇవ్వన్ని ఖచ్చితం గా మీరను కొన్నట్లు ఉండవు.

  పిల్లల్ని 2 స౦వత్సరల తర్వాత అన్నది కుడా ఒక మిధ్య లా నాకు అనిపిస్తుంది. భర్త చనిపోతే ఉ౦డే బాధ్యతా ,ఇది ఒకటి కాకపోవచ్చు. కాని సారూప్యత ఉన్నాయి.
  Divorse కోసం వెళ్ళాలి అన్నప్పుడే మీరు కనుక్కుని, సరి చేసే ప్రయత్న౦ చేసారా ?

  ప్రవీణ, ఆ అమ్మాయి వేరే తప్పు చేస్తే మగవాళ్ళు పిల్లల్ని కూడా వదిలేస్తారు. ఇది ఎ౦తవరకు న్యాయం అనిపి౦చినా , తల్లికి u0DE బాధ్యతా ని చుపిస్తు౦ది అది అoతే.
  ఒక్క మొదటి రె౦డు సంవత్సరాలు లో తేలిపోతుంది అన్న ఆలోచనతో మామూలుగా జీవించడం కూడా సులువు కాదు.కొత్త సమస్యలు వ్యవస్థ లోకి తెప్పి౦చడమె.
  గాప్ కి వేరే కారణాలు చెప్పాలి.ఆర్ధికం గా విడాకుల విషయం లో పిల్లలకి లోటు ఉండదు.

  ఇక మానసికం గా అ౦టార, ఆ స్త్రీ ని బట్టి ఉ౦టు౦ది .కాబట్టి ఆలోచి౦చాల్సినది కేవలం పిల్లల గురి౦చి కాదు ఈ రోజుల్లో .

  • మౌళి గారు: ఈ బందంలోనైనా ఎంతో కొంత మనం సర్దుబాటు చేసుకోవాలి. మనల్ని మనం కోల్పోవటానికి, సర్దుబాటు చేసుకోవటానికి మధ్య సన్నని గీత ఉంటుంది.

   ” ఏ విషయాల్లో కోల్పోవాల్సి వస్తున్నది? ఎవరి కోసం ?ఎ౦దుకు కోల్పోకూడదు ?” , ఇది సర్దుబాటు అయితే బాగుంటుంది, ఇక్కడ కోల్పోవటం అని అనకుడదేమో.

   “మొదటి రె౦డు సంవత్సరాలు లో తేలిపోతుంది”—అని నేను అనట్లేదు. కాస్త సూచాయిగా నన్నా తెలుస్తుంది అని మాత్రమె అంటున్నా.

   “14 ఎల్ల తర్వాతే సీతమ్మ కి ఈ సమస్య ఎదురయ్యింది “—విది రాతను ఎవరూ మార్చలేరు. ఏదో మన చేతుల్లో ఉన్నంత వరకు సరిదిద్దుకోవాలన్న తాపత్రయం. ధన్యవాదాలు..

 11. Mauli says:

  ప్రవీణ 14 ఎల్ల తర్వాతే సీతమ్మ కి ఈ సమస్య ఎదురయ్యింది .ఇక 2 సవత్సరాలె౦త 🙂 ?
  http://teepi-guruthulu.blogspot.com/2011/03/blog-post_31.html

 12. sree says:

  Hmm… Praveena, this is ideally speaking a good thought to ponder on… ento alochinchaaka maatrame pillalni ee prapamchamloniki teesukuni raavaali, agree to it completely but there are instances when accidents do happen and by the time you realize you have a life within you and you tend to attach forms and emotions to it even before it is out… Life happens, we don’t plan it..

  Good blog here.

  • శ్రీ గారు: బాగా చెప్పారు. Life happens. అన్ని ప్లాన్ చేసినట్టు జరిగితే ఇంక కస్తాలేముంటాయి, జీవితం ఏముంటుంది. తల్లి ప్రేమంటే అదే, బిడ్డ బయటకు రాకుండానే విడదీయరాని బందం ఏర్పడిపోతుంది. విది రాతను ఎవరూ మార్చలేరు. ఏదో మన చేతుల్లో ఉన్నంత వరకు సరిదిద్దుకోవాలన్న తాపత్రయం. ధన్యవాదాలు..

 13. lalitha says:

  ప్రవీణ మీ బ్లాగ్ చూడటం ఇదే మొదటిసారి. ఎందుకో ఒక్క పోస్ట్ చదివితెనే చాలా మంచి అభిప్రాయం ఏర్పడింది . అవసరమైన సమస్య మీద మీ అభిప్రాయాన్ని నిక్కచ్చిగా చెప్పారు అభినందనలు .

