కష్టంలో సుఖం, సుఖంలో కష్టం
కష్టం నన్ను కష్టిద్దామని ఎంతో కష్టపడుతుంది. కొన్ని సార్లు నాకంటే పెద్దగా, మరి కొన్నిసార్లు నా కంటే చిన్నగా, కొన్నిసార్లు నా ముందు, మరి కొన్నిసార్లు నా వెనుక…నీడల నన్ను వెంబడిస్తుంది.
కష్టానికే తెలియని కష్టమేమిటంటే, కష్టం తన ప్రతీ కష్టంలోనూ నన్ను సానపెడుతుంది.
కష్టం తన కష్టాల సమ్మెట పోటులతో నన్ను శిల్పంగా చెక్కుతుంది.
కష్టం తన కష్టంతో నన్ను కష్టించి కష్టించి…..
చివరకు కష్టాలకు నేను అలవాటైపోవటం కాదు, నాకే కష్టాలు అలవాట్లుగా మారిపోయాయి.
ఇక, కష్టం నన్ను కష్టించటం మానేసింది.
ఎప్పుడైతే కష్టాలకు నేను లొంగిపోకుండా ఎదురు నిలిచానో,
అప్పుడు కష్టం తన మనసు కష్టపెట్టుకుని, నన్ను కష్టించటం మానేసింది.
అప్పుడు…అప్పుడు…కష్టాల కడలిలో నుంచి సుఖం ఉద్భవించింది.
సుఖం భాజా భజంత్రీలతో, పల్లకీలో ఊరేగుతూ గుంపుగా వచ్చింది.
సుఖం ఒంటరిగా రాకుండా బోల్డు నేస్తాలను మోసుకొచ్చింది.
కొన్నినాళ్ళు, సుఖం నన్ను చాలా సుఖ పెట్టింది.
సుఖమైన మైకంలో నన్ను మురిపించింది.
మరి కొన్నినాళ్ళు గడిచి గడవక ముందే,
సుఖాన్ని సుఖంగా అనుభవించక ముందే,
సుఖంలో సుఖం సెలవు తీసేసుకుంది.
సుఖం సుఖం అని కలవరించానా….
సుఖం నన్ను సుఖంగా నిద్రన్నా పోనివ్వటంలేదు.
సుఖం కష్టాల సుఖాన్ని నాకు తెలియచెప్పింది.
ఇంతా కష్టపడి సుఖాన్ని సాధించుకున్న తర్వాత తెలిసిందేమిటంటే,
సుఖాన్ని సాధించుకోవటం పెద్ద కష్టమేమి కాదని,
నేను పడ్డ కష్టం పెద్ద కష్టమేమి కాదని,
అసలు కష్టం ఇప్పుడే మొదలయిందని!
విజయాన్ని సాధించుకోవటం కాదు కష్టం,
విజయాన్ని నిలబెట్టుకోవటమే అసలు కష్టం
నాణేనికి
రెండు వైపులూ ఉంటేనే
దానికి విలువ
అలాగే-
కొంచెం కష్టం
కొంచెం సుఖం
ఉంటేనే జీవితానికి అర్ధం
కష్టం సుఖం
తెలియని వాడి
జీవితం వ్యర్ధం
అదే జీవిత పరమార్ధం….
బాగా రాశారు…
Very well written………………
బాగా చెప్పారు,
బొమ్మ బాగుంది…సుఖ-దు:ఖాలు రెండూ కవలలు!
విజయాన్ని గమ్యం దాకా లాక్కోచ్చేది కష్టం , గమ్యాన్ని తిరిగి మజీలీగా మార్చేది సుఖం,.
ఆరాటం-పోరాటం.
విజయాన్ని నిలబెట్టుకోవాలన్న ఆరాటం సుఖానిది , నిలబెట్టటానికై పోరాటం కష్టానిది.
ప్చ్ …..కష్టం తీరినా, సుఖం తీరదు.
-సత్య
శ్రీనివాస రెడ్డి గారు: కష్టం లేనిదే సుఖం విలువ తెలీదు. బాగా చెప్పారు. ధన్యవాదాలు.
వంశి గారు: థాంక్స్ అండి..
సత్య గారు: నలుగు మాటల్లో నేను చెప్పలనుకుందంతా చెప్పేసారు. కష్టం తీరినా, సుఖం తీరదు. ధన్యవాదాలు.
kastam gurinchi chala kastapadi rasaru…
sarayu garu: haahaa… కష్టం గురించి కష్టం లేకుండా రాసేసానండి. అసలు కష్టం కష్టాన్ని భరించటమే. Thank you.