అనగనగా ఒక రాజంట, రాజరికంలో రాజు కాదు
అనగనగా ఒక రాజంట. రాజరికంలో రాజు కాదు, ప్రజాస్వామ్యంలో రాజన్నమాట. రాజరికంలో రాజుకన్నా శక్తి గల వాడు ఈ ప్రజాస్వామ్యంలో రాజు.
ఈ రాజు పరిపాలించే రాజ్యం ఎక్కడనుకుంటున్నారు? మరెక్కడో కాదు…మన ప్రపంచంలో, మన దేశంలో, మన రాష్ట్రం.
దొరికిందల్లా దోచేసుకునే శక్తి, ఎదురు తిరిగే వాళ్ళను అణిచివేసే సామర్ధ్యం……ఆపైన ప్రజాస్వామ్యం…
ఇంకేముంది, అయినవాళ్ళకు రాసిచ్చేసాడు రాజ్యాన్ని……..మీ ఇష్టం ఏలేసుకోండి, పీల్చేసుకోండి…. మిగతాదంతా నేచూసుకుంటా.
ఇంకేం, పల్లకీ మోసే బోయీలు తయారు…..”రాజు, రారాజు……మహారాజు…”
మన రాజు గారికి, వారు కుప్పలు తెప్పలుగా ఎన్ని కోట్లకు కోట్లు కూడపెట్టారో లెక్కలు తెలియవు కానీ, వారి రాజ్యంలోని పిచ్చి ప్రజల అమాయకత్వపు లెక్కలు మాత్రం భహు బాగా తెలుసు.
పంచభక్ష్య పర్వాన్నాలు భుజించిన తర్వాత, చేతిని dettol liquid wash తో కడిగేసుకోకుండా, ప్రజల వైపు విదిలించారు దయగల మహారాజులు. ముని వేళ్ళకు అతుక్కున్న ఎంగిలి మెతుకులు రాలాయి….
ప్రజలలో ఆనందం, రాజు గారి సహృదయానికి మహదానందం, పరమానందం ….చప్పట్లు, జేజేలు, పొగడ్తలు……
“రాజు, మహా రాజు, ప్రజల రాజు, పేదల రారాజు, పధకాల రారాజు…..”
ప్రజాస్వామ్యంలో ప్రజలే కద రాజులు పుస్తకాలలో. చెదలు పట్టిన పుస్తకాల గురించి ప్రజలకేం తెలుసు? రాజ్యాగంలో రాతలు, ప్రజల తల రాతలు, నాయకుల చేత వాతలు. హక్కులు సామాన్య ప్రజల దాక చేరే అవకాశం ఏది?
ఎన్నికలోస్తాయి, నోట్లు రాలతాయి, ఓట్లు పడతాయి…..
పదవులు వరిస్తాయి, వాగ్ధానాలు అటకేక్కుతాయి, కోట్లు మూటకేక్కుతాయి…
ఐదేళ్ళకొకసారి జరిగే పంచతంత్ర ప్రణాళికా పధకం ఇది,
రోజురోజున రాజులకు వడ్డించే పంచభక్ష్య పర్వాన్నాల సూత్రం ఇది!
కోటలో రాజయినా, కాటిలో కాపరయినా,
చివరకు చేరేది స్మశానానికే,
కాపరి మొదలు, తుదలు అదే,
రాజు తుదలు, యువరాజు మొదలు.
ప్రజాస్వామ్యమా నువ్వు బతుకు…మమ్మల్ని బతికించు……
నైస్ బాగుంది….నేడు జరుగుతున్నది అదేకదండి.
డేవిడ్ గారు: ఏ రాజైన ఏ నాడైనా జరిగేది ఇదే కదండీ. Thanks andi
@ dettol liquid wash
cool 🙂
@ఏ రాజైన ఏ నాడైనా జరిగేది ఇదే కదండీ
Yeah …
మౌళి గారు: ఇంత సింపుల్ కామెంట్ పెట్టారు మీరు??!! 🙂 🙂
Thanks andi..
ఏ రాజైన ఏ నాడైనా జరిగేది ఇదే కద, అని నమ్మాక చెప్పడానికి ఇంకేముంటుంది 🙂