 14. Ravi babu says:

  ఎగ్జాట్లి మీ అభిప్రాయాన్ని నేను గౌరవిస్తున్నాను బిడ్డల జీవితాన్ని నాశనం
  చేసె హక్కు ఎవరిచ్చారు వీళ్ళకి….?

 15. Ravi babu says:

  సంసారమంటేనే సర్ధుకోవడం రెండువైపుల అదితెలుసుకోకుండా పెళ్ళీచేసుకోవడం
  మీ అవివేకం మీ అవివేకానికి పిల్లల్ని బలి చేయడం రాక్షసత్వం

 16. Rajesh T says:

  బాగా చెప్పారు. కానీ ఒక చిన్న విషయం మిస్ అయ్యారు. మన దేశంలో చాలా బీద తల్లి తండ్రులు పిల్లలను చదివించలేక, తిండి కూడా పెట్టలేక, పనికి పంపిస్తున్నారు. ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన వయసులో ఈ పిల్లలు హోటల్స్ లో, షాప్స్ లలో ఎంతో కష్టపడుతున్నారు. మరి ఈ పిల్లల తల్లి తండ్రులను కూడా అడిగేద్దామా ఎందుకు పిల్లల్ని కన్నారని? ఎందుకంటే విడిపోయిన తల్లి తండ్రుల పిల్లల కంటే ఈ బీద కుటుంబాల పిల్లలే ఎక్కువ కష్టాలు పడుతున్నారు మరి.

 17. రాజేష్ గారు: అవునండి ఆ పాయింట్ మిస్ అయ్యాను. ఇండియాలో రైల్వే స్టేషన్లోను, రోడ్ల పక్కల అడుక్కునే చిన్న పిల్లలను చూస్తుంటే మనసులో ఎక్కడో కేలికినట్టు ఉంటుంది. ఏమని చెప్పగలము?

 18. David says:

  ప్రవీణ గారు నేను మీ అర్గుమెంట్ తో ఏకిభవిస్తున్నాను…నేడు చాలా కుటుంబాలలో జరుగుతున్నది ఇదే…నా స్నేహితురాలి విషయంలో కూడ ఈమధ్య ఇదే జరిగింది. ఇద్దరు ఇష్టపడి పెద్దల్ని ఎదిరించి కులాంతర వివాహం చేసుకున్నారు.వాళ్ళకి 2 సంవత్సరాల పాప కూడా ఉంది. కాని నేడు వాల్లిద్దరి మద్ద్య గ్యాప్ రావడంతో విడాకులు తిసుకోవాలని అనుకుంటున్నారు. ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి చూసాం కాని మగాడి వైపు నుంచె తప్పు మల్లి మల్లి రీపిట్ అవుతుంది కాబట్టి నా స్నేహితురాలు విడిపోవడానికి సిద్దపడుతుంది.కాని వారికి పుట్టిన పాప పరిస్థితి ఎలా ఉంటదో అలోచిస్తేనే బాధగా ఉంది.తల్లి దండ్రులు అంత అనాలోచితంగా పిల్లల్ని కంటారో, నేడు వారిద్దరు విడిపోయాక పుట్టిన బిడ్డ భవిష్యత్ ఎలా ఉంటుందో అనేదే అర్థం కావడం లేదు.

  • డేవిడ్ గారు: ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు చాలా బాధగా ఉంటుంది. బలి అయిపోయేది ఆ పసి పిల్లలే. కాస్త relation strong అయిన తర్వాత పిల్లల గురించు ఆలోచిస్తే బాగుంటుంది. పిల్లలు కలిగితే భార్య భర్తల బందం ఆటోమాటిక్ గా సరి అయిపోతుంది అనే వాళ్ళు కూడా ఉన్నారు. Hmmm… ఇది మంచో ఏది చెడో చెప్పలేము. ధన్యవాదాలు.

 19. satya says:

  ప్రవీణ గారు నమస్తే!

  1)
  “బరువైన బాధ్యతలు భారంగా మారనంత వరకే ఏ బంధమైనా నిల్చుండేది”….

  2)
  స్వేఛ్చ స్వేఛ్చ అంటాం గాని “మన బాధ్యతలు సక్రమంగా నిర్వంచడానికి మనకు కావసిలిన కనీస హక్కు స్వేచ్చ…! “, అంతేగాని తెగించడానికి, తప్పించుకోవడానికి కాదు.

  3)
  పిల్లలు పిల్లలు అంటాం గాని నాకుతెలీక ఆడుగుతాను భార్య మాత్రం భర్తకి ఒక ముద్దు బిడ్డ గాదా… భర్త మాత్రం భార్య కి ఒక ముద్దు బిడ్డడు గాదా!..

  4)
  విడి పోవాలంటే , విడిపోవాల్సిన పరిస్థితి ఎప్పుడైనా కలగచ్చు …దానికి 1,2 సంవత్సరాల ట్రయల్ పీరియడ్ అవసరంలేదు…ఎందుకంటే మనిషి ఎప్పుడూ మారుతూనే వుంటాడు.
  ఆ దుర్ఘటన ఎప్పుడైనా సంభవించ వచ్చు!

  5)
  సంసారం లో పిల్లలు వ్యాపారంలో డబ్బు(పెట్టుబడి) లాంటి వాళ్ళు…
  “నీతిగా సంపాదించాలి – మంచి కొరకు వినియోగించాలి …”
  లెకపోతే అసలు వ్యాపారమే చేయకూడదు.

  పిల్లలూ అంతే!…
  “సదుద్దేశంతో కనాలి- సన్మార్గంలో పెంచాలి”
  లేకపోతే అసలు పెండ్లే చేసుకోకూడదు!

  (బాగా చెప్పాను కదా!! )
  -సత్య

  • సత్య గారు: మీరు చెప్పటం బాగోకపోవడమా? సూపర్ గా చెప్పారు.

   2 పాయింట్: “బాధ్యతలు సక్రమంగా నిర్వంచడానికి మనకు కావసిలిన కనీస హక్కు స్వేచ్చ…!”. ఇందులో దాగున్న ఒక సెన్సిటివ్ పాయింట్ చెప్పనా. భార్య రోజంతా పిల్లలను చూసుకుంటూ ఉంటుంది. పిల్లలను ముద్దాడుతుంది, కౌగిలించుకుంటుంది, ప్రేమగా నచ్చచెపుతుంది అలాగే విసుక్కుంటుంది, అవసరమైతే దండిస్తుంది. భర్త గారు సాయంత్రం అలిసిపోయి ఇంటికి వస్తారు. భార్యకు అలుపు ఉందని మాత్రం అనుకోరు. ఎందుకంటే ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది కదా. ఫైపెచ్చు పిల్లలను విసుక్కుంటా ఏంటి? సరిగ్గా చూసుకోవు అంటూ ఎత్తిపొడుపులు. బాధ్యతలు నిర్వంచడానికి కూడా కావాలి స్వేచ్చ.

   5 పాయింట్: నాకు చాలా నచ్చింది ఈ పాయింట్. పెద్దవాల్లము అయిపోయిన తర్వాత, వెనక్కి తిరిగి చూసుకుంటే కనిపించేది కేవలం పిల్లలే. ఎంత సంపాదించారు అని ఎవరూ అడగరు, మీ పిల్లలు ఏక్కడ ఉన్నారు, ఏమిచేస్తున్నారు అనే అడుగుతారు. మనకు చివరకు తృప్తి నిచ్చేది సంతానమే.
   Thank you.

   • సత్య says:

    అనుభవం లేనోన్ని!
    నా మాటలు ఎక్కడ ఇబ్బంది పెడతాయోనని శంక వుండింది
    నా కామెంటు ని చక్కగా ఆదరించారు …
    ప్రవీణ గారు మీకు ధన్యవాదాలు.
    -సత్య

 20. సత్య గారు: “అనుభవం లేనోన్ని!”— ప్రతీ విషయం అనుభవంలోకి రాలేదు కదండీ, స్పందించే హృదయముండాలి, ఆలోచించగలిగే మనసు ఉండాలి. Thanks you…

 21. సరయు గారు: ఈ పోస్ట్ లో పక్షపాతం ఎక్కడ ఉందండి? Mainly I wrote about kids కదా??

 22. Ravi babu says:

  రాజెష్ గారు చాలా చక్కగా చెప్పారండి, మీరు ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోతున్నారు,
  ఇక్కద పిల్లలకు కావలసింధి తిండితిప్పలు కాధండి, అవి హస్టల్లోను, అనాద ఆస్రమాల్లోను దొరుకుతాయండి.
  అంతకుమించి పిల్లలకు ఇవ్వవలసినవి చాలా ఉన్నాయి , వాటి గురించి నేమాట్లాడేది .
  భార్యా భర్తల బంధమంటే హక్కుల కోసం రోడ్డుకెక్కడంకాదు బంధాలకోసం కలసి ఉండడం.
  మన ఇళ్ళళ్ళో అన్నాతమ్ముళ్ళ మద్య ,అక్కచెల్లెళ్ళమద్య , తల్లిదండ్రులు-పిల్లల మద్య విభేధాలు కోపాలు
  తాపాలు రావా ? సర్ధుకు పోవట్లేధా విడాకులు తీసుకుంటున్నమా? ఎంధుకు భార్య భర్తల మద్యనే ఇంత రాద్ధాంతాలు?
  వీళ్ళ ఇగోల మద్య పిల్లల్ని బలిచేయడం న్యాయమా చెప్పండి?

  • రవి బాబు గారు: ఎంత చక్కటి ప్రశ్నవేసారు. “మన ఇళ్ళళ్ళో అన్నాతమ్ముళ్ళ మద్య ,అక్కచెల్లెళ్ళమద్య , తల్లిదండ్రులు-పిల్లల మద్య విభేధాలు కోపాలు
   తాపాలు రావా ? సర్ధుకు పోవట్లేధా విడాకులు తీసుకుంటున్నమా? ఎంధుకు భార్య భర్తల మద్యనే ఇంత రాద్ధాంతాలు?” .
   ఒక వ్యక్తి వ్యక్తిత్వం భర్య/భర్త గానే బయట పడుతుందేమో? జోడు గుర్రాలలో సరైన అవగాహనా లేకపోతే బండి సాగదు. ఈ జోడు గుర్రాలు కేవలం భర్య, భర్త. అన్న, అక్క, తల్లిదండ్రులు విరేవ్వరు కాదు.
   సంపదల కంటే సంబంధం ముఖ్యం. well said. Thanks andi.

 23. Prabandh Pudota says:

  మొదటిగా చెప్పాల్సింది..మీ పోస్ట్ బాగుందండి..బాగా రాసారు.
  మీరు అమ్మ మీద ఒక పోస్ట్ రాసారు కదా…ఆ పోస్ట్ కి లింక్ తృష్ణ గారి బ్లాగ్ లో కనపడితే..అక్కడినుండి ఇక్కడికి వచ్చాను. మీరు రాసిన పోస్ట్ నచ్చింది..మిగతా పోస్ట్ లు కూడా చూద్దామని ఒక లుక్ వేస్తూ…ఒక్కొటిగా చదువుతున్నా…ఈ పోస్ట్ ఎందుకో నచ్చింది…ఏదో తెలిసింది అని అనిపించించింది (ఏం తెలిసింది అని అడగకండెం..)…ఒక కామెంట్ రాయాలనిపించి రాస్తున్నా.మీ పోస్ట్ లకు కామెంట్ రాసిన వాళ్ళు కూడా బాగా రాసారండి..
  ఇలాంటిదే మా వుమ్మడి కుటుంబం లో జరిగిందండి…అన్నయ్యకి వదినకి (పెదనాన్న,చిన్న అత్తయ్య వాళ్ళ పిల్లలు) ఇంట్లోవాల్లందరు కలిసి పెళ్లి చేసారండి..ఆరు నెలలు బాగానే గడిచే..తర్వాత మొదలయ్యింది వదినకి హింస…నిన్నే విడాకులు తీసుకోవటానికి ఇద్దరు అంగికరించి, యేవో సంతకాలు పెట్టడానికి ఇంటికొచ్చారని నాన్న చెప్పాడు.తనకి పిల్లలు లేరు…మధ్యలో ఓసారి తనకి గర్బం వచ్చింది కానీ అప్పుడు,ఏదో తెలియక ఏదో తిన్నది.గర్బస్రవం అయ్యింది…అప్పుడు చాలా క్రుంగి పోయింది..కాని ఇప్పుడు దాన్ని తలుచుకొని..ఇప్పుడు ఆ బిడ్డే వుంది వుంటే ఎలవుందేదో.. ఏది జరిగిన మన మంచికేలే అనుకుంటుంది…పాపం పిచ్చి తల్లి..

  • ప్రబంధ పూదోట: తృష్ణ గారి పుణ్యమా అని మీరు నా రాతలు చదవగాలుగుతున్నారు. I am glad that you likes my post. అందరికి తెలిసిన విషయాన్నే నేను నాకు తోచిన మాటల్లో రాసాను.
   “పాపం పిచ్చి తల్లి”…బాధగా అనిపించింది. ఏది మంచో ఏది చెడో కాలమే నిర్ణయించాలి. చేదు జ్ఞాపకాలు తొందరగా మరిచిపోయి, మనసెరిగిన మంచి తోడూ దొరకాలని దేవుడ్ని ప్రార్దిద్దాం.

 24. keerthi says:

  i want prabandh pudota mail id.i have so many problems,i want justice

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s